For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NeoCov:మరో కొత్త వైరస్.. ఇది సోకితే ముగ్గురిలో ఒకరు చనిపోతారట...! వూహాన్ సైంటిస్టుల సంచలన రిపోర్టు...

|

ప్రపంచ వ్యాప్తంగా మరోసా కరోనా కేసులు పెరుగుతూ ప్రతి ఒక్కరూ కలవరపెడుతున్నారు. ఇదిలా ఉండగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఓమిక్రాన్ వచ్చి అందరిలోనూ ఒక్కసారిగా ఆందోళన పెంచింది. అయితే ఈ వైరస్ తో పెద్దగా ఇబ్బంది లేదని.. ఇది త్వరలోనే ముగిసిపోతుందని చెప్పడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

అయితే తాజాగా చైనాలోని వూహాన్ శాస్త్రవేత్తలు మరో భయంకరమైన వైరస్ గురించి హెచ్చరించారు. దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ యొక్క కొత్త రూపాంతరం 'నియో కోవ్'(Neo Cov) బయటపడిందని.. ఇది పాత వేరియంట్ల మాదిరిగా కాకుండా తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈ విషయాన్ని రష్యాకు చెందిన న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ వివరించింది. దీని ప్రకారం 'నియో కోవ్' అనే వైరస్ కొత్తదేమీ కాదు. మెర్స్-కోవ్ వైరస్ రకానికి చెందినదే. 2012-2015 సంవత్సరాల మధ్య ప్రాచ్య దేశాల్లో దీన్ని కనుగొన్నారు. ఈ మెర్స్-కోవ్ రకం కూడా మనుషుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సార్స్-కోవ్2 రకంతో సూటవుతోంది.

ఈ నియోకోవ్ మహమ్మారిని తొలిసారిగా సౌతాఫ్రికాలోనే గుర్తించారు. ఆ గబ్బిలాల నుండే మనుషులకు సోకుతుందని అనుమానించారు. అయితే తాజా అధ్యయనాలలో మాత్రం నియోకోవ్ తో పాటు దాని దగ్గరి అనుబంధ వైరస్ 'పీడిఎఫ్-2180-కోవ్' మనుషులకూ వ్యాప్తి చెందుతుందని వివరించింది. ఈ పరిశోధన వివరాలను bioRxiv అనే వెబ్ సైట్లో పొందుపరిచారు.

BENTA:బెంగళూరులో 'బెంటా' బారిన పడ్డ 7 నెలల చిన్నారి... ఈ అరుదైన వ్యాధి అత్యంత ప్రమాదమా? దీని లక్షణాలేంటి?

వూహాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయో ఫిజిక్కస్ పరిశోధకులు గుర్తించిన వివరాల మేరకు.. గబ్బిలాల్లో గుర్తించిన వైరస్ ఇంకా ఓ మ్యుటేషన్ చెందడం ద్వారా మనుషుల్లో కూడా వ్యాప్తికి కారణమవుతుందని కనుగొన్నారు. కరోనా వైరస్ పాథోజెన్(వ్యాధి కారకం)కు భిన్నంగా ACE2 రిసెప్టర్ తో కలవడం వల్ల కొత్త కరోనా వైరస్ ప్రమాదాన్ని కలిగిస్తుందని పరిశోధన ఫలితాలు తేలాయి. ఈ కారణంగానే మనలో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు లేదా ఇమ్యూనిటీ ఉన్నవారు ఉత్పత్తి చేసే యాంటీ బాడీలు లేదా ప్రోటీన్ అణువులు నియోకోవ్ నుండి రక్షించలేవని స్పష్టమైంది.

చైనా పరిశోధకుల ప్రకారం, నియోకోవ్ అనేది MERS-high Cov హై పొటెన్షియల్ కాంబినేషన్ ను కలిగి ఉంటుందట. ఈ కారణంగా డెత్ రేషియో(ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే అవకాశం) మరియు ప్రస్తుత సార్స్ కోవ్-2 కరోనా వైరస్ యొక్క ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని రష్యన్ స్టేట్ వైరాలజీ, బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నిపుణులు గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

'నియో కోవ్ కరోనా వైరస్ పై చైనీస్ పరిశోధకులు పొందిన డేటా గురించి వెక్టర్ రీసెర్చ్ సెంటర్ కు తెలుసు. మానవులలో వేగంగా వ్యాప్తి చెందగల కొత్త కరోనావైరస్ యొక్క ఆవిర్భావం ప్రస్తుతానికి సమస్య కాదు. అది చేయబోయే ప్రమాదాలను మరింత అధ్యయనం చేసి మరింత పరిశోధించాల్సిన అవసరం ఉంది' అని స్పుత్నిక్ వార్తా సంస్థ కథనంలో వివరించారు.

English summary

NeoCov: Wuhan Scientists Warn of New Coronavirus Strain With High Death, Infection Rate

NeoCov Coronavirus Variant: Scientists in Wuhan have warned of a new varaint of coronavirus-Neo Cov, currently circulating in South Africa. It has High Death and Infection Rate Says Report
Desktop Bottom Promotion