Just In
- 1 hr ago
రాత్రిపూట సాక్స్‌లో ఉల్లిపాయను పెట్టుకుని పడుకోవడం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా?
- 1 hr ago
మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారని మీకు డౌటా? ఇలా గుర్తించొచ్చు!
- 1 hr ago
మీకు పీరియడ్స్.. సమస్యను మీ బాబుకు చెప్పడం ఎలా?
- 2 hrs ago
ఎడమచేతి వాటం ఉన్నవారు చాలా తెలివైన వారని మీకు తెలుసా? మీకు తెలియని ఎన్నో రహస్య విషయాలు ఇక్కడ ఉన్నాయి!
Don't Miss
- Movies
Bigg Boss 6 Telugu: హౌస్ లోకి రాబోయే ఫైనల్ లిస్ట్.. బజ్ లో నాన్ స్టాప్ యాంకర్!
- News
సోనియాగాంధీని కలిసిన తర్వాత ''టీక్ హై.. .ముజే కహనా హోగా.. అంటారు??
- Finance
Damani Vs Ambani: పోరులోకి దమానీ, అంబానీ.. ఆ రంగంపై పట్టుకోసం ప్రయత్నాలు..
- Technology
8 యూట్యూబ్ ఛానెల్‌లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం!! కారణం ఏమిటో...
- Travel
పచ్చని కునూర్‌లో.. పసందైన ప్రయాణం చేద్దామా?!
- Automobiles
చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?
- Sports
IND vs ZIM: రాహుల్ త్రిపాఠిది టూరిస్ట్ వీసానా?.. రుతురాజ్ లేడు మ్యాచ్ చూడమ్! ఫ్యాన్స్ ఫైర్!
డెంగ్యూ జ్వరమా? బొప్పాయి ఆకులతొ డెంగ్యూ ఫీవర్ పరార్..
వర్షాకాలం ప్రారంభమైన తరచుగా వినిపించే జ్వరం పేరు డెంగ్యూ. ఎక్కడ చూసినా డెంగ్యూ జ్వరంతో భాదపడుతున్నారు. సెలబ్రెటీలు సైతం డెంగ్యూ భారీన పడుతున్నారు. మొన్నరేణుదేశాయ్, నిన్న కేటిఆర్, నేడు నాగార్జున. ఇప్పుడు రాష్ట్రమంతటా సాధారణంగా వినిపిస్తున్న మాట డెంగ్యూ. డెంగ్కొయూ పై నిన్న అక్కినేని నాగార్జున గారు ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొన్ని సోషియల్ మీడియాల్లో కూడా సెలబ్రెటీలు #ట్యాంగ్ లతో హెచ్చరిస్తున్నారు.
#monsoonfever Just about recovered from viral fever.. The body pains were crazy!! Way out is stopping Mosquitoes breeding!! I asked my people to clear out all stagnant water at home and at Annapurna studios… Requesting you all to do it at your place of work and home👍 @KTRTRS pic.twitter.com/NImGNYd18R
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 15, 2019
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, మురుగు నీటిని నివారించండి, దోమలను అరకట్టండి అనే నిధాలు సోషియల్ మీడాయాల్లో కనబడుతున్న విషయాలు. డెంగ్యూ ఇది ప్రాణాంతకమైన ఫ్లూ జ్వరం. ఇది కేవలం మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచమంతటా విస్తృతంగా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండలం మరియు ఉపఉష్ణమండల శివారు నగర ప్రాంతాలల్లో ఇది ఎక్కువగా ఉంది. దోమల ద్వారా వ్యాపించిన డెంగ్యూ జ్వరం పీడితులు పది రోజుల్లో కోలుకుంటారు. కానీ అది తీవ్రంగా ఉంటే మాత్రం ప్రమాధకరంగా భావించే ఖచ్చితమైన చికిత్సను తీసుకోవడం మంచిది లేదంటే ప్రాణాంతకం అవుతుంది.
డెంగ్యూ దోమల వలన సోకి వచ్చే వ్యాధి, ఇది వయస్సుతో ,లింగంతో సంబంధం లేకుండా మలేరియా, చికెన్ గున్యాలాగానే ఎవరికైనా సోకుతుంది.డెంగ్యూ దోమల వలన వ్యాపించే వైరల్ వ్యాధి, ఇది ఎక్కువగా భారత్, ఆఫ్రికా, దక్షిణ చైనా, తైవాన్, మెక్సికో,పసిఫిక్ ద్వీపాలు, దక్షిణ అమెరికా వంటి ఉష్ణ, సమశీతోష్ణ దేశాలలో వస్తుంది. ఈ ప్రదేశాలలో వాతావరణం వేడిగా, తేమగా ఉండి దోమలు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఈ దేశాలలో నివసిస్తున్న ప్రజలు మరింత జాగ్రత్తగా ఉంటూ, దోమల వలన వచ్చే వ్యాధులను నివారించుకోటం ఎంత వీలైతే అంత నేర్చుకోవాలి.

