For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలతో వర్షకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చు...

వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

వర్షాకాలం వస్తే మనకు కచ్చితంగా వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ సీజన్లో మన రోగ నిరోధక శక్తి సన్నగిల్లే ప్రమాదం కూడా ఉంది. దీని వల్ల మనం మాన్ సూన్ కు సంబంధించిన అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.

Protect Yourself From Common Monsoon Diseases

ముఖ్యంగా ఈ కాలంలో చికున్ గున్యా, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో మీరు అలాంటి వ్యాధుల బారిన పడకుండా ఇంట్లోనే ఉంటూ కొన్ని రెమెడీస్ ను తయారు చేసుకోవాలి.

Protect Yourself From Common Monsoon Diseases

అలాగే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ సందర్భంగా ఇంట్లో ఏయే వస్తువులతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

Virat Kohli Diet:కెప్టెన్ కోహ్లీ వర్కవుట్ల విషయంలో తగ్గట్లేదుగా...Virat Kohli Diet:కెప్టెన్ కోహ్లీ వర్కవుట్ల విషయంలో తగ్గట్లేదుగా...

పసుపు..

పసుపు..

మనలో ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు కచ్చితంగా ఉంటుంది. ఇది సహజంగా దొరుకుతుంది. ఇందులో యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటి ఇన్ఫ్లమేటరీ పుష్కలంగా ఉంటాయి. దీన్ని మీరు ప్రతి వంటకంలో తగినంతగా కచ్చితంగా వాడాలి. దీని వల్ల మీ రోగనిరోధక శక్తి కచ్చితంగా మెరుగవుతుంది. అలాగే మీ బాడీలో ఉండే విషాన్ని కూడా బయటకు పంపుతుంది. ఈ పసుపును ఎక్కువగా మసాలా ఆహారాల్లో వాడండి లేదా వర్షాకాలంలో మీకు రక్షణగా ఉండేందుకు పాలల్లో చిటికెడు పసుపు కలిపి తీసుకోవచ్చు.

అల్లం..

అల్లం..

అల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ఎక్కువగా మసాలా వంటకాలలో వాడుతూ ఉంటారు. ఇది మీ బాడీలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అలాగే మీ జీర్ణక్రియ సులువుగా అయ్యేందుకు తోడ్పడుతుంది. ఇక వర్షాకాలంలో మీరు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. అల్లం టీని వారానికి కనీసం రెండుసార్లైనా తాగాలి. ఇది అనారోగ్యం నుండి కాపాడటంలో పుష్కలంగా పని చేస్తుంది. దీనిలో మీ బాడీలో నొప్పిని తగ్గించే అవసరమైన పోషకాలు కూడా నిండి ఉన్నాయి.

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క..

మన ఇళ్లలోని వంటగదిలో విరివిగా లభించే వాటిలో దాల్చిన చెక్క ఒకటి. దీన్ని ఎక్కువగా మసాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. ఈ సుగంధ ద్రవ్యాన్ని వేలాది సంవత్సరాలుగా మన పూర్వీకుల నుండి నేటి తరం వరకు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఇందులో ఎన్నో ఔషధ లక్షణాలున్నాయి. దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, గొంతులో మంట వంటివి తగ్గుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ మసాలా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు గుండె జబ్బులు రాకుండా నిరోధించడానికి పైన్ నట్స్ సరిపోతాయి!రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు గుండె జబ్బులు రాకుండా నిరోధించడానికి పైన్ నట్స్ సరిపోతాయి!

మెంతులు..

మెంతులు..

సాధారణంగా మనలో చాలా మంది మెంతులను బాగా నానబెట్టి వంటకాలలో వాడుతూ ఉంటారు. ఈ మెంతి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా రోగ నిరోధక వ్యవస్థకు మెరుగయ్యేలా పని చేస్తాయి. వీటిలో ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి మన బాడీలో నీటి నిల్వలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ..

హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ..

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు, మీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకునేందుకు హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ కూడా రెగ్యులర్ గా తీసుకోండి. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గుతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు మీ దరి చేరకుండా కాపాడతాయి. వెచ్చని కప్పు టీని సిప్ చేయడం వల్ల మీ గొంతుకు కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే టాన్సిల్స్ ను అదుపులో ఉంచుతాయి.

వేడి పదార్థాలు..

వేడి పదార్థాలు..

వర్షాకాలంలో వాతావరణం చల్లగా మారిపోవడం వల్ల మీ జీర్ణశక్తి ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ కాలంలో మీరు చల్లని మరియు నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోవద్దు. దీని వల్ల ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా వంటివి సోకే ప్రమాదం ఉంది. అంతే కాదు చల్లని ఆహారం తీసుకోవడం వల్ల కడుపులో ప్రేగులు మరియు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిది. ఇది మీ బాడీ నుండి విషాన్ని బయటకు తీయడానికి మరియు మీ వ్యవస్థను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

పేగు పరాన్నజీవులను సహజ పద్ధతిలో నాశనం చేయడానికి సహాయపడే ఆహారాలు !!!పేగు పరాన్నజీవులను సహజ పద్ధతిలో నాశనం చేయడానికి సహాయపడే ఆహారాలు !!!

ఆవ పిండి..

ఆవ పిండి..

వర్షాకాలంలో ఎక్కువగా ఆవపిండితో చేసిన పదార్థాలు తినడం వల్ల అంటు వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఆవ పిండితో చేసిన ఆవకాయ పచ్చడి, మజ్జిగ చారు, ఆవపెట్టిన కూరలు మొదలైనవి ఈ కాలంలో తరచుగా తింటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

వెల్లుల్లి మజ్జీగ..

వెల్లుల్లి మజ్జీగ..

వాతావరణం చల్లగా మారినప్పుడు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, కొవ్వు సమస్యల పరిష్కారానికి, శ్వాస సమస్యలు, గురక సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి, రక్తనాళాల్లో పూడికలు ఇతర సమస్యల పరిష్కారం కోసం వెల్లుల్లి మజ్జీగ తీసుకోవాలి. రెండు వెల్లుల్లి పాయలను మెత్తగా పేస్ట్ లా చేసుకుని, ఒక గ్లాసు మజ్జిగలో కలిపి పరగడుపునే తీసుకోవాలి.

తమలపాకు రసం..

తమలపాకు రసం..

వర్షాకాలయంలో కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ తమలాపాకు రసం తీసుకోవడం చాలా ఉత్తమం. కొన్ని శ్వాస సంబంధ ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, కఫ సంబంధ సమస్యలు తమలపాకు రసం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందొచ్చు. ఈ రసం తయారీ కోసం పది నుండి పదిహేను తమలపాకులను శుభ్రంగా కడిగి, నీళ్లు వేసి మిక్సీలో జ్యూస్ లా మార్చుకోవాలి. ఆ తర్వాత దాన్ని వడగట్టి.. అందులో తేనే, నిమ్మరసం లేదా ఉప్పు కలిపి పరగడుపునే తీసుకోవాలి.

English summary

Protect Yourself From Common Monsoon Diseases

Here we are talking about the protect yourself from common monsoon diseases. Have a look
Story first published:Monday, July 12, 2021, 11:49 [IST]
Desktop Bottom Promotion