For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Marburg Virus :ఈ వ్యాధి సోకితే పది రోజుల్లోపే ప్రాణాలు పోతాయట...! WHO హెచ్చరిక...

మార్బర్గ్ వైరస్ గురించి కొన్ని ఆసక్తిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా మూడో దశ ముప్పు ఇంకా దాటలేదని అందరూ కలవరపడుతుంటే.. తాజాగా మరో ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చింది. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మరో భయంకరమైన విషయం చెప్పింది. Marburg Virus అనే ఈ వ్యాధి సోకితే పది రోజుల్లోపే ప్రాణాలు పోతాయని సంచలన విషయాలను చెప్పింది. ఈ వైరస్ మహమ్మారిని పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో గుర్తించినట్లు ప్రకటించింది. ఇది కూడా ఎబోలాకు సంబంధించిన ప్రమాదకరమైన వైరస్ అని.. ఇది కోవిద్-19 మాదిరిగానే జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందుతుందని ధ్రువీకరించింది.

Marburg Virus 1st Case Detected in W Africa : Know History, Symptoms, Treatment and How does it Spread; explained in Telugu

ఇటీవల మరణించిన ఓ వ్యక్తి నుండి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ ను గుర్తించినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్ వల్ల మరణాల రేటు సుమారు 88 శాతంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఈ మార్ బర్గ్ వైరస్ కు వెంటనే అడ్డుకట్ట వేయాలని' ఆఫ్రికా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ మత్సిడి సో మొయిటీ హెచ్చరించారు.

Marburg Virus 1st Case Detected in W Africa : Know History, Symptoms, Treatment and How does it Spread; explained in Telugu

దీంతో స్థానికంగా, దేశీయంగా ఇది అత్యంత ప్రమాదకర వైరస్ గా హెచ్చరిక జారీ అయ్యింది. ఈ సందర్భంగా మార్బర్గ్ వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా సోకుతుంది. దీని లక్షణాలేంటి? దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. దీన్ని నిలువరించేందుకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పురుషులు పడకగదిలో చురుగ్గా ఉండటానికి పుచ్చకాయ తొక్క చాలు! ఎలాగో తెలుసుకోండి ..!పురుషులు పడకగదిలో చురుగ్గా ఉండటానికి పుచ్చకాయ తొక్క చాలు! ఎలాగో తెలుసుకోండి ..!

మార్బర్గ్ వైరస్ అంటే ఏమిటి?

మార్బర్గ్ వైరస్ అంటే ఏమిటి?

మార్బర్గ్ వైరస్ అనేది రక్తస్రావ జ్వరం కలిగించే ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. మార్బర్గ్ వైరస్ మరియు ఎబోలా రెండూ ఒకే వైరస్ రకానికి చెందినవి. ఇది 1967లో తూర్పు, మధ్య ఆఫ్రికాలో ఉగాండా నుండి వ్యాపించడం ప్రారంభించింది. గబ్బిలాల ద్వారా ఈ వైరస్ వ్యాపించింది. దీని కారణంగా ఇప్పటివరకు 478 మంది ప్రాణాలు కోల్పోయారు.

మార్బర్గ్ ఎలా వ్యాపిస్తుంది?

మార్బర్గ్ ఎలా వ్యాపిస్తుంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక ప్రకారం, మనషులలో మార్బర్గ్ వైరస్ సంక్రమణ గబ్బిలాలతో సంపర్కం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి అవయవాలు లేదా రక్తం, ఇతర శరీర భాగాలన్నింటికీ ఊపిరితిత్తుల ద్వారా వ్యాప్తి చెందుతున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన సంస్థ ప్రతినిధులు చెబుతున్నాు.

మార్బర్గ్ యొక్క లక్షణాలు..

మార్బర్గ్ యొక్క లక్షణాలు..

ఈ ప్రమాదకరమైన వైరస్ బారిన పడిన వారికి కండరాల నొప్పితో పాటు తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి మరియు తీవ్రమైన అనారోగ్యం వస్తాయి. ఈ వైరస సోకిన మూడో రోజు నుండి తీవ్రమైన కడుపునొప్పి, తిమ్మిరి, వికారం మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) దీని గురించి ఇలా వివరించింది. ‘ఈ వైరస్ సోకిన వారు వారంలోపు ఒక దెయ్యంలాగా కనిపిస్తారని, వారి ముఖం పూర్తిగా మారిపోతుందని.. కళ్లు పీక్కుపోయినట్టు, శరీరమంతా నిర్జీవంగా మారుతుంది. దీని ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యాక రక్తస్రావం సాధారణంగా సంభవిస్తుంది. తరచుగా ముక్కు, చిగుళ్లు మరియు యోని వంటి శరీర భాగాల నుండి రక్తస్రావం జరుగుతుందని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ తెలిపింది. ఈ వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థకు చేరుకున్నప్పుడు వైరస్ సోకిన వ్యక్తికి గందరగోళం, చిరాకు మరియు దూకుడు వంటి ధోరణులు కనిపిస్తాయి. ఇలా అధిక రక్తస్రావం జరిగితే ఆ వ్యక్తి పది రోజుల్లోపే మరణించే అవకాశం ఎక్కువగా ఉందని' వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వివరించింది.

ఈ వ్యాధికి చికిత్స లేదా?

ఈ వ్యాధికి చికిత్స లేదా?

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మార్బర్గ్ వైరస్ అనేది మలేరియా, టైఫాయిడ్, జ్వరం, మెనింజైటిస్ ఇతర వైరల్ హెమరేజిక్ జ్వరాల వంటి ఇతర అంటు వ్యాధుల నుండి వేరు చేయడం వైద్య పరంగా కష్టం. అయితే ఇలాంటి లక్షణాలు రాకుండా, దాని సంక్రమణను యాంటిజెన్ డిటిక్షన్ టెస్ట్, సీరం న్యూట్రలైజేషన్ టెస్ట్ మరియు RT-PCR టెస్టు వంటి ద్వారా గుర్తించొచ్చు.

అలాగే మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు సరైన రోగి సంరక్షణ మరియు లక్షణాలకు మెరుగైన చికిత్స అందించడం వల్ల కోలుకోడానికి అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

English summary

Marburg Virus 1st Case Detected in W Africa : Know History, Symptoms, Treatment and How does it Spread; explained in Telugu

Marburg Virus 1st Case Detected in W Africa : Know What is Marburg Virus, Symptoms, Treatment and How does it Spread; explained in telugu
Story first published:Wednesday, August 11, 2021, 18:03 [IST]
Desktop Bottom Promotion