For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హస్త ప్రయోగం మానేయాలంటే.. ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...

హస్త ప్రయోగం అలవాటును తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను, ట్రిక్స్ ఫాలో అవ్వండి.

|

మనలో యవ్వనంలో ఉన్న చాలా మందికి హస్త ప్రయోగం చేసుకునే అలవాటు ఉంటుంది. కొందరైతే హస్త ప్రయోగం చేసుకోనిదే నిద్ర కూడా పరిస్థితుల్లో ఉంటున్నారు. దీని వల్ల సమస్యలు ఉండవు..

How to Stop Masturbating: Tips and Tricks in Telugu

కానీ హస్త ప్రయోగానికి బానిసలుగా మారితే మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఒక్కసారి హస్తప్రయోగం అనేది వ్యసనంగా మారితే, దాని నుండి బయటపడటం చాలా కష్టం.

How to Stop Masturbating: Tips and Tricks in Telugu

ముఖ్యంగా పెళ్లి తర్వాత మీరు ఆ కార్యంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ భాగస్వామితో ఆ కార్యాన్ని ఆనందంగా పూర్తి చేయలేరు. అయితే మీరు హస్త ప్రయోగం అలవాటును మానేయాలని ఆలోచిస్తుంటే.. ఈ టిప్స్, ట్రిక్కులను ఫాలో అవ్వండి.. ఆ అలవాటు నుండి సులభంగా బయటపడండి...

మహిళలు రోజూ చేయాల్సిన ముఖ్యమైన యోగాసనాలు!మహిళలు రోజూ చేయాల్సిన ముఖ్యమైన యోగాసనాలు!

నిద్రకు ముందు..

నిద్రకు ముందు..

హస్త ప్రయోగం అలవాటును తగ్గించుకోవాలంటే.. మీరు నిద్ర పోవడానికి ముందు కచ్చితంగా మూత్రం (వచ్చినా, రాకపోయినా) పోయాలి. ఇలా చేయడం వల్ల దాదాపు ముప్పావు వంతు అలాంటి ఆలోచనలేవే రావట. అలాగే మజ్జీగను తాగాలి లేదా వెచ్చని నీళ్లను తాగాలి. అయితే ఈ రెండింటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకండి.

బాత్ రూమ్ లో తక్కువగా..

బాత్ రూమ్ లో తక్కువగా..

మనలో చాలా మందికి బాత్ రూమ్ లో ఎక్కువ సమయం గడిపే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా కొన్ని గంటల పాటు షవర్ బాత్ లేదా టబ్ బాత్ వల్ల ఉత్తేజంగా ఉంటామనుకుంటారు.. అదే సమయంలో హస్త ప్రయోగం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వీలైనంత త్వరగా బాత్ రూమ్ నుండి బయటికొచ్చేయండి. హస్త ప్రయోగం అలవాటును మానేయండి.

పోర్న్ వీడియోలు చూడటం తగ్గించాలి..

పోర్న్ వీడియోలు చూడటం తగ్గించాలి..

మీరు హస్త ప్రయోగం అలవాటును తగ్గించుకోవడానికి స్మార్ట్ ఫోన్లో, ల్యాప్ టాప్ ఇతర మాధ్యమాల్లో పోర్న్ వీడియోలను చూడటం మానేయాలి. వీటికి దూరంగా ఉంటే, అలాంటి సమస్యలు దాదాపు తగ్గిపోయేందుకు అవకాశం లభిస్తుంది. శృంగార వనరులు తొలగించటం ద్వారా, హస్త ప్రయోగం మీద ఆసక్తిని కోల్పోతారు. హస్త ప్రయోగం వ్యసనం పారద్రోలే మార్గాలలో ఇది కీలకమైనది.

సింగిల్ గా ఉండొద్దు..

సింగిల్ గా ఉండొద్దు..

