For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రాన్సులో మరో కొత్త కోవిద్ వేరియంట్.. ఒమిక్రాన్ కంటే మరింత వేగంగా వ్యాపిస్తుందట...!

ఫ్రాన్స్ లో కోవిద్-19 మరో కొత్త రకం IHU మ్యూటెంట్ ను గుర్తించారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

|

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒమిక్రాన్ కరోనా వేరియంట్ తో పరేషాన్ అవుతున్నారు. మన దేశంలో కూడా ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటిదాకా దాదాపు 1700కు పైగా కేసులు పెరిగిపోయాయి. పెరుగుతూనే ఉన్నాయి.

New highly mutated COVID-19 variant IHU detected in France; All you need to know in Telugu

ఇలా అందరూ కలవరపడుతుంటే.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఫ్రాన్సులో మరో కొత్త రకం కోవిద్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఆ దేశంలో మొట్టమొదటి కొత్త వేరియంట్ కేసు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ అల్లాడిపోయిన వారంతా.. థర్డ్ వేవ్ వల్ల ఇంకా ఎన్ని అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడుతున్నారు.

New highly mutated COVID-19 variant IHU detected in France; All you need to know in Telugu

ఎందుకంటే ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటే వేగంగా విస్తరిస్తోందట. ఫ్రాన్సు దేశంలో కనిపెట్టిన ఈ కరోనా కొత్త వేరియంట్ కు B.1.640.2(IHU)గా నామకరణం చేశారు. ఈ కొత్త మహమ్మారిలో దాదాపు 46 వరకు మ్యుటేషన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇది ఒమిక్రాన్ వైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందట. కరోనా వ్యాక్సిన్ రెండు టీకాలు తీసుకున్నా కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్రాన్సు దేశంలో ఇప్పటికే దాదాపు 12 మంది ఈ కొత్త మహమ్మారి బారిన పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ 12 కేసులు మార్సెయిల్స్ సమీపంలోకి వచ్చాయి. ప్రపంచ దేశాలకు IHU ముప్పు కూడా ఉందట. అయితే ఇంతవరకు B.1.640.2 వేరియంట్ ఇతర దేశాలలో గుర్తించబడలేదు.

ఎవరు కనుగొన్నారంటే?

IHU పేరుతో B.1.640.2 వేరియంట్ ను IHU మెడిటరానీ ఇన్ఫెక్షన్లోని విద్యావేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. ఇది 46 రకాల ఉత్పరివర్తనాలను కలిగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఒమిక్రాన్ కన్నా ఎక్కువ ప్రమాదకరం అని, టీకాలు తీసుకున్న వారికి ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు.

New highly mutated COVID-19 variant IHU detected in France; All you need to know in Telugu

తొలి కేసును అమెరికా నుండి వచ్చిన వ్యక్తిలో గుర్తించినట్లు అక్కడి వైద్యులు వివరించారు. ఇది చాలా అరుదైన రకంగా చెబుతున్నారు. ఈ IHU వేరియంట్ యొక్క ముప్పు చాలా ప్రమాదకరంగా ఉంటుందట. ఇది చాలా వేగంగా పెరుగుతుందట. ఇందులో N501Y, E484Kతో సహా 14 అమైనో ఆమ్ల ప్రత్యామ్నాయాలు, స్పైక్ ప్రోటీన్లు ఉన్నాయి. ఈ జన్యురూప నమూనా B.1.640.2 అనే పేరుతో కొత్త పాంగోలిన్ వంశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దారి తీసింది. ఇది B.1.640.1గా పేరు మార్చబడిన తర్వాత ఇది పాత బి.1.640 వంశానికి ఒక ఫైలోజెనెటిక్ సోదర సమూహం' అని పరిశోధకులు అభిప్రాయ పడ్డారు.

ఇందుకు సంబంధించి ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్-డింగ్ సుదీర్ఘమైన ట్వీట్ ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో కొత్త రకాలు పుట్టుకొస్తూనే ఉన్నాయని, అయితే అవి మరింత ప్రమాదకరంగా ఉంటాయని దీని అర్థం కాదు. 'ఒక వేరియంట్ ను మరింత ప్రసిద్ధి చెందింది మరియు ప్రమాదకరంగా చేస్తుంది. అసలు వైరస్ కు సంబంధించి మ్యుటేషన్ల సంఖ్య కారణంగా గుణించగల సామర్థ్యం' అని ఆయన చెప్పారు.

FAQ's
  • ఒమిక్రాన్ తర్వాత ఏ దేశంలో కోవిద్-19 కొత్త వేరియంట్ కనుగొన్నారు?

    ఫ్రాన్సు దేశంలో ఒమిక్రాన్ తీవ్రమైన కోవిద్-19 వేరియంట్ ను కనుగొన్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ఇప్పటివరకు దాదాపు 12 మందికి ఈ మహమ్మారి సోకినట్లు నివేదికలు చెబుతున్నారు. ఇది ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందని వివరించారు.

English summary

New highly mutated COVID-19 variant IHU detected in France; All you need to know in Telugu

Here we are talking about the new highly mutated COVID-19 variant IHU detected in France; All you need to know in Telugu
Story first published:Tuesday, January 4, 2022, 14:18 [IST]
Desktop Bottom Promotion