For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Health Tips:సమ్మర్లో ఈ సహజమైన వాటర్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా...

ఈ సహజమైన నీరు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఒక రోజులో సుమారు ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. అలాగే టైమ్ టు టైమ్ ఆహారం తీసుకోవాలి. వీటితో నీటిని తగిన మోతాదులో తాగుతూ ఉండాలి.

Impressive Health Benefits Of Detox Water In Telugu

అందుకే చాలా మంది వైద్యులు, నిపుణులు ఉదయం లేవగానే ఒక గ్లాసు మంచి నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. అయితే మీరు సాధారణంగా తాగే మంచి నీళ్ల ప్లేసులో డిటాక్స్ వాటర్ తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Impressive Health Benefits Of Detox Water In Telugu

ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీళ్లను తాగితే మీరు చురుకుగా ఉండటమే కాదు.. ఎక్కువ శక్తిని కూడా పొందుతారు. అదే విధంగా మీరు సులభంగా బరువు తగ్గుతారు. ఈ నీటిని రెగ్యులర్ గా తాగడం వల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆయుర్వేదం ప్రకారం, ఈ ఆహారాలతో పాటు వీటిని తినకూడదు ...తింటే ప్రమాదకరం ...!ఆయుర్వేదం ప్రకారం, ఈ ఆహారాలతో పాటు వీటిని తినకూడదు ...తింటే ప్రమాదకరం ...!

వెయిట్ లాస్..

వెయిట్ లాస్..

మనం రెగ్యులర్ గా మన బాడీకి తగ్గట్టు నీటిని తాగితే.. వెయిట్ ఈజీగా తగ్గే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు. అయితే మాములు నీళ్లకు బదులు డిటాక్స్ వాటర్ తాగితే టాక్సిన్లు తగ్గిపోయి.. వెయిట్ చాలా ఈజీగా తగ్గిపోతారు. ఈ నీళ్లు మన బాడీలో మెటబాలిజాన్ని పెంచుతాయి. అప్పుడు క్యాలరీలను వేగంగా కరిగేలా చేస్తాయి. అప్పుడు మీరు ప్రతిరోజూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మరియు చాలా ఫ్రీగా ఉండేలా చేస్తాయి. అలాగే ద్రాక్ష పండ్లలో ఉండే ఎంజైమ్స్.. బాడీలోని షుగర్ ఉపయోగించుకునేలా చేసి మెటబాలిక్ రేటును పెంచుతాయి. దీని వల్ల మీరు వెయిట్ చాలా ఈజీగా తగ్గుతారు.

డైజేషన్ ఇంప్రూవ్ మెంట్..

డైజేషన్ ఇంప్రూవ్ మెంట్..

మన బాడీలో డైజేషన్ సక్రమంగా జరగాలంటే.. తగినన్ని నీళ్లు అవసరమన్న విషయం మనలో చాలా మందికి తెలిసిందే. ఈ నీళ్లు మన జీర్ణాశయాన్ని క్లీన్ చేస్తాయి. అంతేకాకుండా మోషన్స్ వంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. నిమ్మరసం వంటి వాటితో చేసిన డీటాక్స్ వాటర్లో.. ఆస్కారిక్ ఆమ్లం ఉండటం వల్ల మన జీర్ణక్రియ ఆరోగ్యంగా కొనసాగుతుంది. అలాగే మీరు ప్రతిరోజూ ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల.. మన ఆహారంలోని వ్యర్థ పదార్థాలు బాడీ నుండి వేగంగా వెళ్లిపోతాయి.

ఇమ్యూనిటీ శక్తి ఇంప్రూవ్ మెంట్..

ఇమ్యూనిటీ శక్తి ఇంప్రూవ్ మెంట్..

మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ బలంగా ఉంటే వ్యాధులు మన దరికి చేరవు. అందుకే డీటాక్స్ వాటర్ ను తాగుతూ ఇమ్యూనిటీ పవర్ ను బలంగా మార్చుకోవాలి. పండ్లు, కూరగాయలు వంటివి కూడా మీ ఇమ్యూనిటీ పవర్ ను బలంగా మారుస్తాయి. ముఖ్యంగా ‘విటమిన్ సి' ఉత్పత్తులను తరచూ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. డీటాక్స్ వాటర్.. మన శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థ పదార్థాలు, ఫ్రీ రాడికల్స్ ని తొలగించి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.

కాలేయం నుండి టాక్సిన్లను..

కాలేయం నుండి టాక్సిన్లను..