మనలో చాలా మంది హస్త ప్రయోగం అలవాటును మానేయాలని ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ అది చాలా మంది సాధ్యపడదు. అయితే ఒంటరిగా ఎక్కువ సమయం గడిపేవారికి ఇలాంటి ఆలోచనలు, అలవాట్లు ఎక్కువవుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండకుండా చూసుకోండి. మీరు స్నేహితులతో లేదా కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపితే ఈ అలవాటును తగ్గించుకోవచ్చు.

చలికాలంలో తినాల్సిన పండ్లు! ఇవి చలికాలంలో అనారోగ్యం కాకుండా కాపాడుతాయి...చలికాలంలో తినాల్సిన పండ్లు! ఇవి చలికాలంలో అనారోగ్యం కాకుండా కాపాడుతాయి...

ధ్యానంతో డైవర్ట్..

ధ్యానంతో డైవర్ట్..

ధ్యానం అనేది మీ మనస్సు మరియు శరీరానికి ఎంతో ఆహ్లాదకరమైన వాతారణాన్ని క్రియేట్ చేయడంలో దోహదం చేస్తుంది. మీరు ధ్యానం చేసినప్పుడు, హస్త ప్రయోగం గురించి కాకుండా ఇతర విషయాలు ఆలోచించడానికి మీ మనస్సు మరియు శరీరంను అనుమతిస్తుంది.

ఫుడ్ విషయంలో..

ఫుడ్ విషయంలో..

మీ ఆహారంలో మార్పు చేయటం అనేది హస్త ప్రయోగం విడిచి పెట్టటానికి సాధారణ మార్గాలలో ఒకటి. మీరు విజయవంతంగా అన్ని రకాల కార్యకలాపాలు చేయటానికి శక్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవటం ప్రారంభించండి.

త్వరగా నిద్రలోకి..

త్వరగా నిద్రలోకి..

ఒక పరిశోధన ప్రకారం, మీరు హస్త ప్రయోగం అలవాటును తప్పించుకోవడానికి త్వరగా నిద్రపోవాలట. ఎందుకంటే ఆలస్యంగా నిద్ర పోవడం వల్ల రొమాంటిక్ కోరికలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలా కుదరకపోతే.. మీరు కామిక్స్ చదివినా.. మీకు అలాంటి ఆలోచనలు కలగకుండా మీరు చాలా ఉత్తేజంగా ఉంటారట.

బొమ్మలను దూరంగా విసరండి..

బొమ్మలను దూరంగా విసరండి..

మీకు అధిక హస్త ప్రయోగం త్యజించడం గురించి తీవ్రముగా ఉంటే,మిమ్మల్ని ప్రేరేపించే బొమ్మలను దూరంగా విసరండి. అయితే ఖరీదైన బొమ్మలు విసరటం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

మంచి అనుభూతి పొందాలంటే..

మంచి అనుభూతి పొందాలంటే..

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. మీ జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు మారడము ద్వారా మంచి అనుభూతిని పొందటానికి అనేక తేలికపాటి ఎంపికలు ఉన్నాయి.

స్పోర్ట్స్ లో పాల్గొనండి..

స్పోర్ట్స్ లో పాల్గొనండి..

హస్త ప్రయోగం నుండి మీ మైండ్ ను డైవర్ట్ చేయడానికి మీరు రెగ్యులర్ గా ఏవైనా గేమ్స్ లో పాల్గొనండి. ముఖ్యంగా ఫుట్ బాల్, త్రో బాల్, బాస్కెట్ బాల్ వంటి క్రీడలను ఎక్కువగా ఆడండి. ఈ క్రీడలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు బలంగానూ ఉంచుతాయి.

English summary

How to Stop Masturbating: Tips and Tricks in Telugu

Here we are talking about the how to stop masturbating: tips and tricks in Telugu. Have a look
Story first published:Thursday, December 16, 2021, 14:53 [IST]
Desktop Bottom Promotion