For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబ్బాయిలూ.. సింగిల్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారా? అయితే మీ ఆయుష్ తగ్గిపోతుందట...!

|

'సోలో బతుకు సో బెటర్'.. బ్యాచ్ లర్ లైఫ్ బెస్ట్ లైఫ్ అని చాలా మంది సింగిల్ కింగులు చెబుతుంటారు. పెళ్లయిన వారు కూడా కొన్ని సందర్భాల్లో అదే కరెక్టని నమ్ముతుంటారు.

తాము అనవసరంగా పెళ్లి చేసుకున్నామని భావిస్తారు. ఎందుకంటే సింగిల్ గా ఉంటే పూర్తి స్వేచ్ఛ, ఆనందంతో పాటు ఇంకా ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

లైఫ్ ను ఎంజాయ్ చేయాలంటే కేవలం సింగిల్ గా ఉండటం ద్వారానే సాధ్యమవుతుందని చాలా మంది మగాళ్లు అనుకుంటారు. అందుకే పెళ్లిని తలనొప్పిగా భావిస్తారు.. ఆ కీలకమైన కార్యక్రమాన్ని ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూ ఉంటారు. అయితే ఒంటరిగా ఉండే మగాళ్లు అలానే అనుకుంటే పొరబడినట్లే... ఎందుకంటే మగాళ్లు ఎక్కువ కాలం పాటు సింగిల్ గా ఉంటే రకరకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకీ సింగిల్ గా ఉంటే వచ్చే ప్రమాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Covid antiviral pill:కరోనా విరుగుడుకు ట్యాబ్లెట్లులొచ్చేశాయి..దీని ధరెంత.. వీటిని ఎవరెవరు ఎలా వాడాలంటే...

సింగిల్ గా ఉండేందుకు..

సింగిల్ గా ఉండేందుకు..

ప్రస్తుత సమాజంలో చాలా మంది మగవారు మూడు పదుల వయసు దాటినా సింగిల్ గా లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. జీవితాన్ని ఆస్వాదించాలంటే కేవలం ఒంటరిగా ఉండటం వల్లనే సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అందుకే పెళ్లి అంటే వెంటనే నో చెప్పేస్తున్నారు. మరికొందరు పెళ్లి తర్వాత జీవితమంతా బాధ్యతలు, భారాలు, బరువుల మయంగా మారుతుందని.. భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడపలేమని, పెళ్లి కార్యాన్ని వాయిదా వేస్తూ వెళ్తున్నారు.

అనారోగ్య సమస్యలు..

అనారోగ్య సమస్యలు..

అయితే బ్యాచ్ లర్ లైఫ్ ను ఎక్కువ కాలం పాటు కంటిన్యూ చేస్తే.. లేని పోని సమస్యలు వస్తాయని తాజాగా ఓ సర్వేలో తేలింది. అందులోనూ ముఖ్యంగా ఎవరైతే సింగిల్ గా ఉంటారో.. వారికి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

రోగాల బారిన..

రోగాల బారిన..

సింగిల్ గా ఉండే వారు ఎక్కువగా వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వంటివి చేస్తే.. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయట. ఎక్కువ కాలం సింగిల్ గా జీవించడం వల్ల శారీరక, మానసిక సమస్యలతో పాటు ఎన్నో రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనాల్లో తేలిందట.

సహజంగా స్త్రీలలో లైంగిక భావాలను రేకెత్తించే ఆహారాలు ఏమిటో తెలుసా?

రక్తకణాల్లో తేడా..

రక్తకణాల్లో తేడా..

ఎవరైతే ఎక్కువకాలం పాటు ఒంటరిగా ఉంటారో.. ఎవరితోనూ ఎలాంటి రిలేషన్ షిప్ మెయింటెన్ చేయకుండా ఉంటారో.. అప్పుడే వారి రక్త కణాల్లో తేడాలొచ్చి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువగా పురుషుల్లోనే..

ఎక్కువగా పురుషుల్లోనే..

ఇలాంటి పరిస్థితులన్నీ కేవలం మగాళ్లలోనే ఎక్కువగానే కనిపిస్తోందని నిపుణులు తేల్చి చెప్పేశారు. ఈ సమాచారం మొత్తాన్ని జర్నల్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ లో ప్రచురించబడింది. ఎవరైతే సంవత్సరాల తరబడి సింగిల్ గా జీవించడం వల్ల అనేక అనారోగ్యాలు, మరణాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలిందట. వీటితో పాటు పార్ట్నర్ తో విడిపోయి.. విడాకులు తీసుకుని సింగిల్ గా జీవించే వారు కూడా మానసికంగా కుంగిపోయి, శారీరకంగా బలహీనపడిపోయి క్రమ క్రమంగా రోగ నిరోధక శక్తి తగ్గే అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తేలింది. అంతేకాదు.. ఎవరైతే సింగిల్ గా ఎక్కువ కాలం పాటు ఉంటారో.. వారు తొందరగా చనిపోయే ప్రమాదం కూడు ఉందని నిపుణులు హెచ్చరించారు.

ఎవరికి ఎక్కువ ప్రమాదమంటే..

ఎవరికి ఎక్కువ ప్రమాదమంటే..

ఈ పరిశోధన కోసం వారు ఎక్కువగా 48 నుండి 62 సంవత్సరాల మధ్య ఉన్న వారినే ఎంచుకున్నారు. ఈ పరిశోధన సుమారుగా 4,835 మందిపై చేసి నివేదికను రెడీ చేశారు. అందుకే ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే జీవితంలో ఒంటరిగా ఉండటం వంటివి చేయకండి. కాబట్టి సింగిల్ లైఫ్ అంత మంచిది కాదు. ఓ వయసు వచ్చాక ఓ తోడు ఉంటేనే లైఫ్ హ్యాపీగా.. సంతోషంగా సాగుతుంది.. అందులోనూ వివాహ ఘట్టం ఎంతో కీలకం. కళ్యాణం అనే కమనీయ ఘట్టంతో రెండు కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిస్తాయి. కాబట్టి పెళ్లి చేసుకుని లైఫ్ లో ఆనందంగా.. ఆయురారోగ్యాలతో ఉండాలి.

ఎక్కువ కాలం పాటు సింగిల్ గా ఉంటే ఎలాంటి ప్రమాదాలొస్తాయి?

సింగిల్ గా ఉండే వారు ఎక్కువగా వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వంటివి చేస్తే.. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయట. ఎక్కువ కాలం సింగిల్ గా జీవించడం వల్ల శారీరక, మానసిక సమస్యలతో పాటు ఎన్నో రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనాల్లో తేలిందట. ఎవరితోనూ ఎలాంటి రిలేషన్ షిప్ మెయింటెన్ చేయకుండా ఉంటారో.. అప్పుడే వారి రక్త కణాల్లో తేడాలొచ్చి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

English summary

Men living alone at higher risk of inflammation finds Study

Here we are talking about the men living alone at higher risk of inflammation finds study. Have a look
Story first published: Thursday, January 20, 2022, 10:23 [IST]