Just In
- 5 hrs ago
Today Rasi Phalalu :ఈ రాశుల వారు ఆలోచించకుండా ఖర్చు చేయొద్దు...
- 19 hrs ago
మీ అందం పెంచుకోవడానికి పౌడర్ బ్లష్, క్రీమ్ బ్లష్ లో ఏది సూటవుతుందో చూసెయ్యండి...
- 19 hrs ago
Diabetes Mistakes: షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ తప్పులు చేస్తే షుగర్ కంట్రోల్ తప్పిందని హెచ్చరిక జాగ్రత్త!!
- 21 hrs ago
Secondhand Stress: పరోక్ష ఒత్తిడి అంటే ఏమిటి మరియు దానిని ఎలా కనుగొనాలి
Don't Miss
- Finance
Employees Fired: కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపులు.. నష్టాలు తగ్గించుకునేందుకేనా..
- News
బీజేపీ డిజిటల్ బోర్డు: జీహెచ్ఎంసీ షాక్.. రూ.55వేల జరిమానా విధింపు.. ట్విస్ట్ ఏంటంటే!!
- Automobiles
ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్
- Movies
Meena Husband Vidyasagar: మీనా భర్త మృతికి ఆ పక్షులే కారణం.. హైదరాబాద్‌లోనూ డేంజర్ బెల్స్
- Technology
ఇండియా లో అన్నింటికీ UPI నే ...! మూడు నెలల్లో UPI ద్వారా ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే ...!
- Sports
Wimbledon 2022 : పునరాగమనంలో సెరెనా విలియమ్స్‌కు ఘోర పరాభవం, తొలి రౌండ్లోనే నిష్క్రమణ
- Travel
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచుర్యం పొందిన పది జలపాతాలు..
What is florona:కొత్తగా‘ఫ్లోరోనా’కలకలం.. ఇది ఒమిక్రాన్ కన్నా ప్రమాదమా? దీని లక్షణాలేంటి?
కరోనాకు టీకా వచ్చిందని సంతోషించేలోపే ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వచ్చి ప్రతి ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కొత్త రకం వైరస్ కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తూ.. ప్రపంచాన్ని వణికిస్తోంది.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు దీని వల్ల ముప్పు తక్కువేనని శుభవార్త చెప్పడంతో అందరూ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలోపే ఇజ్రాయెల్ లో మరో కొత్త రకం వైరస్ అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తుంది.
ఆ దేశంలో తాజాగా తొలి 'ఫ్లోరోనా' కేసు నమోదైనట్లు ఆ దేశ ప్రభుత్వం గురువారం మీడియాకు తెలిపింది. ఓ ప్రెగ్నెంట్ లేడీలో ఈ తొలి కేసు వెలుగు చూసినట్లు వెల్లడించింది. అయితే తను ఇంతవరకు ఒక్కడోసు వ్యాక్సిన్ కూడా వేసుకోలేదని వివరించింది. ఈ సందర్భంగా 'ఫ్లోరోనా' వైరస్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఏమిటి? ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఫ్లోరోనా అంటే ఏమిటి?
ఫ్లోరోనా అనేది కోవిద్, ఇన్ ఫ్లూయెంజా వైరస్ లు ఒకేసారి మన బాడీలో ప్రవేశించినప్పుడు ఏర్పడే డబుల్ ఇన్ఫెక్షన్. ఇలా రెండు ఒకేసారి మన శరీరంలోకి ప్రవేశిస్తే.. దాన్ని ఫ్లోరోనా వైరస్ అంటారు.

ఫ్లోరోనా లక్షణాలు..
పలు అధ్యయనాల ప్రకారం, ఫ్లోరోనా లక్షణాలు చాలా ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోవిద్-19 లక్షణాలతో పాటు గుండె కండరాలలో నొప్పి లేదా మంట వంటి లక్షణాలు వస్తాయట. వీటితో పాటు శ్వాస పీల్చుకోవడంలో లేదా వదలడంలో సమస్యలు రావడం, న్యూమోనియా, మయోకార్డిటిస్ కు కూడా దారి తీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉన్నవారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రోగి వెంటనే చనిపోయే ప్రమాదం కూడా ఉంది.

కొత్తది కాదట..
ఈ ‘ఫ్లోరోనా' వైరస్ కొత్త రకం మహమ్మారి కాదని, ఒకేసారి ఫ్లూ, కోవిద్ లకు చెందిన రెండు రకాల వైరస్ లు బాడీలోకి ప్రవేశించడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ విచ్ఛిన్నమై ఫ్లోరోనా సోకి ఉండొచ్చని ఇజ్రాయెల్ వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కొన్ని వారాలుగా ఆ దేశంలో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో అది ఉద్భవించి ఉండొచ్చని వివరించారు. దీంతో ఆ దేశ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యింది. ఫ్లోరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా, చర్యలకు సిద్ధమైంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
ఈ వ్యాధి వ్యాపించకుండా ఉండాలంటే.. ప్రతి ఒక్కరూ కరోనా టీకాలను కచ్చితంగా తీసుకోవాలని, ఇన్ ఫ్లూయెంజా టీకాలు వేయించుకోవాలని ఇజ్రాయెల్ హెల్త్ డిపార్ట్ మెంట్ సూచిస్తోంది. లేదంటే మీ ఇమ్యూనిటీ పవర్ బలహీనంగా మారిపోయి ఫ్లోరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రోగ నిరోధక వ్యవస్థను పెంచుకునేందుకునే బూస్టర్ డోసులు వేసుకోవడంతో పాటు ఇతర జాగ్రత్తలు కూడా విధిగా పాటించాలని సూచిస్తున్నారు.
పలు అధ్యయనాల ప్రకారం, ఫ్లోరోనా లక్షణాలు చాలా ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోవిద్-19 లక్షణాలతో పాటు గుండె కండరాలలో నొప్పి లేదా మంట వంటి లక్షణాలు వస్తాయట. వీటితో పాటు శ్వాస పీల్చుకోవడంలో లేదా వదలడంలో సమస్యలు రావడం, న్యూమోనియా, మయోకార్డిటిస్ కు కూడా దారి తీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉన్నవారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రోగి వెంటనే చనిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఫ్లోరోనా అనేది కోవిద్, ఇన్ ఫ్లూయెంజా వైరస్ లు ఒకేసారి మన బాడీలో ప్రవేశించినప్పుడు ఏర్పడే డబుల్ ఇన్ఫెక్షన్. ఇలా రెండు ఒకేసారి మన శరీరంలోకి ప్రవేశిస్తే.. దాన్ని ఫ్లోరోనా వైరస్ అంటారు.