Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
టెట్రా ప్యాక్ మిల్క్ vs ప్యాకెట్ మిల్క్: ఆరోగ్యానికి ఏది మంచిది?
పాలు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. మరి పాల ప్రయోజనాలు అందుకోవాలంటే ఏ పాలు తాగాలి.. టెట్రా ప్యాక్ పాలు, ప్యాకెట్ పాలు, కార్టన్ మిల్క్, గేదె పాలు ఏవి తాగితే మంచిదో ఇప్పుడు చూద్దాం.
ప్రతి ఇంట్లో ఉదయం పాలతోనే మొదలవుతుంది. పాలతో టీ, కాఫీ పెట్టుకోవడం మొదలు పెట్టి మిగతా పనుల్లో నిమగ్నం అవుతుంటారు. పాలు మన దైనందిన జీవితంలో భాగం అయిపోయాయి. ప్రతి ఒక్కరూ పాలను ఏదో ఒక రూపంలో తీసుకుంటారు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో పాలు కీలకం. పిల్లల నుండి వృద్ధుల వరకు పాలు అమృతంలాంటివి.
పాలు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. మరి పాల ప్రయోజనాలు అందుకోవాలంటే ఏ పాలు తాగాలి.. టెట్రా ప్యాక్ పాలు, ప్యాకెట్ పాలు, కార్టన్ మిల్క్, గేదె పాలు ఏవి తాగితే మంచిదో ఇప్పుడు చూద్దాం.

పచ్చి పాలు:
పచ్చి పాలు అంటే గ్రామాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ఎలాంటి పాశ్చరైజేషన్ పద్ధతిని ఉపయోగించకుండా నేరుగా పాల విక్రయదారుల నుండి పాలను కొనడం. గేదె, ఆవుల నుండి తీసిన పాలను నేరుగా అమ్మడం. వీటిని రైతులు, దళారులు, డెయిరీ నుండి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ పాలు కల్తీ కాకపోతే, నీళ్లు కలపకపోతే ఈ పాలను తాగడం మంచిది. అయితే కొందరికి ఈ పాలు అరిగించుకోవడం కష్టంగా ఉంటుంది.

కార్టన్ మిల్క్:
టెట్రా ప్యాక్ మిల్క్ అని కూడా అంటారు. కార్టన్ మిల్క్ చాలా సురక్షితం అని చాలా మంది విశ్వసిస్తారు. టెట్రా ప్యాక్‌ల ప్యాకేజింగ్ సాధారణంగా UHT (అల్ట్రా- హై టెంపరేచర్) పద్ధతిని ఉపయోగించి ప్యాక్ చేస్తారు. ఇందులో పాలను కొన్ని సెకన్ల పాట అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. తర్వాత చల్లబరుస్తారు. అనంతరం టెట్రా ప్యాక్‌లో ప్యాక్ చేస్తారు. ఈ పద్ధతి పాలలోని అన్ని సూక్ష్మజీవులు, వ్యాధికారకాలను తొలగిస్తుంది.

ఆర్గానిక్ మిల్క్:
ఈమధ్యకాలంలో చాలా మంది ఆర్గానికి గొప్పతాన్ని గుర్తిస్తున్నారు. సేంద్రీయ ఉత్పత్తుల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులు ధర ఎక్కువైనా వాటినే కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఆర్గానిక్ పాలు కూడా అదే కోవలోకి వస్తాయి. ఆరోగ్య స్పృహ పెరగడంతో ఆర్గానిక్ పాలు కొంటున్నారు. ఆర్గానిక్ పాలు అంటే పాలు ఇచ్చే గేదె, ఆవులకు ఆర్గానిక్ ఫుడ్ తినిపిస్తారు. ఆర్గానిక్ ఫుడ్ అంటే రసాయనాలు ఉపయోగించకుండా పెంచిన దాణా. అలాగే పాలు ఇచ్చే గేదెలకు, ఆవులకు హార్మోన్లు ఇంజెక్ట్ చేయరు.

ప్యాకెట్ పాలు:
ప్యాకెట్ మిల్క్ అనేది చాలా మందికి అలవాటు పడిన ఎంపికే. సూక్ష్మజీవులను చంపే నిర్దిష్ట ప్రామాణిక ఉష్ణోగ్రత వద్ద పాలు పాశ్చరైజ్ చేయబడతాయి. అయితే, ఈ ప్రక్రియ వ్యాధికారకాలను తొలగించడాన్ని నిర్ధారించదు. టెట్రా పాలతో పోలిస్తే ప్యాకెట్ పాలు త్వరగా పాడేపోతాయి.

టెట్రా ప్యాక్ పాలు:
టెట్రా ప్యాక్ పాలను ఏదైనా సూక్ష్మజీవులు, వ్యాధికారకాల నుండి రక్షించడానికి బాగా ప్యాక్ చేయబడతాయి. ఈ పాలు త్వరగా చెడిపోకుండా ఉండేలా ప్యాక్ చేస్తారు. ప్యాకేజింగ్ సమయంలో అన్ని రోగకారక క్రిములను తొలగిస్తారు. టెట్రా ప్యాక్ లో మొత్తం ఆరు పొరల ప్యాకేజింగ్ ఉంటుంది.

ఏవి మంచివంటే..
అన్నింటిలోకెల్లా పచ్చి పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే పచ్చి పాలు కల్తీ కావట్లేదని, నీళ్లు కలపడం లేదని నిర్ధారించుకోవాల్సిందే. 24 గంటల వరకు పాలు నిల్వ ఉంచుకోవాలంటే ప్యాకెట్ పాలు ఎంచుకోవచ్చు. కొన్ని రోజుల పాటు పాలు వాడాలనుకుంటే టెట్రా ప్యాక్ పాలను ఎంచుకోవడం మంచిది.
అవసరాన్ని బట్టీ పాలను, పాల రకాలను ఎంచుకోవాలి. అయితే పచ్చి పాలు కొద్దిగా ఖరీదు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగానే ప్యాకెట్ పాల ధర తక్కువగా ఉంటుంది. ఏది ఎంచుకున్నప్పటికీ పాలను తాగే ముందు మరిగించుకోవాలని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications