For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FabiSpray:కరోనాను కట్టడి చేసే నాసల్ స్ప్రే.. దీని ధరెంత.. ఇదెలా పని చేస్తుందంటే...

|

ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ వణికించిన కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రతిరోజూ శాస్త్రవేత్తలు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇప్పటికే ఐదు రకాల టీకాలను సైతం కనిపెట్టారు. వీటిని విజయవంతంగా అందరికీ అందజేస్తున్నారు.

అయితే కరోనా మహమ్మారి మాత్రం కొత్త వేరియంట్ల రూపంలో మనల్ని మరింత భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో తాజాగా మరో ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది నేరుగా మార్కెట్లో విక్రయించేందుకు సైతం ఆమోదం పొందింది.

ముంబైకి చెందిన గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ డెవలప్ చేసిన నాసల్ స్ప్రేకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI) ఆమోదం తెలిపింది. నైట్రిక్ ఆక్సైడ్ స్ప్రేను "Fabispray" పేరుతో విక్రయించనున్నట్లు గ్లెన్ మార్క్ కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ స్ప్రే ఎలా పని చేస్తుంది.. దీని ధర ఎంత అనే విశేషాలతో పాటు ఈ ఔషధానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం....

టీకాలు వేసుకున్న వారికి మరియు వేసుకోని వారికి ఓమిక్రాన్ లక్షణాలు భిన్నంగా ఉంటాయి....

ఎలా పని చేస్తుందంటే..

ఎలా పని చేస్తుందంటే..

దీన్ని ముక్కు శ్లేష్మం మీద స్ప్రే చేయగానే కరోనా వైరస్ కు, భౌతిక, రసాయన అవరోధంగా పని చేస్తుందని ఆ సంస్థ వివరించింది.‘ఈ స్ప్రే ఎగువ శ్వాస నాళాల్లోని కరోనా మహమ్మారిని కట్టడి చేస్తుంది. SARS-Cov-2పై ప్రత్యేకంగా యాంటీ మైక్రోబయల్ లక్షణాలను ప్రేరేపించి, లంగ్స్ కు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. దీన్ని స్ప్రే చేసిన 24 గంటల తర్వాత 94 శాతం, 48 గంటల తర్వాత 99 శాతం వైరల్ లోడ్ ను తగ్గిస్తుంది. ఇది చాలా సురక్షితమైంది. ఇది వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది' అని గ్లెన్ మార్క్ కంపెనీ ప్రకటించింది.

మార్కెటింగ్ అనుమతి..

మార్కెటింగ్ అనుమతి..

Fabispray క్లినికల్ ట్రయల్ డేటా గురించి ఎలాంటి సమాచారాన్ని ఎలాంటి గుర్తింపు పొందిన పీర్-రివ్యూ జర్నల్ లో పబ్లిష్ చేయలేదు. అయితే దీనికి యూరోపియన్ యూనియన్ నుంచి ‘CE' గుర్తింపు లభించడం విశేషం. దీంతో ఆ దేశాల్లో ఈ స్ప్రేను విక్రయించేందుకు అనుమతి లభించింది. ‘CE'అనేది వైద్య సామాగ్రి మార్కెటింగుకు పర్మిషన్ కు సంబంధించినది. యూరోపియన్ జనరల్ మెడికల్ డివైజెస్ డైరెక్టివ్ లో ఉండాల్సిన కనీస అవసరాలను ఇది తీరుస్తుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

గతంలోనే కొన్ని దేశాల్లో..

గతంలోనే కొన్ని దేశాల్లో..

Fabispray ఎన్ వోయిడ్ పేరుతో గతంలోనే ఇజ్రాయెల్, బహ్రెయిన్ దేశాల్లో విక్రయానికి ఆమోదం దక్కించుకున్నాయని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే, నాసల్ స్ప్రేలు, నోటి ద్వారా తీసుకునే మందులను రెండో తరం కోవిద్ టీకాలుగా నమ్ముతామని, ఇంకా కొన్ని వారాలు, నెలల్లో ఇవి అందరికీ అందుబాటులోకి వస్తాయని, గత సంవత్సరం నవంబరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వివరించారు.

ప్రతిరోజూ పారాసెటమాల్ వాడకం ప్రాణాంతకం, రక్తపోటు మరియు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందట...

స్ప్రేతో ఎక్కువ ప్రయోజనాలు..

స్ప్రేతో ఎక్కువ ప్రయోజనాలు..

