For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలతో హోలీని ఆనందంగా, ఆరోగ్యకరంగా సెలబ్రేట్ చేసుకోండి...

కరోనా నేపథ్యంలో ఆరోగ్యకరమైన హోలీని ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మరి కొద్ది రోజుల్లో హోలీ పండుగ వచ్చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రంగులను సేకరించడంలో బిజీ అయిపోయారు. అయితే మరోవైపు కరోనా సెకండ్ వేవ్ కూడా మనల్ని వెంటాడుతోంది.

Health Tips For A Safe Holi In Telugu

దీంతో ప్రతి ఒక్కరూ ఈ ఏడాది హోలీ పండుగ లేనట్టేనా? అసలు ఈ మహమ్మారి నుండి తప్పించుకుని.. ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి.. అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు.. ఈ రంగుల పండుగను మీరు ఆనందంగా మరియు ఆరోగ్యకరంగా జరుపుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

హోలీ 2021 : రంగు పడిన మీ చర్మం మరియు కురులు పాడవ్వకూడదంటే ఈ చిట్కాలను పాటించండి...హోలీ 2021 : రంగు పడిన మీ చర్మం మరియు కురులు పాడవ్వకూడదంటే ఈ చిట్కాలను పాటించండి...

సహజ రంగులు..

సహజ రంగులు..

ఈ ఏడాది హోలీ సందర్భంగా మీరు సహజమైన రంగులను వాడాలి. వీటి వల్ల మీకు ఎలాంటి అలర్జీ అనేదే రాదు. మార్కెట్లో దొరికే మెర్క్యూరీ సల్ఫైడ్, అల్యూమినియం బ్రోమైడ్ మరియు కాపర్ సల్ఫేట్ తో పాటు ఇతర కెమికల్స్ ఉండే రంగులను అస్సలు వాడకండి. ఇవి మీకు అలర్జీలను కలిగిస్తాయి.

చర్మ సమస్యలు రావు..

చర్మ సమస్యలు రావు..

మీరు హోలీ సమయంలో మార్కెట్లో దొరికే కలర్స్ ప్లేసులో గోరింట, పసుపు పొడి, గంధపు చెక్క, పూల రేకుల పొడి మొదలైన వాటిని వాడొచ్చు. ఇవి మీ చర్మానికి ఎలాంటి హాని కలిగించవు. అయితే మీరు రంగులు చల్లుకునేటప్పుడు మాత్రం సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి.

అలర్జీ ఉంటే..

అలర్జీ ఉంటే..

మీకు అలర్జీ వంటివి ఉంటే.. మీరు రంగుల పండుగకు దూరంగా ఉండటమే మంచిది. ఓవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు అలర్జీతో ఇబ్బంది పడేకంటే ఈ రంగులకు వీలైనంత దూరంగా ఉండటమనేది మంచిది. ముఖ్యంగా గజ్జి, తామర ఉన్నవారు ఈ రంగుల జోలికి అస్సలు వెళ్లకండి.

హోలీకి ముందు..

హోలీకి ముందు..

మీరు హోలీ పండుగలో రంగులను చల్లుకోవడానికి ముందు మీ చర్మంపై కొబ్బరి నూనె లేదా ఆవ నూనెను రాసుకోండి. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై రంగులు ఎక్కువసేపు ఉండవు. ఒకవేళ రంగులు మీ స్కిన్ పై పడినా కూడా అవి వెంటనే పొడిగా మారతాయి.

Holi 2021: కరోనా గురించి కలవరపడకుండా హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకోండి...Holi 2021: కరోనా గురించి కలవరపడకుండా హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకోండి...

గాయాలపై నిఘా పెట్టండి..

గాయాలపై నిఘా పెట్టండి..

మీరు హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకునే సమయంలో గాయాలపై కాస్త నిఘా ఉంచండి. ఎందుకంటే మీరు ఎక్కువగా నీటితో ఉండే రంగులతో ఉంటారు కాబట్టి.. మీ చర్మంపై గాయాలు సులభంగా అవుతుంటాయి. అలాంటి సమయంలో మీ చర్మంపై కాస్త గాయమైనా వాటిపై క్రిములను నాశనం చేసే మందులను వేసి రంగులాట ఆడేయండి.

జలుబు ఉంటే..

జలుబు ఉంటే..

ఈ ఏడాది ఎలాగైనా మీరు హోలీ సంబరాలను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే.. మీ చుట్టూ ఉండే వారిలో జలుబు, జ్వరం ఉన్న వారు ఎవ్వరూ పాల్గొనకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ తోనే ఈ వేడుకలను జరుపుకోవాలని.. వీలైనంత తక్కువ మంది ఉండే చోట ఈ రంగుల వేడుకలను చేసుకోవాలని, లేదంటే హోలీ ఆడే సమయంలో ఇన్ఫెక్షన్ ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సన్ గ్లాసెస్..

సన్ గ్లాసెస్..

మీరు హోలీ ఆడే సమయంలో సహజ సిద్ధ రంగులను వాడే సమయంలో మీ కళ్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సన్ గ్లాసెస్ వాడాలి. అలాగే మీరు రంగులు చల్లుకునేటప్పుడు కళ్లు, పెదాలు వంటివి మూసుకోవాలి.

హోలీ తర్వాత..

హోలీ తర్వాత..

హోలీ వేడుకలు ముగిసిన తర్వాత మీరు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. కెమికల్స్ కలిసి రంగుల వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మీరు రంగులు చల్లుకునే సమయంలో కోడిగుడ్లు, మట్టి, డ్రైనేజీ నీటిని పిల్లలు వాడకుండా జాగ్రత్త పడాలి.

English summary

Tips for healthy and safe holi

Here are the some important health tips for a safe holi in Telugu. Take a look
Desktop Bottom Promotion