For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Centaurus: కలవరపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్.. వేగంగా వ్యాపిస్తున్న సెంటారస్

|

Centaurus: యునైటెడ్ కింగ్‌ డమ్‌(UK)లో కొవిడ్ కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఈ కొత్త రకం వైరస్ పై వైరాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకం వైరస్ మిగతా వాటి కంటే వేగంగా వ్యాపిస్తోందని గుర్తించారు. ఈ విషయమే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ ను మే నెలలో గుర్తించారు. సెంటారస్ అనే పేరుతో BA.2.75 వేరియంట్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

what is centaurus new fast spreading covid variant everything you need to know in Telugu

సెంటారస్ కోవిడ్ వేరియంట్:

* ఈ కరోనా కొత్త రకం వైరస్ అనేది ప్రత్యేకమైన వేరియంట్ కాదు. ఇది ఓమిక్రాన్ రకానికి సబ్‌వేరియంట్ అని వైరాలజిస్టులు చెబుతున్నారు.
* మే నెలలో BA.2.75 ఉప-వేరియంట్ భారత దేశంలో గుర్తించారు. అప్పుడే దానికి సెంటారస్ అనే పేరు పెట్టారు.
* BA.2.2 నుండి వచ్చిన BA.2.75 అదనపు మ్యూటేషన్స్ కలిగి ఉందని నిపుణులు గుర్తించారు. దాని వల్ల ఈ రకం వైరస్.. తన వంశంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
* ఒక వైరస్ మ్యూటేషన్ ల సంఖ్య ఆందోళనకర విషయమని వైరాలజిస్టులు చెబుతున్నారు. మ్యూటేషన్ అయ్యే కొద్దీ.. దానిపై స్పష్టమైన అవగాహన ఉండదని అంటున్నారు.
* BA 2.75 వేరియంట్.. BA.5 వేరియంట్ కంటే కూడా ఎక్కువగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ గతంలో భారత దేశంలో ఎక్కువగా వ్యాపించింది. అందువల్ల వేరే దేశాల్లోనూ ఈ వైరస్ రకం ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలా కచ్చితంగా జరుగుతుందని చెప్పడానికి మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే దీనిపై కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.
* దీని వల్ల కరోనాను ఎదుర్కొనేందుకు వేస్తున్న వ్యాక్సిన్లు... దీనిపై ఎలాంటి ప్రభావం చూపబోవన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అలాగే రోగనిరోధక వ్యవస్థనూ గెలుస్తుందని ఆందోళన చెందుతున్నారు వైరాలజిస్టులు.
* BA.2.75 వేరియంట్ భారత్ సహా అనేక దేశాలలో గతంలో ఎక్కువగా వ్యాపించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌ లో కూడా ఈ వేరియంట్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
* యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడాతో సహా 10 ఇతర దేశాలలో కూడా ఈ కొవిడ్ కొత్త వేరియంట్ ను గుర్తించారు.

WHO ఏం చెబుతోంది?

WHO ఏం చెబుతోంది?

సెంటారస్ వేరియంట్ BA.2.75 వేరియంట్ పై పరిశోధన చేసేందుకు చాలా తక్కువ సంఖ్యలో సీక్వెన్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మొత్తంగా 14 వేర్వేరు దేశాల నుండి సుమారు 200 సీక్వెన్సులు అందుబాటులో ఉన్నాయని WHO తెలిపింది. ఈ వైరస్ వేరియంట్ తక్కువ సీక్వెన్సులు ఉన్నందు వల్లే దాని గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. సెంటారస్ వేరియంట్ లో స్పైక్ ప్రొటీన్ల రిసెప్టర్ బైండింగ్ ల మ్యూటేషన్లు ఉన్నాయని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు.

సెంటారస్ ఎందుకు ప్రత్యేకం?

సెంటారస్ ఎందుకు ప్రత్యేకం?

BA.2.75 వేరియంట్ కూడా BA.5 లాంటిదే. అంటే ఇవి ఓమిక్రాన్ కు సబ్ వేరియంట్. ఈ వేరియంట్ ఈ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందింది. భారత్ లో BA.5 వేరియంట్ కంటే BA.2.75 వేరియంట్ కేసులు ఎక్కువ మొత్తంలో వచ్చాయి. అంటే ఇతర దేశాల్లోనూ ఇలా జరిగే ప్రమాదం ఉంటుందని వైరాలజిస్టులు చెబుతున్నారు. ఇలా జరిగేందుకు స్పైక్ ప్రొటీన్ లో జరుగుతున్న మార్పులే కారణమని అనుకుంటున్నారు.

ఈ వేరియంట్‌కు 'సెంటారస్' అనే పేరు ఎలా వచ్చింది?

ఈ వేరియంట్‌కు 'సెంటారస్' అనే పేరు ఎలా వచ్చింది?

కరోనా కొత్త వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీకు అక్షరమాలలోని పేర్లను పెడుతూ వస్తోంది. అయితే BA.2.75 వేరియంట్ కు అలాంటి పేరును ఆరోగ్య సంస్థ ఇంకా పెట్టలేదు. ఈ వేరియంట్ ఓమిక్రాన్ సబ్-వేరియంట్ అని మాత్రం ప్రకటించింది.

సెంటారస్ ప్రమాదకరమా?

సెంటారస్ ప్రమాదకరమా?

ఈ కొత్త సబ్‌ వేరియంట్‌ రోగ నిరోధక శక్తిపై దాడి చేస్తుంది అని కచ్చితంగా చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఒక కొత్త వేరియంట్ వచ్చినప్పుడు.. దాని మునుపటి వేరియంట్లకు భిన్నంగా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దానిని నిశితంగా పరిశీలిస్తుంది. ఈ సెంటారస్ వేరియంట్ విషయంలోనూ WHO, అదే పని చేస్తుంది. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) జూలై 7న BA.2.75ని "పర్యవేక్షణలో ఉన్న వేరియంట్"గా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య వరుసగా ఐదో వారం కూడా పెరిగింది. అయితే మరణాల సంఖ్య స్థిరంగా ఉందని WHO గురువారం నివేదించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారం 5.7 మిలియన్ల కొత్త ఇన్ఫెక్షన్లు వచ్చినట్లు గుర్తించారు. ఇది 6 శాతం పెరిగినట్లు సూచిస్తుంది. ఇప్పటివరకు కొత్త వేరియంట్ వల్ల 9,800 మరణాలు నమోదు అయ్యాయి.

జాగ్రత్త పడదాం:

జాగ్రత్త పడదాం:

కరోనా వైరస్ లో కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత మరొకటి బయటపడుతూనే వస్తోంది. అయితే దీనిపై ఆందోళన పడకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. కరోనా నుండి జాగ్రత్త పడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. అయితే కొవిడ్ టీకా తీసుకున్నంత మాత్రాన కరోనా వైరస్ సోకకుండా ఉంటుందా అనే ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెబుతున్నారు. కానీ కరోనా సోకితే.. దాని ఎదిరించే విధంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను తయారు చేస్తుందని వెల్లడిస్తున్నారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని చెబుతున్నారు వైద్యులు.

English summary

what is centaurus new fast spreading covid variant everything you need to know in Telugu

read on to know what is centaurus new fast spreading covid variant everything you need to know in Telugu
Story first published:Tuesday, July 19, 2022, 12:29 [IST]
Desktop Bottom Promotion