For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారు మూత్రం నిలబడి పోయాలా? లేదా కూర్చొని పోయాలా? ఎలా చేస్తే బెటరో తెలుసా...!

పురుషులు మూత్ర విసర్జనను ఏ పొజిషన్లో చేస్తే బెటరో తెలుసుకోండి...

|

ఇలాంటి విషయాలను చాలా మంది బయటకు చెప్పుకోలేరు. అలాగని ఎప్పటికీ దాచుకోలేరు. ఎందుకంటే ఈ విషయం బయటకు చెబితే ఎవరు ఏమనుకుంటారో అని ఫీలవుతుంటారు.

Sit or Stand: How Should Men Pee?

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ లోకంలో చాలా మంది పురుషులు నిల్చొని మూత్రం పోస్తూ ఉంటారు. కానీ కొందరు మగవారు మాత్రం కూర్చొని ఆ పని కానిచ్చేస్తారు. అయితే ఆడవారు మాత్రం ఈ పనిని కూర్చొనే చేస్తారు. కాబట్టి వారికి ఎలాంటి సమస్యా ఉండదు.

Sit or Stand: How Should Men Pee?

అయితే ఎటొచ్చి సమస్య అంతా మగవారికే ఉంటుంది. ఎందుకంటే సాఫీగా సాగిపోవాల్సిన మూత్ర విసర్జనలో కొన్నిసార్లు ఏవైనా తేడాలు కనిపిస్తే ఎవ్వరికైనా సరే గుండె గుబేల్ మంటుంది. ఏమైపోయిందో.. ఏమోననే టెన్షన్ స్టార్టవుతుంది.

Sit or Stand: How Should Men Pee?

ఇలాంటి సమయంలో కొందరు పురుషులకు ఓ సమస్య తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మేము కొన్ని పరిశోధనలను పరిశీలించాం. నిపుణులతో కూడా చర్చించాం. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కూడా చర్చించారు. ఆరోగ్యం, పరిశుభ్రతను ద్రుష్టిలోపెట్టుకుని మగవారు నిల్చొని మూత్రం పోయాలా? లేదా కూర్చొని మూత్రం పోయాలా అనే వివరాలను వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

మూత్ర విసర్జన చేస్తే ప్రక్రియ..

మూత్ర విసర్జన చేస్తే ప్రక్రియ..

చాలా మంది మగవారు నిలబడే మూత్ర విసర్జన చేయడం ఎంతో ఆచరణాత్మకంగా పాటిస్తారు. ఎందుకంటే దీని వల్ల వారికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్ లో.. సినిమా హాళ్లలో నిలబడి మూత్రం పోసే తొట్లనే ఎక్కువగా అమరుస్తారు. ఎందుకంటే దీనికి తక్కువ స్థలం అవసరమవుతుంది. అదే కూర్చొని మూత్రం పోయాలంటే దానికి ఎక్కువ స్థలం పోతుందని భావిస్తారు.

మూత్రం ఎలా తయారవుతుందంటే..

మూత్రం ఎలా తయారవుతుందంటే..

మన మూత్రపిండాలలో మూత్రం తయారవుతుంది. మన రక్తం యొక్క వ్యర్థాలను శుభ్రపరుస్తాయి. అప్పుడు మూత్రం మూత్రాశయంలో సేకరిస్తుంది. మనం మళ్లీ మళ్లీ వాష్ రూమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మన పనిని హాయిగా చేసి రాత్రి పడుకోవడానికి ఇదే కారణం. మూత్రాశయంలో మూడింట రెండొంతలు నిండినప్పుడు మాత్రమే మీరు మూత్ర విసర్జన చేయాలి.

మూత్రాశయం తగ్గిపోతుంది..

మూత్రాశయం తగ్గిపోతుంది..

మూత్ర విసర్జన చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మన కటి నేల కండరాలు మరియు మూత్ర నాళాన్ని విడదీసే వ్రుత్తాకార కండరం. దీని తర్వాత మూత్రాశయం తగ్గిపోతుంది. అలాగే మూత్రం బయటకు వెళ్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తికి మూత్రాన్ని బయటకు పంపడానికి ఎలాంటి శక్తి ఉపయోగించాల్సిన అవసరం లేదు.

ఎవరు కూర్చొని చేయాలి?

ఎవరు కూర్చొని చేయాలి?

బిబిసి చేసిన ఓ అధ్యయనం ప్రకారం, ప్రొస్టేట్ సమస్యలు మరియు వాపు ఉన్న పురుషులు కూర్చొని మూత్ర విసర్జన చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. కూర్చొని మూత్రం పోయడం ద్వారా విసర్జన నాళంలో మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుందని ప్లోస్ వన్ అనే సైన్స్ జర్నల్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

ఈ సమస్య ఉన్నవారు..

ఈ సమస్య ఉన్నవారు..

ప్రోస్టేట్ సమస్యతో ఎవరైతే బాధపడుతుంటారో.. అలాంటి పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నారని, కూర్చున్నప్పుడు మూత్రనాళాల్లో ఒత్తిడి తగ్గి చాలా సౌకర్యవంతంగా, త్వరగా మూత్ర విసర్జన చేయగలుగుతున్నారని ఆ పరిశీలనలో వెల్లడైంది.

ఆరోగ్యవంతులు మాత్రం..

ఆరోగ్యవంతులు మాత్రం..

కొందరు పురుషులు మూత్ర విసర్జన కూర్చొని చేస్తారు. దీని వల్ల పాదాలకు మూత్రం చిట్ల కుండా.. దుమ్ము, ధూళి వంటివి వ్యాపించకుండా ఉంటుంది. అయితే కొందరు తొందరలోనో లేదా ఏదైనా ఆత్రుతలో, టెన్షన్లో నిలబడే ఆ పనిని ముగించేస్తారు. అయితే ఆరోగ్యవంతులైనా పురుషులు కూర్చొని పోసినా.. లేదా నిల్చొని పోసినా పెద్దగా తేడా కనిపించదని తేలింది.

సౌకర్యవంతమైన టాయిలెట్లను..

సౌకర్యవంతమైన టాయిలెట్లను..

అయితే మూత్ర విసర్జన సమస్యలతో బాధపడే మగవారు మాత్రం కూర్చొని మూత్రం పోసేందుకు సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉండే టాయిలెట్లను సెలెక్ట్ చేసుకోవాలని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) సూచిస్తోంది.

English summary

Sit or Stand: How Should Men Pee?

A mans decision to urinate standing up or sitting down would be made based on how he was brought up, his culture and his personal preference.
Desktop Bottom Promotion