Just In
- 6 hrs ago
శుక్రవారం మీ రాశిఫలాలు (13-12-2019)
- 17 hrs ago
ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..
- 17 hrs ago
గుండెపోటుకు ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) ఎలా పొందాలి?
- 18 hrs ago
నమ్మలేని నిజం ! ఆ ఆలయంలో దేవతల విగ్రహాలు ప్రతిరోజూ మాట్లాడతాయని మీకు తెలుసా...!
Don't Miss
- News
చంద్రబాబు, లోకేశ్‌పై సభలో తీర్మానం, ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన, జక్కంపూడి రాజా మద్దతు
- Finance
12,000 పాయింట్లకు పైగా నిఫ్టీ, 300 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
- Technology
దీర్ఘకాలిక ప్లాన్లు, ఆఫర్లు, డిస్కౌంట్ల వైపు చూస్తున్న నెట్‌ఫ్లిక్స్
- Sports
థాయ్‌లాండ్‌లో యువరాజ్ సందడి.. సచిన్, హర్భజన్‌తో బర్త్‌డే వేడుకలు!!
- Movies
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు: ఫస్ట్ డే రెస్పాన్స్.. వర్మ షాకింగ్ రియాక్షన్
- Automobiles
టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మొలకెత్తిన వెల్లుల్లిని బయట పడేస్తున్నారా? ఒక సెకన్ ఆగండి, అందులో అద్భుత ప్రయోజనాలు తెలుసుకోండి..
కూరగాయలలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి కొంతకాలం తర్వాత మొలకెత్తడం ప్రారంభిస్తాయి. వెంటనే మనం వాటిని బయట పడేస్తుంటాము. ఇలా చాలా వరకు మెలకెత్తినవి పడేస్తుంటాము.
బంగాళాదుంపలు మరియు ఉల్లిపాయలను మొలకెత్తిన తర్వాత బయట పడేసిననప్పటికీ, వెల్లుల్లి మొలకెత్తడం వల్ల వాటి పడయకపోవడం ఒక రకంగా మంచిదనే అంటున్నారు ఆహార నిపుణులు. ఎందుకంటే వెల్లుల్లి, మొలకెత్తిన వెల్లుల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్య సంరక్షణ విషయంలో వెల్లుల్లికి సంబంధించి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్య పరంగాను మరియు అందానికి కూడా గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. . జుట్టు సంరక్షణకు వెల్లుల్లి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కానీ అందం సంరక్షణ కంటే వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికే ఎక్కువ మంచి చేస్తుంది.
అయితే వాటిని ఎలా ఉపయోగించస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారో తెలుసుకోవడం మంచిది. మొలకెత్తిన వెల్లుల్లిలో ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. మొలకెత్తిన వెల్లుల్లి గురించి తెలిస్తే మీరు ఇక వాటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. మొలకెత్తిన వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది
సాధారణ వెల్లుల్లిలో కంటే మొలకెత్తిన వెల్లుల్లిలో యాంటిఆక్సిడెంట్స్ అధికం. నేడు చాలా మందిని ప్రభావితం చేసే ప్రధాన సమస్యలలో ఒకటి తరచుగా రోగనిరోధక శక్తి లేకపోవడం. కానీ మొలకెత్తిన వెల్లుల్లి వాడకం అనేక విధాలుగా సహాయపడుతుంది. మొలకెత్తిన వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడానికి గొప్పగా సహాయపడుతుంది. ఇది చర్మ పరిస్థితులకు చికిత్స చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధుల నుండి శరీరంలోని వ్యర్థాలను శుభ్రపరుస్తుంది.

చర్మ సంరక్షణను మెరుగుపరుస్తుంది
మొలకెత్తిన వెల్లుల్లిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మ కణాలను నాశనం చేసే హానికర మాలుక్యులస్ వంటి ఫీరాడికల్స్ తో పోరాడుతుంది. ఫ్రీరాడికల్స్ వల్ల శరీరం చాలా చిన్న వయస్సులోనే వయస్సైన వారిలా కనబడేలా చేస్తుంది.వీటితో పోరాడి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో చర్మంలో మొడతలు, చారలు మరియు ఇతర వయస్సైన లక్షణాలను నివారిస్తుంది.అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. మొలకెత్తిన వెల్లుల్లి శరీరంలోని ముడతలు మరియు ఇతర అందం సమస్యలకు కారణమైన వాటిని నివారిస్తుంది.

రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి
వెల్లుల్లిలో రెండు ముఖ్యమైన అంశాలుంటాయి. అవి రెండు ప్రమాదకర పరిస్థితుల నుండి మనల్ని కాపాడుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిలో ఏజియన్స్ అనే అంశాలు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది .రక్తం గడ్డకట్టడం అనేది తరచుగా మరణానికి కారణమయ్యే పరిస్థితి. రక్తం గడ్డకట్టకుండా మీ శరీరం సజావుగా పనిచేయడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.

పక్షవాతానికి పరిష్కారం
పక్షవాతం వంటి సంక్షోభాలు జీవితంలో ఏ వయస్సులో వస్తాయో చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి మొలకెత్తిన వెల్లుల్లి తినడం ద్వార పక్షవాతం నివారించవచ్చు. మొలకెత్తిన వెల్లుల్లిలో ఉండే నైట్రేట్స్ రక్తనాల్లో రక్తం సులభంగా ప్రసరించడానికి సహాయపడుతుంది. దాంతో పక్షవాతం నివారిస్తుంది. వెల్లుల్లి ఎంజైములు ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి మరియు తద్వారా పక్షవాతం రాకుండా సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం
మొక్కల నుండి ఫైటో కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. అవే మొలకెత్తిన వెల్లుల్లి నుండి కూడా ఉత్పత్తి అవుతాయి. ఇవి గుండె నాళాల్లో ఏర్పడ్డ పాచిన నివారిస్తాయి. పాచిని తొలగించడం వల్ల రక్తం గడ్డకట్టకుండా రక్తనాళాలు బ్లాక్ కాకుండా ఉంటాయి. మొలకెత్తిన వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. మొలకెత్తిన వెల్లుల్లి అన్ని రకాల హార్ట్ బ్లాక్‌లను కూడా తొలగిస్తుంది.

ఇన్ఫెక్షన్స్
ఇన్ఫెక్షన్ శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. కానీ దీన్ని పరిష్కరించడానికి వెల్లుల్లి మొలకలు ఉపయోగపడతాయి. మొలకెత్తిన వెల్లుల్లి ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్‌ను నివారించడం
మొలకెత్తిన వెల్లుల్లి క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. వీటిలో ఉండే క్యాన్సర్ కారకాలను నివారించడంలో అందుకు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను నివారించడంలో మొలకెత్తిన వెల్లుల్లి గొప్పగా సహాయపడుతుంది. మీ ఆహారంలో సాధారణ వెల్లుల్లిని ఉపయోగించకుండా, మొలకెత్తిన వెల్లుల్లిని ప్రయత్నించండి.