For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనాతో కన్నుమూసిన సర్కారు వారి పాట దర్శకుడు వట్టి కుమార్.. కోవిద్-19 సోకితే చనిపోతారా?

కరోనాతో సర్కారు వారి పాట డైరెక్టర్ వట్టి కుమార్ మరణించాడు. కోవిద్-19 వచ్చిన వారు చనిపోవాడనికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా వైరస్ ఈ పేరు చెప్పగానే భారతదేశంలోని ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల సంఖ్యలో పెరుగుతోంది.

Sarkaru Vaari Paata Director Vatti Kumar Died With Coronavirus : What Causes Death in COVID-19 Coronavirus Patients?

వేల సంఖ్యలో మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ కరోనా మహమ్మారి టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కలకలం రేపుతోంది. తాజాగా సర్కారు వారి పాట దర్శకుడు వట్టి కుమార్ కరోనా కాటుకు బలయ్యారు. ఈ మరణ వార్త విన్న వారంతా షాకవుతున్నారు.

Sarkaru Vaari Paata Director Vatti Kumar Died With Coronavirus : What Causes Death in COVID-19 Coronavirus Patients?

టాలీవుడ్ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారంతా చనిపోతారా?

Sarkaru Vaari Paata Director Vatti Kumar Died With Coronavirus : What Causes Death in COVID-19 Coronavirus Patients?

దీనికి మనం అడ్డుకట్ట వేయగలమా, అసలు కరోనా సోకిన వారిలో ఎవరెవరు ఎక్కువగా మరణించే అవకాశం ఉంది.. ఇందుకు గల కారణాలేంటి.. అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Coronavirus symptoms in Voice:కరోనా సోకినట్లు డౌటొస్తుందా? అయితే మీ గొంతులో ఈ మార్పులొస్తాయట...!Coronavirus symptoms in Voice:కరోనా సోకినట్లు డౌటొస్తుందా? అయితే మీ గొంతులో ఈ మార్పులొస్తాయట...!

కరోనా తీవ్రతతో..

కరోనా తీవ్రతతో..

కొద్ది రోజుల క్రితం వట్టి కుమార్ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ నుంచి తన సొంత జిల్లా శ్రీకాకుళంలోని నర్సన్నపేటకు వెళ్లారు. అక్కడ జ్వరం తీవ్రత పెరగడం, కరోనావైరస్ అని నిర్ధారణ కావడంతో జేమ్స్ అనే హాస్పిటల్‌లో చేరారు. కొద్ది రోజుల క్రితం ఆరోగ్య మెరుగుపడుతుందని స్నేహితులకు సమాచారం అందించారు. అయితే గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్లాస్మా ఎక్కించారు. ఈ క్రమంలోనే ఆయన మరణించినట్టు స్నేహితులు తెలిపారు.

కరోనా సోకితే మరణమా..

కరోనా సోకితే మరణమా..

కరోనా వచ్చిన తొలిరోజుల్లో దానికి ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి ఆ సమయంలో కరోనా సోకిన వారు మరణానికి దగ్గరవుతారని నిపుణులు చెప్పారు. ఎందుకంటే ఈ వ్యాధి సోకిన వారిలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయని, దీని వల్ల 28 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతారని నిపుణులు చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా రెండో దశలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు గాలిలో నుండి కరోనా వస్తోందని.. ప్రతి వ్యక్తికి సరైన గాలి లభించకపోతే అంతకన్నా త్వరగా చనిపోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గాలి ద్వారా కరోనా : ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కష్టమే...!గాలి ద్వారా కరోనా : ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కష్టమే...!

కరోనా మరణానికి కారణాలు..

కరోనా మరణానికి కారణాలు..

ఎవరైతే వ్యక్తులు డయాబెటిస్, అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతుంటారో.. అలాంటి వారికి కరోనా సోకితే.. వారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలలో తేలింది. జిబో లియు అనే రచయిత అభిప్రాయం ప్రకారం, కరోనా సోకిన వారిలో శ్వాస సరిగా ఆడక, రక్తం గడ్డకట్టడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరు క్షీణించడం వంటివి జరుగుతాయట.

ది లాన్సెట్ అధ్యయనంలో..

ది లాన్సెట్ అధ్యయనంలో..

ది లాన్సెట్ లో ప్రచురించబడిన అధ్యయనంలో జినింటన్ హాస్పిటల్ మరియు వూహాన్ పల్మనరీ హాస్పిటల్ ప్రయోగశాల నుండి కోవిద్-19 సోకి డిశ్చార్జి అయినా వారిని, కరోనా వల్ల మరణించిన వారి జాబితాను సేకరించారు. వీరిలో అధిక రక్తపోటు, షుగర్ ఎక్కువగా ఉన్న వారికే అత్యంత ప్రమాదమని తేలింది.

ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..

ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..

కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఇంట్లో ఉన్న సమయంలో కూడా మాస్క్ ధరించాలి. కుటుంబ సభ్యులో కూడా సామాజిక దూరం పాటించాలి. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. తెలియని వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లినా రద్దీ ప్రాంతంలో అస్సలు వెళ్లకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

English summary

Sarkaru Vaari Paata Director Vatti Kumar Died With Coronavirus : What Causes Death in COVID-19 Coronavirus Patients?

Here we are talking about the sarkaru vaari paata director vatti kumar died with coronavirus : What causes death in COVID-19 coronavirus patients?. Read on
Story first published:Saturday, May 1, 2021, 1:03 [IST]
Desktop Bottom Promotion