For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల ఆరోగ్యం: పురుషాంగం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు

|

దేవుని సృష్టి ముందు ఏ ఇంజనీర్ కూడా సరిసాటికాలేరు. ఎందుకంటే ఈ భూమిపై యొక్క స్త్రీ, పురుషులను సృష్టించని దేవుడు, వారి ఇద్దరి శరీరాలలలో అంగాంగాలను కూడా చాలా భిన్నంగా సృష్టించాడు. ఈ కారణంగానే మానవ సంతానం మాత్రమే కాకుండా జంతు పక్షుల సంతానం కూడా పెరుగుతున్నాయి. మగ మరియు ఆడ జననేంద్రియాలు కూడా భిన్నంగా ఉంటాయి. జననేంద్రియాల స్రావం మరియు పునరుత్పత్తి(సంతానోత్పత్తి)లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

అటువంటప్పుడు కొన్ని అవయవాలు సరిగా పనిచేయకపోతే అప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే జననేంద్రియాలతో పాటు శరీరంలోని ఇతర అవయవాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మనం కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ ఉండాలి. పురుషాంగం విషయంలో కూడా అదే జరగాలి. కొన్ని ఆహారాలు జననేంద్రియాల పనితీరును మెరుగుపరుస్తాయి మరియు అనారోగ్యానికి గురికాకుండా చేస్తాయి. మీ పురుషాంగం పనితీరును పెంచడానికి మీరు ఏ ఏ ఆహారాలు తినాలో ఈ వ్యాసం ద్వారా తెలుసుకోండి ....

క్యారెట్ బాగా తినండి!

క్యారెట్ బాగా తినండి!

రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరం చేస్తుందన్న విషయం మీకు గుర్తుందా.. ఏదేమైనా శరీర ఆరోగ్యానికి పురుషులు మరియు మహిళలు రోజూ ఆపిల్ కంటే క్యారెట్లు ఎక్కువగా తినడం మంచిదని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. దీనికి కారణం బీటా కెరోటిన్ అనే పోషకం. ఇది ఆపిల్ కంటే క్యారెట్‌లో ఎక్కువగా ఉంటుంది మరియు పురుషుల శరీరానికి ప్రత్యేకమైన హార్మోన్లు మరియు రసాయనాల ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు ఆరోగ్యాన్ని పెంచుతుంది. క్యారెట్లు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మరియు పోషకాలు మెండుగా ఉండటం వల్ల వీటిని సలాడ్ రూపంలో ఉడికించి తినవచ్చు. క్యారెట్లు తినడం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. క్యారెట్‌లోని విటమిన్ ఎ పురుషులలో హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది పురుషుల పురుషాంగం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

కోడి మాంసం చాలా మంచిది

కోడి మాంసం చాలా మంచిది

మీ ఆహారంలో చికెన్‌ను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కండరాలు పెరగడానికి, కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి, బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. చికెన్‌లో అధిక స్థాయిలో ప్రోటీన్ ఉంటుంది. శరీరంలోని విటమిన్ బి 3 పురుషాంగం ప్రసరణను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. ఇది జననేంద్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు లిబిడోను పెంచుతుంది.

అరటి పండ్లు

అరటి పండ్లు

రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని ఒక నానుడి ఉంది. అలాగే రోజుకు రెండు అరటిపండ్లు కూడా వైద్యులను దూరంగా ఉంచగలవు. అరటిలో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు, కరిగే మరియు కరగని ఫైబర్ మరియు చక్కెర మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒక ఆపిల్ కంటే అరటిని ఎంచుకోవడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అరటిపండు ఏడాది పొడవునా తేలికగా లభించే పండు. ఇది పురుషుల ఆరోగ్యానికి అద్భుతమైన పండు. ఇది పురుషులకు బలమైన హృదయా ఆరోగ్యాన్ని ఇస్తుంది. గుండెకు రక్త ప్రసరణను చక్కగా పెంచుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల గుండె సమస్యలను నివారించవచ్చు. అందులోని పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రిస్తుంది. సోడియం స్థాయిలను స్థిరీకరించడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎక్కువ ఉప్పు తినే వ్యక్తులు ఎక్కువ అరటిపండు తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఎండు చేపలు

ఎండు చేపలు

ఎండిన చేపలలో అద్భుతమైన ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఎండిన చేపలు ఆరోగ్యానికి మంచివి. ఇది శరీరంలోని ఉత్తమ రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఎండు చేపలను రోజూ తీసుకోవడం వల్ల ధమనులు సులభంగా పనిచేస్తాయి. వారానికి రెండుసార్లు తినడం వల్ల పురుషులు విశేషమైన ఆరోగ్యాన్ని సాధించగలరని మరియు పురుషుల పురుషాంగం ఆరోగ్యంగా ఉండగలదు, అలాగే లైంగిక చర్యలకు శక్తినిస్తుందని చెబుతారు.

చెర్రీ పండ్లు

చెర్రీ పండ్లు

ఆరోగ్య పరంగా చెర్రీ పండ్లు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తాయి, ఇవి శరీరంలో మంచి రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి. ధమనుల గోడను రక్షిస్తుంది. అనవసరమైన కొవ్వులను కరిగించడం. పురుషులకు లైంగిక జీవితానికి అవసరం హార్మోన్ల విడుదలను చేయడంలో సమన్వయంగా పనిచేస్తాయి. మరియు అంగస్తంభనను ప్రోత్సహిస్తాయి.

రెడ్ వైన్

రెడ్ వైన్

రెడ్ వైన్ యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్ రెస్వెరాట్రాల్ యొక్క గొప్ప మూలం. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ధమనులను తెరవడానికి ఇది సహాయపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి రక్త నాళాలు విస్తరించడానికి అనుమతిస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. పురుషాంగం ఆరోగ్యానికి యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్ రెస్వెట్రాల్ మీ చిన్న మరియు ప్రధాన ధమనులను విస్తరించడం ద్వారా వయాగ్రాలాగా పనిచేస్తుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్కహాల్ ను ఎల్లప్పుడూ మితంగా తీసుకోవాలి.

గంజి తీసుకోవడం

గంజి తీసుకోవడం

గంజీ ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారం. గంజి లేదా పుడ్డింగ్ ఆరోగ్యానికి అద్భుతమైన ఉద్దీపన కలిగిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన ఫైబర్ మరియు కొవ్వును అందిస్తుంది. మెరుగైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది మరియు రక్త నాళాలను విస్తరిస్తుంది. రక్త నాళాలు ఆరోగ్యకరమైన మార్గంలో విస్తరించడం లైంగిక చర్యలకు అవసరమైన ఉద్దీపన కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన పురుషత్వానికి గంజి ప్రేరణ.

English summary

Mens Health: Best foods for your penis

The fact that the food you eat directly affects your sexual health, is common knowledge. But are there foods which can be included in your diet to improve penile health? Besides making small changes in your lifestyle choices and keeping yourself physically fit, eating certain foods can help you significantly improve health of your nether regions. In the case of penile performance, everything from sperm motility to erection can be affected by what you eat. So you should be careful while making such dietary choices.
Story first published: Monday, October 21, 2019, 19:02 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more