For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid-19 precaution dose :18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసులు...ఎప్పటినుంచంటే...

2022లో ఏప్రిల్ 10న కోవిద్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ అందజేయనున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన దేశంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ లు 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ 10వ తేదీ నుండి ఇవ్వడం ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు ప్రకటించింది.

Precaution Dose Allowed For All Adults From April 10 in Private Centers Govt in Telugu

ఈ బూస్టర్ డోస్ ప్రైవేట్ ఇమ్యూనైజేషన్ సెంటర్లలో కూడా అందుబాటులో ఉందని తెలిపింది. ఈ బూస్టర్ డోస్ 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ారు మరియు రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తి చేసుకున్న వారికి, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్మికులకు మరియు 60 శాతం మంది ప్రజలకు ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.

9 నెలల విరామం అవసరం..

18 సంవత్సరాలు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేసుకోవాలని, ఎవరైనా కరోనా టీకాలను తీసుకుని 9 నెలలు పూర్తయ్యింద వారందరూ ముందస్తు జాగ్రత్తగా ఈ బూస్టర్ డోస్ కు అర్హులని కేంద్రం ప్రకటించింది. ఈ సదుపాయం అన్ని ప్రైవేట్ టీకా కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో తొలి, రెండు డోసుల ఉచిత వ్యాక్సినేషన్ ఇది వరికటిలాగానే కొనసాగుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Precaution Dose Allowed For All Adults From April 10 in Private Centers Govt in Telugu

ఇప్పటికే మన దేశంలో 60 ఏళ్లు పైబడిన 2.4 కోట్ల మంది హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ప్రికాషన్ డోసులు పంపిణీ చేశారు. అలాగే, ఇప్పటివరకూ 15 ఏళ్లు పైబడిన వారందరూ 96 శాతం మంది ఒక డోసు తీసుకున్నారు. 83 శాతం మంది రెండో డోసు కూడా తీసుకున్నారు. ఇక 12-14 ఏళ్ల లోపు వారిలో 45 శాతం మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు.

ముంబైలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఎక్స్ఇ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో... చైనా, యుకెలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న సందర్భంగా బూస్టర్ డోస్ పంపిణీ కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం కావడంతో కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే దశల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతూ వచ్చిన కేంద్రం ఇక నుండి ఉచితంగా ప్రికాషన్ డోసు పంపిణీకి చర్యలు తీసుకోనుంది.

FAQ's
  • మన దేశంలో ఎప్పటినుండి బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నారు?

    మన దేశంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ లు 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ 10వ తేదీ నుండి ఇవ్వడం ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు ప్రకటించింది. ఈ బూస్టర్ డోస్ ప్రైవేట్ ఇమ్యూనైజేషన్ సెంటర్లలో కూడా అందుబాటులో ఉందని తెలిపింది. ఈ బూస్టర్ డోస్ 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారు మరియు రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తి చేసుకున్న వారికి, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్మికులకు మరియు 60 శాతం మంది ప్రజలకు ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.

English summary

Precaution Dose Allowed For All Adults From April 10 in Private Centers Govt in Telugu

Here we are talking about the government has allowed booster doses or what it calls precautionary doses of Covid vaccine for all adults from April 10, 2022. Read on
Story first published:Saturday, April 9, 2022, 11:58 [IST]
Desktop Bottom Promotion