For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Omicron వేరియంట్ అంటే ఏమిటి? దీని లక్షణాలేంటి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ఒమిక్రాన్ కోవిద్-19 వేరియంట్ లక్షణాలు, ట్రాన్స్ మిషన్, వ్యాక్సిన్ ప్రభావం, దక్షిణాఫ్రికలోని కొత్త కోవిద్ వేరియంట్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇప్పుడిప్పుడే మనమంతా కరోనా గురించి మరిచిపోయి సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నాం. అయితే ఇంతలోనే దక్షిణాఫ్రికాలో వచ్చిన కొత్త కోవిద్ వేరియంట్ ప్రపంచాన్ని మరోసారి కలవరానికి గురి చేస్తోంది.

Omicron Covid-19 Variant Symptoms, Transmission, Vaccines Efficacy and other details in Telugu

దక్షిణాఫ్రికాలో ఇటీవల కనుగొన్న కొత్త కోవిద్-19 వేరియంట్ కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ Omicron(ఒమిక్రాన్)గా నామకరణం చేసింది. ఇది డెల్టా కంటే తీవ్రమైనదట. ఇది చాలా ప్రమాదకరమని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.

Omicron Covid-19 Variant Symptoms, Transmission, Vaccines Efficacy and other details in Telugu

దీంతో ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన నెలకొంది. ఇటీవలి కాలంలో కేవలం దక్షిణాఫ్రికాలో 'బి.1..529' వేరియంట్ గా కనిపించిన ఈ మహమ్మారి నెమ్మదిగా బోట్స్ వానాతో పాటు హాంకాంగ్ కూ విస్తరించింది. తాజాగా బెల్జియం, ఇజ్రాయెల్ లోనూ ఈ రకమైన కేసులు వెలుగులోకొచ్చాయి. కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచమంతా మరోసారి వణికిపోతోంది.

Omicron Covid-19 Variant Symptoms, Transmission, Vaccines Efficacy and other details in Telugu

ఈ సందర్భంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ అంటే ఏమిటి? దీని లక్షణాలేంటి? ఇది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీనికి చికిత్స పద్ధతులేమైనా ఉన్నాయా లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

New Covid-19 variant in South Africa:దక్షిణాఫ్రికాలో దడ పుట్టిస్తున్న కోవిద్..కొత్తవేరియంట్ లక్షణాలు ప్రమాదమా?New Covid-19 variant in South Africa:దక్షిణాఫ్రికాలో దడ పుట్టిస్తున్న కోవిద్..కొత్తవేరియంట్ లక్షణాలు ప్రమాదమా?

ఒమిక్రాన్ కోవిద్ వేరియంట్ అంటే?

ఒమిక్రాన్ కోవిద్ వేరియంట్ అంటే?

అత్యంత ఎక్కువగా పరివర్తనం చెందిన వేరియంట్ బి.1.1.529 అనేది వైరాలజిస్టులకు ప్రధాన ఆందోళనకు కారణం. ఎందుకంటే ఇది ‘భయంకరమైన స్పైక్'మ్యుటేషన్ ప్రొఫైల్ ను కలిగి ఉంది. బీటా వేరియంట్ ఉన్న దక్షిణాఫ్రికాలో అనేక ధ్రువీకరించబడిన కరోనా వైరస్ కేసులలో ఇది కనుగొనబడింది. ఇప్పుడు ఇది అత్యంత వేగంగా మరియు ప్రమాదకరంగా రూపాంతరం చెందుతోంది. దీనిపై వ్యాక్సిన్లు ఎంత మాత్రం ప్రభావవంతంగా పని చేస్తాయనే దానిపై నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది దక్షిణాఫ్రికాలోని ఒక ప్రావిన్స్ కు మాత్రమై పరిమితమైంది. కానీ కేవలం రెండు వార్లలోపే అత్యంత ఎక్కువగా వ్యాపించింది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పడు దక్షిణాఫ్రికాలో విధ్వంసకర డెల్టా తరంగాల తర్వాత అన్ని ఇన్ఫెక్షన్లపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు చివరి జన్యువులలో 75% వద్ద ఉంది. త్వరలో ఇది వందశాతానికి చేరుకోనుంది.

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు..

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు..