డెంగ్యూ లక్షణాలు
డెంగ్యూ జ్వరం లక్షణాలు సాధారణంగా ఇన్ఫెక్షన్ దోమ కుట్టిన నాలుగు నుంచి ఆరు రోజులకి మొదలవుతాయి. కొన్ని సాధారణ లక్షణాలు హఠాత్తుగా వచ్చే ఎక్కువ జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కంటి వెనుక నొప్పి, తీవ్రమైన కండరాలు,కీళ్ల నొప్పులు, తీవ్ర అలసట, వికారం,వాంతులు, చర్మంపై ర్యాషెస్, వణుకు, ఆకలి లేకపోవటం, కొంచెం ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటివి ఉండవచ్చు.

డెంగ్యూ ఫీవర్ కు కారణం :
రక్తంలో ప్లేట్లెట్స్ గణనీయంగా తగ్గిపోవడం. కొన్ని సందర్భాల్లో ఇది ఊపిరితిస్తులు, గుండె, మరియు కాలేయం డ్యామేజ్ కు గురి అవుతాయి. సెడన్ గా బ్లడ్ ప్రెజర్ తగ్గడం వల్ల షాక్ లేదా మరణం సంభవించవచ్చు. డెంగ్యూ ఫీవర్ ను రక్త పరీక్ష ద్వారా నిర్థారించవచ్చు.

డెంగ్యూ ఫీవర్ చికిత్సలో బొప్పాయి ఆకులు ఏలా పనిచేస్తాయి?
డెంగ్యూ ఫీవర్ కారణాల కంటే డెంగ్యూ లక్షణాలను చికిత్స ద్వారా నయం చేయవచ్చు. అందుకు కొన్ని హోంరెమెడీస్ ప్రభావంతంగా పనిచేస్తాయి. నిపుణుల ప్రకారం ఆకుకూరలు, బ్రొకోలీ మరియు వ్యాధినిరోధకతతను పెంచు ఆహారాలు డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ప్రభావంతంగా నివారిస్తాయని సూచిస్తున్నారు. అలాగే జర్నల్ అన్నల్స్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్స్ రీసెర్చ్ లో పచురితమైన వివిధ పరిశోధనల్లో డెంగ్యూ ఫీవర్ తో భాదపడే వారికి బొప్పాయి ఆకుల నుండి తీసిన రసం మంచి ఎంపిక అని సూచిస్తున్నాయి. 24 గంటల చికిత్స సమయంలో ప్రతి 8 గంటల వ్యవధి తేడాతో రెండు డోసులు బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల రక్తంలో క్రమంగా ప్లేట్ లెట్స్ పెరిగి, మొత్తం వైట్ బ్లడ్ సెల్ పెరిగి వ్యాధి నుండి బయటపడినట్లు గుర్తించారు.

బొప్పాయి ఆకులు ఎలా ఉపయోగించాలి:
బొప్పాయి ఆకులను తాగాజావి తీసుకుని, వాటిని బాగా శుభ్రం చేసి, చిన్నముక్కలుగా కట్ చేయాలి. ఈ కట్ చేసిన ఆకును మిక్సీ గ్రైండర్ లో వేయాలి. వేడి చేసి చల్లార్చిన నీరు కూడా మిక్స్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకి కొద్దిగా పంచదార వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టాలి. అరగంట తర్వాత ఈ పేస్ట్ ను బాగా పిండి రసాన్ని తియ్యాలి. ఈ రసాన్ని24గంటల పాటు ఫ్రిజ్ లో నిల్వచేసుకోవాలి. మరుసటి రోజు నుండి దీన్ని ఉపయోగించాలి. ఒక పేషంట్ ఒక సారికి ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రమే, ఉదయం, రాత్రి తాగాలి.

