Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
Noise Dieting: సౌండ్ ఎక్కువైతే.. ఎన్ని దుష్ప్రభావాలో తెలుసా?
పెద్ద శబ్దాలు మన చెవుల్లోని కణాలను చేరకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. దీని కోసం నాయిస్ డైటింగ్ పాటించాలని చెబుతున్నారు. అందుకోసం నాయిస్ డైటింగ్ పాటించాలని అంటున్నారు.
Noise Dieting: ఉదయం మనల్ని నిద్ర లేపే అలారం దగ్గరి నుండి.. తిరిగి పడుకునే ముందు వినే సంగీతం వరకు ఎన్నో శబ్దాలు వింటాం. ఒక్కోటి ఒక్కో తీవ్రతతో శబ్దాలు చేస్తాయి. వాటిని మనం చెవుల ద్వారా వింటాం. రోడ్డుపై వెళ్లినప్పుడు భారీ శబ్దంతో హారన్ మోగడం, డీజేల హోరు, కారులో పెద్ద స్థాయిలో మ్యూజిక్ అలాంటి పెద్ద పెద్ద శబ్దాల వల్ల చెవుల్లో ఉండే సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. దీని వల్ల వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

పెద్ద శబ్దాలు మన చెవుల్లోని కణాలను చేరకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. దీని కోసం నాయిస్ డైటింగ్ పాటించాలని చెబుతున్నారు. బరువు తగ్గడానికి, పెరగడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డైటింగ్ పాటిస్తారు చాలా మంది. డైటింగ్ లో శరీరానికి హాని కారకమైన పదార్థాలను తినకుండా.. మంచి పోషకాలు ఉన్న పదార్థాలనే తింటారు. అలాంటిదే ఈ నాయిస్ డైటింగ్(Noise Dieting) అంటే కూడా.

నాయిస్ డైట్‌లో వీటిని పాటించాలి:
రోడ్డుపై హారన్ వాడొద్దు
రోడ్డుపై వెళ్తున్నప్పుడు హారన్ ను వీలైనంత తక్కువగా వాడండి. పూర్తిగా వాడకపోవడం చాలా మంచిది. సిగ్నళ్ల వద్ద అతిగా హారన్ కొట్టకూడదు. అదే పనిగా హారన్ ను వాడకుండా ఒక్కసారి మాత్రమే కొట్టండి. అతిగా హారన్ కొట్టడాన్ని కంట్రోల్ చేసుకోండి. దీని వల్ల రోడ్డుపై శబ్ధకాలుష్యాన్ని తగ్గించడంలో మీరు మంచి పాత్రను పోషించవారు అవుతారు.

పటాకులను నిషేధించండి
పటాకులను నిషేధించడం వల్ల శబ్ద కాలుష్యం మాత్రమే కాకుండా గాలి, కాంతి కాలుష్యం కూడా అరికట్టవచ్చు.

ఇయర్ ప్లగ్స్ వాడాలి
అధిక తీవ్రత గల శబ్దాల నుండి ఇయర్ ప్లగ్స్ చెవులను రక్షిస్తాయి. ఒక వేళ శబ్దం వెలువడే చోట మీరు ఉంటే ఇయర్ ప్లగ్స్ వాడటం వల్ల అధిక శబ్దాల నుండి మీ చెవులను రక్షించుకోవచ్చు.

వాల్యూమ్ పెంచొద్దు
ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు చాలా మంది గ్యాడ్జెట్స్ వాడతారు. చాలా మంది మ్యూజిక్ వింటూనే పని చేసుకుంటారు. అలాగే కారులో వెళ్లే సమయంలో, బైక్ పై వెళ్తున్నా... భారీ శబ్దంతో మ్యూజిక్ వింటారు. ఇలా ఎక్కువ సౌండ్ తో మ్యూజిక్ వినడం తగ్గించాలి.

60:60 రూల్
ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, స్పీకర్లు వాడే సమయంలో కొంత జాగ్రత్త తప్పనిసరి. మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు 60 శాతం వాల్యూమ్ మాత్రమే పెట్టుకోండి. అలాగే 60 నిమిషాల తర్వాత కొద్ది సేపు విరామం ఇవ్వండి. పార్టీల్లో డీజేల వద్ద ఉండాల్సి వచ్చినప్పుడు ఇయర్ ప్లగ్స్ వాడండి.

ఏస్థాయి శబ్దాలు హాని చేస్తాయి?
శబ్దాలను డెసిబెల్స్ లో కొలుస్తారు. మామూలు వ్యక్తులు మాట్లాడితే అది 60 dB వరకు ఉంటుంది. మోటార్ సైకిల్ ఇంజిన్ రన్నింగ్ దాదాపు 95 dB వరకు ఉంటుంది. ఎక్కువ సేపు 70 dB సౌండ్ వింటే వినికిడి శక్తి దెబ్బతింటుంది. 120 dB కంటే ఎక్కువ పెద్ద శబ్దం చెవులకు తక్షణమే హాని చేస్తాయి.

మీరు వినేదాని కంటే శబ్దాలు బిగ్గరగా ఉండవచ్చు:
మీకు ఏదైనా శబ్దం ఎంత బిగ్గరగా వినిపిస్తుందో, ఆ శబ్దం యొక్క అసలు తీవ్రత అదే కాదు. ధ్వని తీవ్రత అనేది పరిమిత స్థలంలో ధ్వని శక్తి మొత్తం. ఇది డెసిబెల్స్ (dB)లో కొలుస్తారు. డెసిబెల్ స్కేల్ లాగరిథమిక్, అంటే ధ్వని తీవ్రతకు నేరుగా అనులోమానుపాతంలో ఉండదు. బదులుగా, ధ్వని యొక్క తీవ్రత చాలా వేగంగా పెరుగుతుంది. దీనర్థం 20 dB వద్ద ధ్వని 10 dB వద్ద ధ్వని కంటే 10 రెట్లు ఎక్కువ. అలాగే, 10 dB వద్ద ధ్వని యొక్క తీవ్రత 10 dB వద్ద ఉన్న ధ్వనితో పోలిస్తే ఒక బిలియన్ రెట్లు ఎక్కువ శక్తివంతమైనది.
సమాన తీవ్రత కలిగిన రెండు శబ్దాలు తప్పనిసరిగా సమానంగా బిగ్గరగా ఉండవు. లౌడ్‌నెస్ అనేది మీరు వినగల శబ్దాలను ఎలా గ్రహిస్తారో సూచిస్తుంది. మీరు అధిక ట్రాఫిక్‌తో వీధి మూలలో ఉన్నప్పుడు, ధ్వని తీవ్రత ఒకే విధంగా ఉన్నప్పటికీ, నిశ్శబ్ద గదిలో బిగ్గరగా అనిపించే శబ్దం గుర్తించబడకపోవచ్చు. సాధారణంగా, లౌడ్‌నెస్‌ని కొలవడానికి, ఒక ధ్వనిని రెండు రెట్లు పెద్దదిగా గుర్తించడానికి 10 dB పెంచాలి. ఉదాహరణకు, పది వయోలిన్లు ఒక వయోలిన్ కంటే రెండింతలు మాత్రమే ధ్వనిస్తాయి.
శబ్దం నుండి మీ వినికిడిని దెబ్బతీసే ప్రమాదం ధ్వని తీవ్రతతో పెరుగుతుంది.



Click it and Unblock the Notifications