For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

KCR Undergoes Coronary Angiogram Tests :యాంజియోగ్రామ్ అంటే ఏమిటి? ఈ పరీక్షలను ఎప్పుడు, ఎందుకు చేస్తారు?

|

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం రోజున అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాదులోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.

సీఎం కేసీఆర్ ను పరీక్షించిన వైద్యులు తనకు యాంజియోగ్రామ్ టెస్టు చేశామని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, తన హార్ట్ లో ఎలాంటి బ్లాక్స్ లేవని స్పష్టం చేశారు. అదే విధంగా సిటీ స్కాన్ తో పటు రక్త పరీక్షలు నిర్వహించారు.

అయితే కేసీఆర్ కు కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వివరించారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. యాంజియోగ్రామ్ టెస్ట్ అంటే ఏమిటి? ఈ టెస్టులను ఎందుకు చేస్తారు? దీనికెంత ఖర్చవుతుంది? ఈ చికిత్సా విధానం వల్ల ఏమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఈ వ్యాధి నుండి ఎంత సమయంలోపు కోలుకోవచ్చనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Shane Warne's Extreme Liquid Diet:షేన్ వార్న్ తీసుకున్న లిక్విడ్ డైట్ శరీరానికి ఎంత హానికరమో తెలుసా...

యాంజియోగ్రామ్ అంటే ఏమిటి?

యాంజియోగ్రామ్ అంటే ఏమిటి?

యాంజియోగ్రామ్ టెస్టునే కరోనరీ యాంజియోగ్రామ్ అని కూడా అంటారు. కరోనరీ ఆర్డరీస్ ను గుండె రక్త నాళాలు అని కూడా పిలుస్తారు. వీటిని ఎక్స్ రే ఇమేజింగ్ అనే టెక్నికల్ రూపంలో పరీక్షించడమే యాంజియోగా్రమ్ (Angiogram) లేదా యాంజియోగ్రఫీ అని అంటారు. రక్త నాళాల నుండి గుండెకు రక్తం సరఫరా అయ్యే సమయంలో ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే.. ఈ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు. గుండె, రక్తనాళాల పరిస్థితిని కార్డియాక్ క్యాథటరైజేష్ ప్రక్రియ ద్వారా తెలుస్తుంది.

ఖర్చుతో కూడున్నదే..

ఖర్చుతో కూడున్నదే..

సీఎం కేసీఆర్ కు ఛాతి వైపు ఎడమ చేయి, కాళ్లలో నొప్పి రావడంతో, ఈ టెస్టులను చేసినట్లు వైద్యులు వివరించారు. అయితే ఈ టెస్టు చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాగే ఇది సులభమైనదేమీ కాదు. అలాగే ఈ టెస్టు సమయంలో నొప్పి కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలా చేస్తారు?

ఎలా చేస్తారు?

ఆసుపత్రిలోని క్యాథటరైజేషన్ లేదా క్యాథ్ ల్యాబ్ లో యాంజియోగ్రామ్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ టెస్టు చేయడానికి ముందుగా, ఇంతకుముందు మీకు గుండె సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా? డయాబెటిస్ ఇతర వ్యాధులేమైనా ఉన్నాయా లేదా అని వైద్యులు టెస్టులు చేసి తెలుసుకుంటారు. యాంజియోగ్రామ్ ప్రక్రియలో భాగంగా గుండెకు వెల్లే రక్త నాళంలోకి ఒక రకమైన వర్ణ పదార్థాన్ని పంపిస్తారు. ఇది ఎక్స్ రే మిషన్లో స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎక్కడ వేగం తగ్గితే.. అక్కడ సమస్య ఉన్నట్లు గుర్తిస్తారు. దీన్ని నయం చేసేందుకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేస్తారు. ఛాతీ నొప్పి, కరోనరీ ఆర్డరీ వ్యాధి ఉన్న వారికి మాత్రమే ఈ టెస్టులను చేస్తారు.

ఇలాంటివి తిని, తాగితే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది..జాగ్రత్త!!

ఎలా పరీక్షిస్తారంటే..

ఎలా పరీక్షిస్తారంటే..