డెంగ్యూ పేషంట్ కి దీంతో పాటు మరికొన్ని డైట్ టిప్స్
డెంగ్యూ పేషంట్ తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. శరీరం హైడ్రేషన్ లో ఉండాలి. తగినన్ని పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి ద్వారా వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ఈ క్రింది సూచించిన ఆహారాలు పేషంట్ శరీరాన్ని హైడ్రేషన్లో ఉంచి డెంగ్యూ నుండి బయటపడటానికి సహాయపడుతాయి...

ఆరెంజ్ :
ఆరెంజ్ లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉన్నందున వీరికి చాలా ప్రయోజనకరం. ఇంకా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది వ్యాధితో పోరాడటానికి అసవరమయ్యే ఇమ్యూన్ సిస్టమ్ కు బలపరస్తుంది. అదనంగా ఇది పేషంట్ లో జీర్ణక్రియ మెరుగుపరిచి త్వరగా కోలుకోవడానికి అవసరం అయ్యే యాంటీబాడీని ప్రోత్సహిస్తుంది.

నిమ్మరసం :
నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. డెంగ్యూ వైరస్ కు కారణం అయ్యే టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది.

కొబ్బరి నీళ్ళు :
డెంగ్యూ వైరస్ డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. అందుకు కొబ్బరి లో ఉత్తమ న్యాచురల్ మార్గం. ఇది శరీరానికి కావల్సిన హైడ్రేషన్, తక్షణ మినిరల్స్ ను అందిస్తాయి. కాబట్టి ఈ హెల్తీ డ్రింక్ మిస్ చేసుకోకూడదు.

దానిమ్మ:
దానిమ్మలో న్యూట్రీషియన్లు మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి. దానిమ్మ శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తాయి. దానిమ్మ తినడం వల్ల అలసట మరియు నీరసం తగ్గిస్తాయి, ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ పెంచుతుంది.

ఆకు కూర:
ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది. ప్లేట్ లెట్ కౌంట్ ను పెండచంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఉడికించిన ఆహారాలు:
డెంగ్యూ ఫీవర్ తో భాదపడే వారు హెవీ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి వారు సెమి లిక్విడ్ సూప్స్ ను తాగాలి. వీటినిలో మినిరల్స్ మరియు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.

అన్నం గంజి :
బ్రౌన్ రైస్ లేదా నార్మల్ రైస్ తో తయారుచేసిన అన్నం గంజిలో కొద్దిగా ఉప్పు, ఇంగువ, నెయ్యి వేసి తాగాలి. ఇది డీహైడ్రేషన్ నివారిస్తుంది. ఎలక్ట్రోలైట్స్ ను నింపుతుంది మరియు ఆకలిని పెంచుతుంది.

సులభంగా జీర్ణం అయ్యే ఆహారాలు:
ఉడికించిన కూరగాయాలు, పెరుగు, పప్పు, సేమియా, మరియు సూప్స్ వంటివి సులభంగా జీర్ణం అవుతాయి కాబట్టి, వీటిని పేషంట్స్ తీసుకోవచ్చు. ఇవి మింగడానికి సులభం మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నవి. జీర్ణక్రియకు కష్టం కలిగించే కారం, ఉప్పు, నూనెలు సాధ్యమైనంత వరకు తగ్గించాలి.

ప్రోటీన్స్ :
ప్రోటీన్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. డెంగ్యూ ఫీవర్ సమయంలో కోల్పోయిన ఆరోగ్యకరమైన కణాలను తిరిగి పొందడానికి సహాయపడుతాయి. గుడ్డులో తెల్లని పదార్ధం, పెరుగు మరియు వెన్న వంటి కనీసం రెండు రోజులకు ఒకసారి తీసుకోవాలి.

బ్రొకోలీ:
బ్రొకోలీలో విటిమన్ కె అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్లేట్ లెట్స్ ను పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇంకా వీటిలో యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ప్లేట్ లెట్ కౌట్ తగ్గితే , తప్పనిసరిగా బ్రొకోలిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.