కరోనా టీకాను ఇంజెక్షన్ రూపంలో తీసుకునే కంటే.. ఇలా స్ప్రే ద్వారా తీసుకునే వ్యాక్సిన్ల వల్ల ఎక్కువ మరియు ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని, ఇప్పటికే ప్రపంచంలో 129 క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, మరో 194 దేశాల్లో వీటిని డెవలప్ చేస్తున్నారని చెప్పారు.

ధర ఎంతంటే..

ధర ఎంతంటే..

Fabispray 25ml స్ప్రే యొక్క రిటైల్ ధర రూ.850. దీన్ని కొనుగోలు చేయాలనుకునేవారు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుండి ప్రిస్కిప్షన్ కచ్చితంగా తీసుకోవాలి. మన దేశంలో 20 క్లినికల్ సైట్లలో 306 మంది పెద్దలకు, కోవిద్ రోగులకు నిర్వహించిన మూడో క్లినికల్ ట్రయల్స్ తర్వాత ఈ స్ప్రేకి ఆమోదం లభించింది. ఇది ఆసుపత్రిలో చేరిన కోవిద్ రోగులకు ముఖ్యంగా పెద్దలకు చాలా ఉపయోకరమని మరియు ఎంతో సురక్షితమైందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. దీనికి సంబంధించిన ట్రయల్స్ గతేడాది ఆగస్టు 2021 మరియు జనవరి 2022 మధ్య నిర్వహించబడ్డాయి.

అధ్యయనంలో ఏం తేలిందంటే..

అధ్యయనంలో ఏం తేలిందంటే..

భారతదేశంలో నిర్వహించిన క్లినికల్ అధ్యయనంలో కోవిద్-19 యొక్క పురోగతి ప్రమాదం ఉన్న రోగులను విశ్లేషించింది. వీరిలో టీకాలు వేయని రోగులు, వయసు పైబడిన వారు లేదా కొమొర్బిడిటీలు ఉన్నవారిని పరిశీలించింది. నాసికా స్ప్రేతో పాటు అధ్యయనం సమయంలో రోగులందరూ కోవిద్-19 కోసం ప్రామాణిక సహాయక సంరక్షణను పొందారు. ఈ స్ప్రే తీసుకోని వారితో పోలిస్తే.. స్ప్రే తీసుకున్న వారిలో వైరల్ లోడ్ వేగంగా తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. ఇది తీసుకున్న 24 గంటల్లో 94 శాతం వైరల్ లోడ్ తగ్గిందని, 48 గంటల్లో 99 శాతం తగ్గిందని పరిశోధకులు గుర్తించారు.

Fabispray ధర ఎంత? ఎవరు ఆమోదించారు?

Fabispray 25ml స్ప్రే యొక్క రిటైల్ ధర రూ.850. దీన్ని కొనుగోలు చేయాలనుకునేవారు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుండి ప్రిస్కిప్షన్ కచ్చితంగా తీసుకోవాలి. మన దేశంలో 20 క్లినికల్ సైట్లలో 306 మంది పెద్దలకు, కోవిద్ రోగులకు నిర్వహించిన మూడో క్లినికల్ ట్రయల్స్ తర్వాత ఈ స్ప్రేకి ఆమోదం లభించింది. ఇది ఆసుపత్రిలో చేరిన కోవిద్ రోగులకు ముఖ్యంగా పెద్దలకు చాలా ఉపయోకరమని మరియు ఎంతో సురక్షితమైందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. దీనికి సంబంధించిన ట్రయల్స్ గతేడాది ఆగస్టు 2021 మరియు జనవరి 2022 మధ్య నిర్వహించబడ్డాయి.

భారతదేశంలో కరోనాను కట్టడి చేసేందుకు ఆమోదం పొందిన తొలి స్ప్రే ఏది?

భారతదేశంలో తాజాగా మరో ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది నేరుగా మార్కెట్లో విక్రయించేందుకు సైతం ఆమోదం పొందింది. ముంబైకి చెందిన గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ డెవలప్ చేసిన నాసల్ స్ప్రేకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI) ఆమోదం తెలిపింది. నైట్రిక్ ఆక్సైడ్ స్ప్రేను "Fabispray" పేరుతో విక్రయించనున్నట్లు గ్లెన్ మార్క్ కంపెనీ ప్రకటించింది.

English summary

India’s 1st Covid nasal spray FabiSpray for treating adult Covid-19 patients Launched ; Check price, other details in Telugu

FabiSpray: India’s 1st Covid nasal spray for treating adult Covid-19 patients Launched ; Check price, availability and other details in telugu.
Story first published: Thursday, February 10, 2022, 11:59 [IST]
Desktop Bottom Promotion