దక్షిణాఫ్రికాలో కనుగొన్న ఈ కొత్త వేరియంట్ కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రకటించింది. దీన్ని ‘ఆందోళనకర వేరియంట్(వేరియంట్ ఆఫ్ కన్నర్స్)'గా వర్గీకరించి, ‘ఒమిక్రాన్' అని పేరు పెట్టింది. కొద్దిరోజుల కిందంటే ‘వేరియంట్ అండర్ మానిటరింగ్'గా గుర్తించిన బి.1.1.529పై చర్చించేందుకు శుక్రవారం ఉన్నతాధికారులు నిపుణులతో డబ్ల్యుహెచ్ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఒమిక్రాన్ తీవ్రమైనదా?

ఒమిక్రాన్ తీవ్రమైనదా?

దక్షిణాఫ్రికాలో కనుగొన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడ నమోదవుతున్న వాటిలో 90 శాతం కేసులకు ఈ వేరియంట్ కారణమని చెబుతున్నారు. మరో ఎనిమిది ప్రావిన్సుల్లోనూ ఈ వేరియంట్ వ్యాపించి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బి.1.1.529 చాలా అసాధారణ వైరస్ ఉత్పరివర్తనాల కలయికగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మన బాడీలోని రోగనిరోధక శక్తిని ఇది ఏమార్చి, చాలా వేగంగా వ్యాపించొచ్చని భావిస్తున్నారు.

మహిళలు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఇది రోజుకు ఒక్కటి తినాల్సిందే... మిస్ చేయకండి!మహిళలు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఇది రోజుకు ఒక్కటి తినాల్సిందే... మిస్ చేయకండి!

ఒమిక్రాన్ కోవిద్ వేరియంట్ లక్షణాలు..

ఒమిక్రాన్ కోవిద్ వేరియంట్ లక్షణాలు..

ఒమిక్రాన్ కోవిద్ వేరియంట్ కూడా ఇతర వేరియంట్ల మాదిరిగానే లక్షణం లేని అంటువ్యాధులను ప్రదర్శిస్తుంది. అయితే ఇది సంక్లిష్టమైన జన్యుపరమైన ఆందోళకనరమైనదిగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ స్పైక్ ప్రోటన్లో 32 ఉత్పరివర్తనాలు ఉన్నాయని, డెల్టా వేరియంట్లతో పోలిస్తే ఇవి చాలా రెట్టింపు అని వారు విశ్లేషించారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మన దేశంలో ఇప్పటివరకు కొత్త వేరియంట్ కు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని ఇండియన్ సార్స్ కోవ్2 జీనోమిక్స్(ఇన్సాకాగ్) స్పష్టం చేసింది. అయితే ప్రజంతా కోవిద్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి.

భౌతిక దూరం పాటించాలి

చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి

శానిటైజర్ ను వెంటే ఉంచుకోవాలి.

వేడి పదార్థాలను, తాజా ఆహారాన్నే తీసుకోవాలి.

విదేశాల నుండి వచ్చిన వారిని దూరంగా ఉంచాలి.

వారికి కచ్చితంగా జన్యుపరమైన టెస్టులు చేయించాలి.

FAQ's
  • దక్షిణాఫ్రికాలో కనుగొన్న కొత్త కోవిద్ వేరియంట్ పేరేంటి?

    దక్షిణాఫ్రికాలో ఇటీవల కనుగొన్న కొత్త కోవిద్-19 వేరియంట్ కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ Omicron(ఒమిక్రాన్)గా నామకరణం చేసింది. ఇది డెల్టా కంటే తీవ్రమైనదట. ఇది చాలా ప్రమాదకరమని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.

  • దక్షిణాఫ్రికాతో పాటు ఏయే దేశాల్లో కోవిద్ కొత్త వేరియంట్ కేసులను కనుగొన్నారు?

    ఇటీవల దక్షిణాఫ్రికాతో పాటు హాంగ్ కాంగ్ దేశాల్లో ఈ కొత్త రకం కేసులను ఎక్కువగా కనుగొన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని దేశాల్లో వీటి ఆనవాళ్లు కనుగొన్నారు. తాజాగా బెల్జియం, ఇజ్రాయెల్ లోనూ ఇలాంటి కేసులు వెలుగులోకొచ్చాయి.

English summary

Omicron Covid-19 Variant Symptoms, Transmission, Vaccines Efficacy, Precautions and other details in Telugu

Omicron Covid-19 Variant Symptoms, Transmission, Vaccines Efficacy. Everything We Know About New COVID Variant Found In South Africa in Telugu.
Desktop Bottom Promotion