మన బాడీలో లివర్ చేసే పని గురించి చాలా మందికి తెలియదు. మన బాడీలోని వ్యవస్థలన్నింటినీ లివర్ క్లీన్ చేసి, టాక్సిన్లు, ఫ్రీ రాడికల్స్ వంటి వాటిని తొలగిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది బిజీ లైఫ్ కారణంగా లేదా ఇతర కారణాల వల్ల ఎన్నో చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. దీని వల్ల మీరు జీవించే విధానం వరకూ ప్రతి ఒక్కటి.. మన శరీరంలో టాక్సిన్లకు చోటు కల్పిస్తూ.. లివర్ పై ఒత్తిడిని పెంచుతున్నాయి. లివర్ ని టాక్సిన్ల నుండి దూరంగా ఉంచడం.. అలాగే రెగ్యులర్ గా ఈ టాక్సిన్లను తొలగించడం ఎంతో అవసరం. ఈ డీటాక్స్ వాటర్ మన బాడీ నుండి టాక్సిన్లను తొలగిస్తుంది.

ఎనర్జీ లెవెల్స్..

ఎనర్జీ లెవెల్స్..

మన బాడీలో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన మూడ్ పైనా మరియు మన ఎనర్జీ లెవెల్స్ పై ఎంతో ప్రభావం చూపుతాయి. ఈ వాటర్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల తలనొప్పి వంటి సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు.

అలాగే మన బాడీలోని వాపులు, నీరు పేరుకుపోవడం వంటి సమస్యలన్నింటినీ అధిగమించొచ్చు. ఇది లివర్ ని కూడా క్లీన్ చేస్తుంది కాబట్టి.. మీరు మరింత శక్తివంతంగా మారతారు. కాబట్టి మీరు రోజంతా చాలా శక్తివంతంగా మారతారు. కాబట్టి సమ్మర్ లో శక్తిని కాపాడుకోవడానికి, పెంచుకోవడానికి ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. లెమన్ వాటర్, గ్లూకోజ్ వాటర, ఓఆర్ఎస్ వాటర్ తాగాలి.

డీటాక్స్ వాటర్ తో..

డీటాక్స్ వాటర్ తో..

డీటాక్స్ వాటర్ ఆరోగ్య పరంగానే కాదు.. సౌందర్య పరంగా కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ స్కిన్ గ్లో పెరగడాన్ని కూడా మీరు గమనించొచ్చు.

ఏమేమీ కావాలంటే..

ఏమేమీ కావాలంటే..

ఈ డీటాక్స్ వాటర్ ను బయట కొనుక్కొని తాగాలని మాత్రం ఎలాంటి రూల్ లేదు. కాబట్టి దీన్ని మీరు స్వయంగా మీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే అందుకోసం మీరు ముందుగా మంచినీళ్లతో పాటు కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, హెర్బ్స్ కావాల్సి ఉంటుంది. సాధారణంగా డీటాక్స్ వాటర్ తయారు చేయాలంటే రెండు వస్తువులు కావాలి. అందులో ఒకటి మనకు నచ్చిన పండ్లు, కూరగాయలు, లేదా హెర్బ్స్. వీటిని క్లీన్ చేసుకుని.. మీకు కావాలంటే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని వేడి చేసిన లేదా చల్లని నీటితో కలుపుకోవాలి. ఒక వేళ నీళ్లు అయితే.. ముందుగానే నీటిని వేడి చేసుకుని పదార్థాలను కలుపుకోవాలి. చల్లని నీరు కావాలంటే.. ఇవన్నీ కలిసిన తర్వాత.. ఒకటి, రెండు గంటల పాటు ఫ్రిజ్ లో పెడితే చాలు. అంతే మీకు కావాల్సిన డీటాక్స్ వాటర్ రెడీ అయిపోతుంది.

నిమ్మ, కీర దోసతో..

నిమ్మ, కీర దోసతో..

ముందుగా నిమ్మకాయను చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత దాని రసాన్ని తీసి పెట్టుకుని, కీరదోసను సన్నని చక్రాలు మాదిరిగా కట్ చేసి పెట్టుకుని.. బాగా కలపాలి. మీకు కావాలంటే ఈ మిశ్రమంలోకి కొన్ని పుదీనా ఆకులను కూడా కలుపుకోవచ్చు. వీటిని పుదీనాతో కలపడం వల్ల మొటిమలు తగ్గుతాయి.

వీటినన్నింటినీ ఫ్రిజ్ లో పెట్టి.. రెండు, మూడు గంటల తర్వాత తాగితే.. మీకు అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. అందుకే డిటాక్స్ వాటర్ తాగుతూ ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.

English summary

Impressive Health Benefits Of Detox Water In Telugu

Here are the impressive health benefits of detox water in telugu. Take a look.
Desktop Bottom Promotion