For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తిన్న వెంటనే టీ తాగుతున్నారా? అయితే ఈ అలవాటును మార్చుకోండి... లేదంటే అంతే సంగతులు...!

తిన్న వెంటనే టీ తాగితే చాలా దుష్ప్రభావాలు కలుగుతాయంట అవేంటో చూసెయ్యండి.

|

రిలాక్స్ కోసం, టెన్షన్ తగ్గించుకోవడం కోసం చాలా మంది ప్రతిరోజూ టీ, కాఫీలు తాగుతుంటారు. భోజనం చేసిన వెంటనే కొందరు టీ తాగుతుంటారు.

Side Effects Of Drinking Tea After Meal in Telugu

భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటే ఆ పద్దతి మార్చుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే టీ తాగితే అందులోని కెఫిన్ శరీరంలోని కార్టిసాల్, స్టెరాయిడ్ హార్మోన్లు పెంచడం ద్వారా మీ ఆరోగ్యం దెబ్బ తింటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Side Effects Of Drinking Tea After Meal in Telugu

భోజనం చేసిన వెంటనే టీ తాగితే ఆరోగ్యంలో ఎలాంటి సమ్యలు వస్తాయి, వాటి వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతాయో తెలుసుకోండి.

COVID-19:ప్రపంచంలోని తొలి డిఎన్ఎ వ్యాక్సిన్.. భారత్ లో వినియోగించేందుకు జైడస్ దరఖాస్తు.. పూర్తి వివరాలు ఇలా...COVID-19:ప్రపంచంలోని తొలి డిఎన్ఎ వ్యాక్సిన్.. భారత్ లో వినియోగించేందుకు జైడస్ దరఖాస్తు.. పూర్తి వివరాలు ఇలా...

రక్తపోటు రావొచ్చు..

రక్తపోటు రావొచ్చు..

మద్యాహ్నం, రాత్రి భోజనం చేసిన వెంటనే టీ తాగితే కచ్చితంగా రక్తపోటు వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీలో కెఫిన్ ఉండటం వలన భోజనంతో పాటు టీ కూడా శరీరంలో కలిసిపోతుందని, ఈ దెబ్బతో రక్తపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. భోజనం చేసిన తరువాత టీ తాగే అలవాటు ఉంటే కచ్చితంగా మార్చుకోవాలని నిపుణులు చూసిస్తున్నారు.

గుండె జబ్బులు..

గుండె జబ్బులు..

భోజనం చేసిన వెంటనే టీ తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయని వైద్యులు అంటున్నారు. టీ తాగిన తరువాత గుండె వేగంగా కొట్టుకుంటుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని, మీకు అలవాటు ఉంటే వెంటనే ఆ పద్దతి మార్చుకోవాలని, గుండె జబ్బులకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

జీర్ణ వ్యవస్థలో సమస్యలు..

జీర్ణ వ్యవస్థలో సమస్యలు..

భోజనం చేసిన తరువాత ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అలాంటిది భోజనం చేసిన వెంటనే టీ తాగడం వలన జీర్ణవ్యవస్థ బలహీన పడుతుంది. మీరు చేసిన భోజనం సరైన సమయంలో జీర్ణం కాకుండా మీరు తాగిన టీ అడ్డుపడుతుందని వైద్యులు అంటున్నారు. భోజనం చేసిన తరువాత కొంచెం గ్యాప్ ఇచ్చి టీ తాగితే ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి.

Bird Flu: భారత్ లో తొలిసారి బర్డ్ ఫ్లూతో బాలుడి మృతి.. ఈ వైరస్ నుండి తప్పించుకోవాలంటే.. ఇవి చేయండి...Bird Flu: భారత్ లో తొలిసారి బర్డ్ ఫ్లూతో బాలుడి మృతి.. ఈ వైరస్ నుండి తప్పించుకోవాలంటే.. ఇవి చేయండి...

రక్తహీనత ఇబ్బందులు

రక్తహీనత ఇబ్బందులు

భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో లేనిపోని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. టీలో ఉండే ఫోనోలిక్ కారణంగా మీరు తీసుకున్న ఆహారంలో ఐరన్ పోషకాలు దెబ్బ తినే అవకాశం ఉంది. మీరు తీసుకున్న భోజనంలోని పోషకాలు జీర్ణం కాకపోవడం వలన రక్తహీనత సమస్యలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు అంటున్నారు.

తలనొప్పి సమస్యలు..

తలనొప్పి సమస్యలు..

తలనొప్పి తగ్గించుకోవడానికి చాలా మంది టీ తాగుతుంటారు. తలనొప్పి తగ్గడానికి ఇంటి ఔషదం టీ అనే విషయం అందరికి తెలిసిందే. అయితే భోజనం చేసిన తరువాత వెంటనే టీ తాగితే మీ శరీరంలో గ్యాస్ ఫామ్ అవుతోందని, అందు వలన మీకు తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు.

Norovirus Outbreak:కొత్తగా నోరో వైరస్ కలకలం.. దీని లక్షణాలేంటి.. ఇది ఎలా సోకుతుందంటే..Norovirus Outbreak:కొత్తగా నోరో వైరస్ కలకలం.. దీని లక్షణాలేంటి.. ఇది ఎలా సోకుతుందంటే..

గ్యాప్ ఇవ్వండి..

గ్యాప్ ఇవ్వండి..

మీరు రోజు టీ తాగితే సమస్యలు ఏమీ పెద్దగా ఉండవు. అయితే భోజనం చేసిన వెంటనే టీ తాగితే గుండె జబ్బులు, రక్తపోటు, గ్యాస్ ఫామ్ కావడం, రక్తహీనత, తలనొప్పి, మీరు చేసిన భోజనం జీర్ణం కాకపోవడం తదితర సమస్యలు వస్తాయి. మీరు కచ్చితంగా టీ తాగాలి అనిపిస్తే భోజనం చేసిన గంట లేదా రెండు గంటల తరువాత టీ తాగవచ్చని, అప్పుడు ఇలాంటి సమస్యలకు మీరు దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

హార్మోన్ల పెరుగుదల..

హార్మోన్ల పెరుగుదల..

టెన్షన్ తగ్గించుకోవడం కోసం చాలా మంది ప్రతిరోజూ టీ, కాఫీలు తాగుతుంటారు. భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటే ఆ పద్దతి మార్చుకోవాలని నిపుణులు అంటున్నారు. భోజనం చేసిన వెంటనే టీ తాగితే అందులోని కెఫిన్ శరీరంలోని కార్టిసాల్, స్టెరాయిడ్ హార్మోన్లు పెంచడం ద్వారా మీ ఆరోగ్యం దెబ్బ తింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary

Side Effects Of Drinking Tea After Meal in Telugu

Here we talking about the Side Effects of Drinking Tea After Meal. Have a look
Desktop Bottom Promotion