Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Lupus: రక్షించేవే భక్షించడం మొదలు పెడితే.. లూపస్ అంటే ఏంటి?
మనల్ని కాపాడాల్సిన ఒంట్లోని రోగనిరోధక వ్యవస్థ.. మనపైనే దాడి చేయడానికి లూపస్ ను ఉదాహరణ చెప్పవచ్చు.
Lupus: మనల్ని కాపాడాల్సిన ఒంట్లోని రోగనిరోధక వ్యవస్థ.. మనపైనే దాడి చేయడానికి లూపస్ ను ఉదాహరణ చెప్పవచ్చు. లూపస్ వచ్చిందంటే ఇది ఎక్కడో ఒక చోటుకు మాత్రమే పరిమితం కాదు. చర్మం దగ్గరి నుండి గుండె, కిడ్నీలు, కళ్లు, ఊపిరితిత్తులు వంటి అన్ని అవయవాల వరకు రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. లూపస్ చాలా ప్రమాదకరమైనది. అయినప్పటికీ దీని నుండి బయటపడే వీలు ఉంది. మనల్ని కాపాడాల్సిన రోగనిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడాన్ని ముందే గుర్తించడం అత్యంత కీలక.

లూపస్ అంటే ఏంటి
ఇంట్లోకి దొంగలు రాకుండా అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు అలెర్ట్ చేయడానికి కుక్కల్ని పెంచుకుంటాం. కానీ అది మనల్నే దొంగ అనుకుని, లేదా అపరిచిత వ్యక్తి అనుకుని దాడి చేయడమే లూపస్ కు చక్కని విశ్లేషణ.
శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. దీనినే ఇమ్యూన్ సిస్టం అని అంటారు. ఇది ఒంట్లోకి ప్రవేశించిన హాని కారక బ్యాక్టీరియాను, వైరస్ ను గుర్తించి యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. హానికారక క్రిములపై దాడి చేయాలని ప్రేరేపించి మనల్ని వాటి నుండి కాపాడుతుంది. ఏ జబ్బు తలెత్తిన అందుకు కారణమైన బ్యాక్టీరియాను, వైరస్ లను రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. కొందరిలో ఈ రోగనిరోధక వ్యవస్థ గాడి తప్పుతుంది. అంటే హానికారక బ్యాక్టీరియాకు, మన శరీర కణజాలానికి మధ్య అది తేడాను గుర్తించలేక పోతుంది. దాని వల్ల విపరీతంగా స్పందిస్తుంది. యాంటీబాడీలను విపరీతంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీబాడీలు మన శరీర కణజాలంపైనే దాడి చేయడం మొదలు పెడతాయి. దీనినే ఆటోఇమ్యూనిన్ అంటారు. ఈ జబ్బులు శరీరంలో ఏదో ఒక చోటుకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ లూపస్ లో శరీరమంతా వ్యాపిస్తుంది. లూపస్ బాధితుల్లో కొందరికి ముఖానికి ఇరువైపులా సీతాకోకచిలుక మాదిరి దద్దుర్లు వస్తాయి.
సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటసస్(ఎస్ఎల్ఈ- SLE) అనే వాడుక భాషలో లూపస్ అంటారు. ఇందులోనూ పలు రకాలు ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
