For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Valentine's Day 2023:వాలెంటైన్స్ వీక్ లో ఈ హెల్దీ గిఫ్ట్ ఐడియాలను ట్రై చెయ్యండి...!

వాలెంటైన్ డే సందర్భంగా ఈ హెల్దీ గిఫ్ట్స్ ను ట్రై చెయ్యండి.

|

వాలెంటైన్ వీక్ లో అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయి. రోజ్ డే, ప్రపోజ్ డే పూర్తయ్యాయి. ఇప్పుడు చాక్లెట్ డే కూడా వచ్చేసింది. వాలెంటైన్స్ డే అంటే ప్రేమికులకు ఎంత ప్రత్యేకమో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

Valentines Day 2021: Tips For Healthy Valentines Day Gifts

ఈ సమయంలో బహుమతులకు బోలెడంత ప్రాధాన్యత పెరుగుతుంది. అసలు గిఫ్టులు లేకుండా వాలెంటైన్స్ వీక్ గానీ.. వాలెంటైన్స్ డే అనేది గానీ అస్సలు పూర్తి కాదు. అయితే ఈ సమయంలో వాలెంటైన్స్ డే రోజున మీరు కొన్ని ఆరోగ్యకరమైన బహుమతులు కూడా అందజేయొచ్చని తెలుసా... ఇంతకీ హెల్దీ గిఫ్టులు ఏంటని ఆలోచిస్తున్నారా?

Valentines Day 2021: Tips For Healthy Valentines Day Gifts

అయితే మీరు ఈ జాబితాను చూస్తే మొత్తం తెలిసిపోతుంది.. ఇంకెందుకు ఆలస్యం వాలెంటైన్స్ డే సందర్భంగా ఏవి హెల్దీ గిఫ్టులో.. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఏవో అనే వివరాలను మేము మీకు అందజేస్తున్నాం.

Valentines Day 2021: Tips For Healthy Valentines Day Gifts

వాటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి.. మీ ప్రియమైన వారికి పంపేయండి... వారి ఆరోగ్యానికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో.. మీరు వారి గురించి ఎంతలా కేర్ తీసుకుంటున్నారో అనే విషయాలను తెలియజేయండి...

రెడ్ వైన్..

రెడ్ వైన్..

రెడ్ వైన్ లో ఉన్న పాలీఫెనాల్స్, రెస్వెరాట్రాల్ మరియు క్వెర్సెటిన్ మీ గుండెను కాపాడుతుంది. రెడ్ వైన్ లోని యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. అలాగే అథెరోస్కెర్లోసిసి యొక్క పురోగతి మందగించడానికి సహాయపడుతుంది. రెడ్ వైన్ తాగడం వల్ల మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఇది ప్రధానంగా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. అలాగే వయసు సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు. అంతేందుకు మన హాట్ యాంకర్ అనసూయ కూడా తాను అందం కోసం రెడ్ వైన్ తీసుకుంటుందట. ఈ రెడ్ వైన్ తీసుకోవడం ద్వారా ప్లేట్ లెట్ నిర్మాణం నిరోధకత జరుగుతుంది. అలాగే కొవ్వు కూడా పెద్దగా పెరగదు. మీరు రెడ్ వైన్ ను ఇష్టపడుతుంటే.. మీ ప్రియమైన వారికి వీటిని టేస్ట్ చేయడానికి గిఫ్టుగా పంపొచ్చు.

డిన్నర్ టైమ్ లో చాక్లెట్..

డిన్నర్ టైమ్ లో చాక్లెట్..