యాంజియోగ్రామ్ ప్రక్రియలో భాగంగా.. ఈ వ్యాధి వచ్చిన వారిని ఎక్స్ రే టేబుల్ మీద పడుకోబెడతారు. చేతి సిరలోకి ఒక ఇంజక్షన్ ను వేస్తారు. నొప్పి రాకుండా ఉండేందుకు ఒక మత్తు మందు (అనస్థిషీయా) ఇస్తారు. ఆ తర్వాత వేలికి, చాతికి మానిటరింగ్ పరికరాలను అమర్చుతారు. ముక్కులోకి ఓ చిన్న పైపు ద్వారా ఆక్సీజన్ సరఫరా చేస్తారు. అనస్థీషియాతో ధమనిపై ఉండే చర్మం, కణజాలం మొద్దుబారేలా చేస్తారు. ఆ తర్వాత ఒక చిన్న సూది సాయంతో తీగను తోస్తారు. ఆ తర్వాత క్యాథేటర్ అనే ప్లాస్టిక్ గొట్టాన్ని తీగపైన, ధమనిలో అమర్చుతారు. క్యాథేటర్ అమర్చిన తర్వాత, ఆ తీగను తొలగిస్తారు. అనంతరం ప్రత్యేక వర్ణ పదార్థాన్ని క్యాథేటర్ ద్వారా ధమనిలోకి పంపుతారు. అది రక్త నాళాల గుండా ప్రవహిస్తుంది.

ఎంత సమయమంటే..

ఎంత సమయమంటే..

ఈ రక్త ప్రవాహాన్ని ఎక్స్ రే ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తారు. రక్తనాళంలో అవరోధాలు లేదా ఏదైనా సమస్యలు కనిపిస్తే, డాక్టర్లు అందుకు తగిన చికిత్సను చేస్తారు. ఇది సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. అయితే ఇది రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కాలు భాగంలో పెద్ద ధమిని ద్వారా ఈ టెస్టు చేస్తారు. ఈ పరీక్ష పూర్తయ్యేందుకు సుమారు గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది.

సమస్యలను తెలుసుకోవచ్చు..

సమస్యలను తెలుసుకోవచ్చు..

అన్ని టెస్టులు పూర్తయిన తర్వాత క్యాథేటర్ ను తొలగించి, రక్తస్రావం కాకుండా అక్కడి రంధ్రాన్ని మూస్తారు. అనంతరం రోగి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఆరోగ్య నివేదికలను రికార్డుల్లో పొందుపరుస్తారు. ఈ టెస్టు ద్వారా రక్త నాళాల్లో కొవ్వు పేరుకున్నా, ఏ చిన్న సమస్య ఉన్నా తెలుసుకోవచ్చు.

ఎప్పుడు నిర్వహిస్తారంటే..

ఎప్పుడు నిర్వహిస్తారంటే..

ఈ యాంజియోగ్రామ్ టెస్టును ఎక్కువ సమయం తెల్లవారుజామునే నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ టెస్టుకు ముందు ఏదీ తినకూడదు. ఎవరైనా ఆహారం తీసుకుంటే 8 గంటల గ్యాప్ లో టెస్టు చేస్తారు.

యాంజియోగ్రామ్ అంటే ఏమిటి?

యాంజియోగ్రామ్ టెస్టునే కరోనరీ యాంజియోగ్రామ్ అని కూడా అంటారు. కరోనరీ ఆర్డరీస్ ను గుండె రక్త నాళాలు అని కూడా పిలుస్తారు. వీటిని ఎక్స్ రే ఇమేజింగ్ అనే టెక్నికల్ రూపంలో పరీక్షించడమే యాంజియోగా్రమ్ (Angiogram) లేదా యాంజియోగ్రఫీ అని అంటారు. రక్త నాళాల నుండి గుండెకు రక్తం సరఫరా అయ్యే సమయంలో ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే.. ఈ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు. గుండె, రక్తనాళాల పరిస్థితిని కార్డియాక్ క్యాథటరైజేష్ ప్రక్రియ ద్వారా తెలుస్తుంది.

English summary

What Is Angiogram?: Uses, procedure, cost, side effects, and safety in telugu

Here we are talking about the what is angiogram?: Uses, procedure, cost, side effects and safety in Telugu. Read on
Story first published: Friday, March 11, 2022, 18:02 [IST]
Desktop Bottom Promotion