For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New Covid-19 variant in South Africa:దక్షిణాఫ్రికాలో దడ పుట్టిస్తున్న కోవిద్..కొత్తవేరియంట్ లక్షణాలు ప్రమాదమా?

దక్షిణాఫ్రికాలో కోవిద్ కొత్త వేరియంట్ బయటపడిందట.. బి.1.1.529 వేరియంట్ అనే కొత్త రకం కోవిద్-19 వైరస్ లక్షణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా.. ఆ పేరు చెబితే ఒకప్పుడు అందరూ వణికిపోయేవారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే కరోనా మహమ్మారికి విరుగుడు కనిపెట్టారు. చాలా దేశాల్లో వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి.

New Covid-19 variant B.1.1.529 detected in South Africa: All you need to know in Telugu

దీంతో కరోనా వచ్చినా దాంతో కలిసి చాలా మంది సహజీవనం చేయడానికి అలవాటు పడిపోయారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలో అందరిలో దడ పుట్టించే కోవిద్ కొత్త వేరియంట్ ఒకటి బయటపడిందట. 'బి.1.1.529' అనే ప్రమాకరమైన వేరియంట్ ఒకటి తాజాగా వెలుగుచూసిందని,

New Covid-19 variant B.1.1.529 detected in South Africa: All you need to know in Telugu

ఇది కొన్ని మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) కనిపిస్తోందని.. లండన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజీ వైరాలజిస్టు డాక్టర్ టామ్ పీకాక్ వివరించారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగులోకొచ్చిన కోవిద్ కొత్త వేరియంట్ లక్షణాలేంటి.. ఇది ఎంత ప్రమాదకరమైనదని.. ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

స్త్రీల పునరుత్పత్తి అవయవాలలో వచ్చే ఈ క్యాన్సర్ల గురించి విన్నారా..?స్త్రీల పునరుత్పత్తి అవయవాలలో వచ్చే ఈ క్యాన్సర్ల గురించి విన్నారా..?

రోగ నిరోధక శక్తి మార్పు..

రోగ నిరోధక శక్తి మార్పు..

దక్షిణాఫ్రికాలో కనిపించిన కోవిద్ కొత్త వేరియంట్ ‘బి.1.1.529' రకం మనుషుల శరీరంలోని రోగ నిరోధక శక్తిలో మార్పు వచ్చేలా చేస్తుందని, ఇది చాలా వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా, బోట్స్ వనాల్లో ఈ రకానికి చెందిన 100 కేసులను గుర్తించినట్లు చెప్పారు. ఇది ఎంతటి ప్రమాదకరం, దీని కారణంగా ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే దాన్ని అంచనా వేసేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)నిపుణులు సమావేశమయ్యారు.

ఎంత ప్రమాదమంటే..

ఎంత ప్రమాదమంటే..

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో, హెచ్ఐవి/ఎయిడ్స్ సోకిన వారు, చికిత్స తీసుకోని వారి బాడీలో ఈ కొత్త రకం వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది.. ఇది ఎంత ప్రమాదకరమనే విషయాన్ని ప్రస్తుతం తాము చెప్పలేమని సౌతాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం ఒక ప్రకటనలో వివరించింది.

పురుషాంగం అంగస్తంభన నుండి మధుమేహం వరకు పురుషులకు 'ఇది' అనేక ప్రయోజనాలను అందిస్తుంది!పురుషాంగం అంగస్తంభన నుండి మధుమేహం వరకు పురుషులకు 'ఇది' అనేక ప్రయోజనాలను అందిస్తుంది!

పరిశీలన చేస్తూ..

పరిశీలన చేస్తూ..

ఈ కోవిద్ కొత్త రకం వేరియంట్ ను తమ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారని.. దీని పరిణామాక్రమాన్ని పగలు, రాత్రి అనే తేడా లేకుండా గమనిస్తున్నారని వివరించింది. మరోవైపు ఇలాంటి కేసులు హాంగ్ కాంగ్ లోనూ ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి.

కోవిద్ -19 కొత్త వేరియంట్ లక్షణాలు..

కోవిద్ -19 కొత్త వేరియంట్ లక్షణాలు..

* దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త రకం వేరియంట్లో ఏకంగా 32 మ్యూటేషన్లు ఉన్నట్లు తేలింది

* కె417ఎన్-కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను మార్చేస్తుంది

* ఈ448ఎ-యాంటీ బాడీలకు దొరకదు

*ఎన్440కే-యాంటీ బాడీలను బోల్తా కొట్టించగలదు

*ఎన్501వై.. వైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తుంది

*ఈ వైరస్ కొమ్ముల్లో మరే దాంట్లోనూ లేనన్ని మ్యూటేషన్లు ఉన్నాయి.

* ప్రస్తుత వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీ బాడీలు ఇప్పటివరకు ఉన్న వేరియంట్లను మాత్రమే గుర్తించగలవు.

* అందుకే ఇది తేలిగ్గా యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకుని బాడీలో వ్యాప్తి చెందగలదు.

వీరితో జాగ్రత్త..

వీరితో జాగ్రత్త..

కోవిద్ కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో బయటపడటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంగ్ కాంగ్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులతో వీలైనంత దూరంగా ఉండాలని.. వారికి కచ్చితంగా టెస్టులు చేయాలని.. ముఖ్యంగా భారతదేశం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

FAQ's
  • దక్షిణాఫ్రికాలో కనుగొన్న కోవిద్ కొత్త వేరియంట్ ప్రమాదకరమా?

    రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో, హెచ్ఐవి/ఎయిడ్స్ సోకిన వారు, చికిత్స తీసుకోని వారి బాడీలో ఈ కొత్త రకం వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది.. ఇది ఎంత ప్రమాదకరమనే విషయాన్ని ప్రస్తుతం తాము చెప్పలేమని సౌతాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం ఒక ప్రకటనలో వివరించింది.

  • కోవిద్ కొత్త వేరియంట్ లక్షణాలేంటి?

    * దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త రకం వేరియంట్లో ఏకంగా 32 మ్యూటేషన్లు ఉన్నట్లు తేలింది

    * కె417ఎన్-కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను మార్చేస్తుంది

    * ఈ448ఎ-యాంటీ బాడీలకు దొరకదు

    *ఎన్440కే-యాంటీ బాడీలను బోల్తా కొట్టించగలదు

    *ఎన్501వై.. వైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తుంది

    *ఈ వైరస్ కొమ్ముల్లో మరే దాంట్లోనూ లేనన్ని మ్యూటేషన్లు ఉన్నాయి.

    * ప్రస్తుత వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీ బాడీలు ఇప్పటివరకు ఉన్న వేరియంట్లను మాత్రమే గుర్తించగలవు.

    * అందుకే ఇది తేలిగ్గా యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకుని బాడీలో వ్యాప్తి చెందగలదు.

English summary

New Covid-19 variant B.1.1.529 detected in South Africa: All you need to know in Telugu

New Covid-19 variant detected in South Africa: Here is all you need to know about B.1.1.529 variant of Covid-19 in Telugu.
Desktop Bottom Promotion