For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19:ప్రపంచంలోని తొలి డిఎన్ఎ వ్యాక్సిన్.. భారత్ లో వినియోగించేందుకు జైడస్ దరఖాస్తు.. పూర్తి వివరాలు ఇలా...

డిఎన్ఎ ఆధారిత వ్యాక్సిన్ అంటే ఏమిటి? కోవిద్-19కి వ్యతిరేకంగా పని చేసే ఈ వ్యాక్సిన్ గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.

|

కరోనా మహమ్మారి మనల్ని ఎంతలా కలవరపెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఇప్పటికే ఆయా దేశాల్లో కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.

 India to Have Worlds First DNA Vaccine, What Is DNA Based Vaccine Explained in Telugu

మన దేశంలో కూడా కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఉన్నాయి. ఇటీవలే డిఆర్డీఎ 2-డి డ్రగ్ కూడా మార్కెట్లోకి వచ్చింది. ఇక విదేశాల్లో ఫైజర్, స్పుత్నిక్-వితో పాటు ఇతర రకాల టీకాలు వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా DNA ఆధారిత వ్యాక్సిన్ జైకోవో-డి రెడీ అయ్యింది.

 India to Have Worlds First DNA Vaccine, What Is DNA Based Vaccine Explained in Telugu

దీన్ని అత్యవసరంగా వినియోగించడానికి అనుమతి ఇవ్వాలని తాజాగా మరో స్వదేశీ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే దీని క్లీనికల్ ట్రయల్స్ కూడా ప్రారంభమయ్యాయి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన జైడస్ కాడిలా కంపెనీ కోవిద్-19 వ్యాక్సిన్ జైకోవ్-డి యొక్క మూడో దశ క్లినికల్ ట్రయల్ జరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా జులై 21వ తేదీన మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. ఇది ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్. ఈ టీకాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకందాం...

Bird Flu: భారత్ లో తొలిసారి బర్డ్ ఫ్లూతో బాలుడి మృతి.. ఈ వైరస్ నుండి తప్పించుకోవాలంటే.. ఇవి చేయండి..Bird Flu: భారత్ లో తొలిసారి బర్డ్ ఫ్లూతో బాలుడి మృతి.. ఈ వైరస్ నుండి తప్పించుకోవాలంటే.. ఇవి చేయండి..

ఈ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది..

ఈ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది..

ఇది వైరస్ యొక్క జన్యు సంకేతం నుండి తయారు చేయబడింది. ఈ DNA వ్యాక్సిన్ ద్వారా, వైరస్ యొక్క భాగం జన్యు సంకేతం (DNA లేదా RNA) మానవ శరీరంలోకి పంపుతారు. ఇది మానవుని శరీరంలోని రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. దీని వల్ల మానవ శరీరంలోని కొన్ని భాగాలు ఆ జన్యు సంకేతాన్ని డీకోడ్ చేస్తాయి. అలాగే వైరస్ ను గుర్తించి దాంతో పోరాడటానికి యాంటిజెన్లను బాగా ఉత్పత్తి చేస్తాయి.

మూడు మోతాదులు..

మూడు మోతాదులు..

ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు.. ఈ DNA ప్లాస్మిడ్ ఆధారిత వ్యాక్సిన్ మూడు మోతాదులుగా ఇవ్వబడుతుంది. ఈ టీకాను ప్రతి 4-4 వారాల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. మూడో మోతాదు తీసుకున్న తర్వాత వైరస్ సంక్రమణకు వ్యతిరేకంగా వంద శాతం రక్షణ దొరుకుతుంది. ఈ వ్యాక్సిన్ 12 నుండి 18 సంవత్సరాల వయసులో ఉండే వెయ్యి మందితో పాటు పెద్దలు, కౌమర దశలో ఉండే వారిపై కూడా పరీక్షింపబడింది.

ఎక్కడైనా నిల్వ ఉంచొచ్చు..

ఎక్కడైనా నిల్వ ఉంచొచ్చు..

దీని ప్రత్యేకత ఏంటంటే ఈ వ్యాక్సిన్ ను రెండు నాలుగు డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఉంచొచ్చు. ఉదాహరణకు ఫైజర్ మరియు మోడెర్నా వంటి టీకాలను కచ్చితంగా చల్లని ఉష్ణోగ్రతలలోనే నిల్వ చేయాలి. దీని కారణంగా రవాణా, నిల్వతో పాటు ఇతర రకాల సమస్యలు ఉన్నాయి. దీనికి భిన్నంగా జైకోవ్-డి నుండి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా నిల్వ చేయొచ్చు. దీని వీటిని రవాణా చేయడానికి మరియు నిల్వ చేయడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.

Norovirus Outbreak:కొత్తగా నోరో వైరస్ కలకలం.. దీని లక్షణాలేంటి.. ఇది ఎలా సోకుతుందంటే..Norovirus Outbreak:కొత్తగా నోరో వైరస్ కలకలం.. దీని లక్షణాలేంటి.. ఇది ఎలా సోకుతుందంటే..

ఇంజెక్షన్ అవసరం లేదు..

ఇంజెక్షన్ అవసరం లేదు..

ఈ టీకా ఇంజెక్షన్ అవసరం లేకుండా ఇవ్వబడుతుంది. దీని కోసం ఓ అప్లికేషన్ ఇంజెక్షన్ లేని ఫార్మా జెట్ ఉపయోగించబడుతుంది. వ్యాక్సిన్ నింపిన తర్వాత ఈ ఫార్మ జెట్ మెషీన్ చేయిపై వేస్తారు. తర్వాత టీకా యంత్రం యొక్క బటన్ నొక్కిన వెంటనే అది మన బాడీలోకి చేరిపోతుంది.

12 కోట్ల ఉత్పత్తులు..

12 కోట్ల ఉత్పత్తులు..

ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించిన వెంటనే ఏడాది 12 కోట్ల డోసుల ఉత్పత్తి చేసేలా జైడిస్ క్యాడిలా ప్రణాళికలు రూపొందించింది. ఇదిలా ఉండగా ‘జైకోవ్-డి'కు అనుమతులు లభిస్తే మాత్రం ప్రపంచంలోనే తొలి డిఎన్ఎ ఆధారిత కరోనా వ్యాక్సిన్ అవుతుంది.

ఐదో టీకా..

ఐదో టీకా..

మన దేశంలో ఇప్పటివరకు నాలుగు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అవి కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వి, ఫైజర్. వీటిలో మూడు డోసుల టీకాలు 66.6 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్టు మధ్యంతర ఫలితాల్లో వెల్లడైంది.

English summary

India to Have World's First DNA Vaccine, What Is DNA Based Vaccine Explained in Telugu

What is DNA Based vaccine in Telugu: Here is all you need to know about the worlds first DNA based vaccine against Covid-19 in Telugu. Read on
Story first published:Thursday, July 22, 2021, 13:01 [IST]
Desktop Bottom Promotion