For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Indian Cricketers:భారత క్రికెటర్లు హెల్దీగా, ఫిట్ గా ఉండేందుకు ఏమి చేస్తారంటే...

ప్రపంచ కప్ సమయంలో భారత క్రికెటర్లు హెల్దీ మరియు ఫిట్ గా ఉండేందుకు ఏం చేస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టి20 వరల్డ్ కప్ హీట్ పెరిగిపోయింది. ఇక మన దేశంలో అయితే గల్లీ నుండి ఢిల్లీ దాకా.. మన దాయాది దేశంలోనూ లాహోర్ నుండి రావల్పిండి వరకూ అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మ్యాచ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.

How Indian Cricketers Stay Fit And Healthy During The World Cup

ఆదివారం 24వ తేదీన టి20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు దాదాపు 8 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు కోట్లాది మంది అభిమానులు సిద్ధమయ్యారు.

How Indian Cricketers Stay Fit And Healthy During The World Cup

ఇదిలా ఉండగా.. ప్రపంచ కప్ ఆడే సమయంలో మన భారత క్రికెటర్లు హెల్దీగా మరియు ఫిట్ గా ఉండేందుకు ఏమి చేస్తారు.. గాయాల నుండి త్వరగా ఎలా బయటపడతారు.. ఎలాంటి వర్కౌట్లు చేస్తారు.. ఎలాంటి ఆహారం తీసుకుంటారు.. ఒత్తిడిని అధిగమించేందుకు ఎలాంటి పనలు చేస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వర్కౌట్లు..

వర్కౌట్లు..

తమ బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరచడం ప్రతి ఒక్క క్రికెటర్ ఫిట్ నెస్ కు చాలా కీలకం. దీని వల్లే బాడీలోని కీళ్లు బలంగా మారతాయి. గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే మైదానంలో స్వేచ్ఛగా, చురుకుగా ఆడేందుకు బాడీని బలంగా మారుస్తుంది. మన భారత క్రికెటర్లు.. మోకాళ్ల చుట్టూ ధ్రుడత్వాన్ని తగ్గించడానికి క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్, స్టాండింగ్ స్నాయువు స్ట్రెచ్ మరియు స్ట్రెయిట్ లెగ్ రైజెస్ వంటి వర్కౌట్లను ఎక్కువగా చేస్తారు.

బలంగా మారేందుకు..

బలంగా మారేందుకు..

స్నాయువు కర్ల్స్, వన్ లెగ్ వాల్ సైడ్స్, ఇన్నర్ థై లిఫ్టులతో పాటు మరికొన్ని వర్కౌట్ల వల్ల మైదానంలో క్రికెట్ ఆడే సమయంలో మెరుగైన కచ్చితత్వం కోసం చేతులు మరియు మొండెంను బలంగా మారుస్తాయి. హామ్ స్ట్రింగ్స్ యొక్క తీవ్రతను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అసాధారణ శిక్షణలో సాధారణ వైఫల్యాల పాయింట్లను తట్టుకునేలా కండరాలను నెట్టివేస్తాయి.

ఆహారం విషయంలో..

ఆహారం విషయంలో..

ఇక ప్రపంచ కప్ లో భారత క్రికెటర్లంతా ఆహారం విషయంలో కఠినమైన ఆహార నియమవాళిని పాటిస్తారు. ఎక్కువగా మిల్లెట్స్, పాల ఉత్పత్తులు, పండ్లు, లీన్ ప్రోటీన్లు, కూరగాయలను తీసుకుంటారు. ఇక శిక్షణ భారీగా ఉన్న సమయంలో మ్యాచ్ కు ముందు గ్రీక్ పెరుగు, పండ్లు లేదా హోల్ గ్రెయిన్ మ్యూస్లీ బార్లు తీసుకుంటారు. తక్కువ ట్రైనింగ్ ఉన్నరోజుల్లో మాత్రం చేపలు, హోల్ గ్రెయిన్ క్రాకర్లు, కూరగాయల కర్రలు, ఉడికించిన గుడ్లు మొదలైన వాటి ద్వారా అధిక ప్రోటీన్లు మరియు తక్కువ కార్బొహైడ్రేట్స్ ఉండే వాటిని తీసుకుంటారు.