మీరిద్దరూ కలిసి డిన్నర్ కోసం ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. లేదా ఇంట్లో కలిసి ఏకాంతంగా ఉన్నప్పుడు మీ ప్రియమైన వారిని ఆకట్టుకునేందుకు చాక్లెట్ ను కూడా గిఫ్టుగా ఇవ్వొచ్చు. ఈ చాక్లెట్ లోని తియ్యదనం మాదిరిగానే.. మీ సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇది సెరోటోనిన్ మరియు ఎండార్ఫిన్ల స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల మీ ఇద్దరిలో మంచి అనుభూతి పెరుగుతుంది. ఇది లిబిడో స్థాయిని కూడా పెంచుతుంది. డార్క్ చాక్లెట్ ను కచ్చితంగా సుమారు 30 నుండి 60 గ్రాముల వరకు తీసుకోవచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు. మిల్క్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ చాలా ఉత్తమమని తేల్చి చెప్పారు. అయితే దీన్ని మీరు మితంగా తీసుకోవాలి.

మసాజ్ గిఫ్ట్..

మసాజ్ గిఫ్ట్..

మసాజ్ వల్ల మన బాడీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. దీర్ఘకాలిక తక్కువ వెన్ను, ఒత్తిడి, ఆందోళన, హైబిపి మరియు నిద్రలేమి మరియు కండరాల నొప్పి వంటి వాటి నుండి ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు మీ ఇంట్లో మసాజ్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉండొచ్చు. మసాజ్ గిఫ్ట్ అనేది వాలెంటైన్స్ డే నాడు కచ్చితంగా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎందుకంటే మసాజ్ చేయడం వల్ల అద్భుతమైన అనుభూతిని పొందొచ్చని పలు అధ్యయనాలు కూడా సూచించాయి.

ఇంటి భోజనం..

ఇంటి భోజనం..

చాలా మంది వాలెంటైన్స్ డే టైములో ఏదైనా రెస్టారెంట్ కో.. లేదా హోటల్ కో వెళ్లి డిన్నర్ లేదా లంచ్ వంటివి చేస్తుంటారు. ఇది చాలా సరదాగా అనిపించినప్పటికీ.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇది అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు మీ ఇంట్లోనే ప్రత్యేక వంటకాలను తయారు చేసుకోండి. మీ ప్రియమైన వారికి ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించండి. కూరగాయలు, లీన్ ప్రోటీన్ (చికెన్ లేదా చేప) వంటి వాటితో మెనూ ప్రిపేర్ చేయండి. ఇది మీ బంధం యొక్క మానసిక స్థితిని మరింత బలపరుస్తుంది.

మంచి నిద్ర కోసం..

మంచి నిద్ర కోసం..

మనలో ప్రతి ఒక్కరికి ఆకలి, సెక్స్ ఎంత ముఖ్యమో.. నిద్ర అనేది కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీ ప్రియమైన వారు హాయిగా నిద్ర పోయేందుకు ప్రోత్సహించండి. అయితే ఇదంతా రాత్రి వేళలో అయితే బాగుంటుంది. దీని కోసం ఒక కొత్త మ్యాట్రెస్ ను గిఫ్టుగా ఇవ్వండి. దీని వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మంచి mattress వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు మెరుగైన మానసిక స్థితి, వెన్నునొప్పి మరియు ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

ఫిట్ నెస్ బ్యాండ్..

ఫిట్ నెస్ బ్యాండ్..

ఈ వాలెంటైన్స్ సందర్భంగా మీ భాగస్వామికి మంచి ఫిట్ నెస్ బ్యాండ్ బహుమతిగా ఇవ్వండి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఫిట్ గా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఈ ఫిట్ నెస్ బ్యాండ్ల ద్వారా వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చయొచ్చు. ఒకవేళ వారు ఫిట్ నెస్ ప్రియులైతే ఇది వారికి మరింతగా నచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫిట్ నెస్ బ్యాండ్లు కూడా ప్రస్తుతం తక్కువ ధరలలోనే లభిస్తున్నాయి. పైగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

English summary

Valentine's Day 2023: Tips For Healthy Valentine's Day Gifts

Ideas for healthy gifts for Valentines Day are dark chocolate, red wine, home-cooked dinner, a new mattress, couples massage, cooking class etc. This Valentines Day say I Love You in the form of healthy gifts. Well, what better gift than the gift of good health.
Desktop Bottom Promotion