For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Norovirus Outbreak:కొత్తగా నోరో వైరస్ కలకలం.. దీని లక్షణాలేంటి.. ఇది ఎలా సోకుతుందంటే..

నోరో వైరస్ ఎలా సోకుతుంది.. దాని లక్షణాలేంటి.. దాని నివారణకు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

అసలే కరోనా మహమ్మారితో ప్రపంచమంతా కలవరపడుతుంటే.. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా.. కొత్తగా నోరో వైరస్ కలకలం రేపుతోంది.

Norovirus Outbreak: Know Norovirus Symptoms, How it is Transmitted, Treatment and Prevention in Telugu

ఇప్పటికే జికా వైరస్, డెల్టా వేరియంట్లతో మనం భయంతో గడుపుతూ ఉంటే.. బ్రిటన్లో కొత్తగా కరోనా వైరస్ వంటి మహమ్మారి నోరో వైరస్ కేసులు చాప కింద నీరులా నెమ్మదిగా పెరుగుతూ పోతున్నాయి. గత నెలకు ముందు ఏకంగా 154 మందికి ఈ వైరస్ సోకినట్లు బ్రిటిష్ పబ్లిక్ హెల్త్ ప్రకటించింది. గత ఐదేళ్లలో చూస్తే ప్రతి ఐదు వారాలకు సగటున 53 కేసులు వచ్చాయట.

Norovirus Outbreak: Know Norovirus Symptoms, How it is Transmitted, Treatment and Prevention in Telugu

ఇది అందరికీ సోకుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ వ్యాధి వ్యాప్తి ఇటీవలి కాలంలో మరింత పెరిగినట్లు బ్రిటన్ ప్రభుత్వం జులై 16న ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా విద్యా సంస్థలు, ముఖ్యంగా నర్సరీలు, చైల్డ్ కేర్ సెంటర్లలో ఈ వ్యాధి సోకిన కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయట. ఈ నేపథ్యంలో నోరో వైరస్ అంటే ఏమిటి? దాని లక్షణాలేంటి? ఇది ఎలా సోకుతుంది.. ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Monsoon Diet : వర్షాకాలంలో ఇలాంటి ఫుడ్ జోలికి వెళ్లొద్దు... ఎక్కువగా ఏం తినాలంటే...Monsoon Diet : వర్షాకాలంలో ఇలాంటి ఫుడ్ జోలికి వెళ్లొద్దు... ఎక్కువగా ఏం తినాలంటే...

నోరో వైరస్ అంటే ఏమిటి?

నోరో వైరస్ అంటే ఏమిటి?

నోరో వైరస్ ను స్టమక్ ఫ్లూ (Stomach Flu) లేదా స్టమక్ బక్ (Stomuch Bug) అని కూడా అంటారు. ఇది ఇన్ ఫ్లూయెంజా వైరస్ ద్వారా వచ్చే జ్వరం లాంటిది కాదని అమెరికా వ్యాధుల నియంత్రణ సంస్థ (CDC) వివరించింది.

నోరో వైరస్ లక్షణాలు..

నోరో వైరస్ లక్షణాలు..

- తరుచుగా వాంతులవ్వడం

- విరేచనాలు

- వికారం

- పొట్ట, పేగుల్లో తీవ్రమైన మంటగా ఉండటం.

ఈ లక్షణాలు కొన్ని రోజుల పాటు ఉంటాయి. ఈ సమయంలో నోరో వైరస్ సోకిన వారు ముట్టుకునే వస్తువులు, ప్రదేశాల నుండి ఈ వైరస్ ఇతరులకు వ్యాపించొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరికి జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్ కూడా ఉంటాయట. ఈ వ్యాధి సోకిన వారికి 12 గంటల నుండి రెండురోజుల్లోగా దాని లక్షణాలు బయటకు కనిపిస్తాయట. అయితే ఇది సోకిన వారు తగిన జాగ్రత్తలు తీసుకుంట.. ఒకటి నుండి మూడు రోజుల్లో నుండి కోలుకునే అవకాశం కూడా ఉందట.

ఎలా సోకుతుందంటే..

ఎలా సోకుతుందంటే..

ఈ నోరో వైరస్ మహమ్మారి తినే ఆహారం, తాగే నీరు ద్వారా మానవులకు సోకుతుంది. నోరో వైరస్ సోకిన వారు ఏదైనా వస్తువులను తాకినా, ఏదైనా ప్రాంతాలకు వెళ్లినా.. వారు చేతులను నోట్లో పెట్టుకున్నా.. ఇతరులకు ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఈ నోరో భూతం పిల్లలపై వేగంగా ప్రభావం చూపుతోందట.

త్వరగా తండ్రి కావాలనుకుంటున్నారా? అయితే రోజూ ఈ కాఫీ 2 కప్పులు తాగండి చాలు...!త్వరగా తండ్రి కావాలనుకుంటున్నారా? అయితే రోజూ ఈ కాఫీ 2 కప్పులు తాగండి చాలు...!

వ్యాధి నివారణకు ఏం చేయాలంటే..

వ్యాధి నివారణకు ఏం చేయాలంటే..

ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. వేడి చేసిన కాచి చల్లార్చిన నీటిని తాగాలి. మీ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మీరు బాత్ రూమ్ లను చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. ఇక పిల్లకు డైపర్లు తరచుగా మార్చేస్తూ ఉండాలి. పరిశుభ్రతే ఈ వైరస్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

ప్రమాదం లేదు..

ప్రమాదం లేదు..

అయితే ఈ నోరో వైరస్ ప్రాణాంతకం కాకపోయినా.. ఇది కలిగించే బాధ, నొప్పి, మంట చాలా తీవ్రంగా ఉంటాయనీ, ఇతరులకు ఇది వేగంగా సోకుతుందని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే దీని లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి.. వారి సలహాలు తీసుకుంటే.. త్వరగానే కోలుకోవచ్చని చెబుతున్నారు.

English summary

Norovirus Outbreak: Know Norovirus Symptoms, How it is Transmitted, Treatment and Prevention in Telugu

Here we are talking about the norovirus outbreak: know norovirus symptoms, how it is transmitted, treatment and prevention. Read on
Story first published:Tuesday, July 20, 2021, 12:29 [IST]
Desktop Bottom Promotion