గాయాలు మరియు చికిత్స..

గాయాలు మరియు చికిత్స..

ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్ లు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది క్రికెటర్లకు గాయాలయ్యే అవకాశాలు కూడా పెరిగాయి. మనలో చాలా మంది క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ కూడా ఎల్బో గాయం నుండి చాలా కాలం తర్వాత కోలుకున్నారు. ఇక బౌలర్లకైతే తరచుగా భుజాలకు సంబంధించిన గాయాలు, మోకాళ్లకు సంబంధించిన కీళ్ల సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో సరైన చికిత్స తీసుకోవడం.. ప్రతి మూడు, నాలుగు గంటల వ్యవధిలో దాదాపు ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతంపై ఐస్ ప్యాక్ ను వర్తింప జేయడం మరియు మంటను అరికట్టడానికి సాగే కట్టుతో కుదించడం వంటివి చేస్తారు.

వాతావరణ పరిస్థితులు..

వాతావరణ పరిస్థితులు..

ప్రపంచ కప్ లో ఆటగాళ్ల ప్రదర్శన వాతావరణ పరిస్థితులపైనా ఆధారపడి ఉంటుంది. క్రికెటర్లు ద్రవ పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే బాడీలో అధిక ద్రవం కోల్పోవడం(బాడీ బరువులో 2 శాతం) వంటివి జరుగుతాయి. బౌలింగ్ కచ్చితత్వం, రన్నింగ్ వేగం, కూల్, కెపాసిటీ వంటివి ఏకాగ్రతను దెబ్బతీయొచ్చు. క్రికెటర్లు వార్మప్ లు, భోజనం మరియు పానీయాలు, విరామాలు వికెట్లు పడేటప్పుడు మరియు ఆడని సమయంలో అవసరమైన డ్రింక్స్ మాత్రమే వినియోగిస్తారు.

కోహ్లీ స్ఫూర్తి..

కోహ్లీ స్ఫూర్తి..

ఫిట్ నెస్ విషయంలో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తను బాడీ ఫిట్ నెస్ మెయింటెయిన్ చేయడం కోసం ఏకంగా మాంసాహారాన్నే మానేశాడు. యోగా చేయడం, కఠినమైన వర్కౌట్లు చేయడం మొదలుపెట్టాడు. అందుకే మూడు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడు. మైదానంలోనూ చురుకుగా కదులుతున్నాడు.

చివరగా..

2021 టి20 వరల్డ్ కప్ మన మెన్ ఇన్ బ్లూ టీమ్ కచ్చితంగా గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సో మనం కూడా ఇక నుండి చురుకుగా, ఫిట్ గా మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడిపేందుకు మన జీవితంలో మెరుగైన ప్రదర్శకులుగా మారడానికి వారి సూచనలను పాటిద్దాం.

గమనిక : పైన తెలిపిన సమాచారం మొత్తం వైద్య నిపుణుల నుండి సేకరించి పబ్లిష్ చేయబడింది. ఇవే పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా అందరికీ సరిపోకపోవచ్చు. అయితే ఇందులోని సమాచారం మీకు సలహాలు మరియు సూచనలుగా పనికి రావొచ్చు. మీరు వీటిని ఫాలో అవ్వాలంటే.. మీకు ఏవైనా సందేహాలున్నా.. మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

English summary

How Indian Cricketers Stay Fit And Healthy During The World Cup

Here we are talking about the how Indian Cricketers stay fit and healthy during the world cup. Have a look
Story first published:Saturday, October 23, 2021, 16:58 [IST]
Desktop Bottom Promotion