Latest Updates
-
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.! -
2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి.. -
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.!
Zombie Drug: అమెరికాలో జాంబీ డ్రగ్ కలకలం.. వింతగా ప్రవర్తిస్తున్న జనాలు
అమెరికాలో జాంబీ పేరుతో పిలిచే ఓ డ్రగ్ కలకలం సృష్టిస్తోంది. ఈ డ్రగ్ ను ఓవర్ డోస్ కారణంగా అది తీసుకున్న వారి శరీరం కుళ్లిపోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. వారిని చూస్తే అచ్చంగా జాంబీలను చూసినట్లుగానే అనిపిస్తోంది.
జాంబీ మూవీల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రమాదకరమైన వైరస్ సోకడం వల్ల మనుషులు వింతగా ప్రవర్తిస్తుంటారు. వారు కరిస్తే ఆ వైరస్ ఇతరులకు సోకి వారు కూడా జాంబీలుగా మారుతుంటారు. జాంబీల చర్మం కుళ్లిపోయినట్లుగా, రక్తం కారుతూ వికారంగా ఉంటుంది. వారు ప్రాణమున్న శవాలుగా ఉంటారు. ఇదంతా సినిమాల్లో జాంబీలు కనిపించే తీరు. అయితే ఇప్పుడు అమెరికాలో జాంబీ పేరుతో పిలిచే ఓ డ్రగ్ కలకలం సృష్టిస్తోంది.

జైలజీన్(Xylazine) అనే డ్రగ్ ను ఓవర్ డోస్ కారణంగా అది తీసుకున్న వారి శరీరం కుళ్లిపోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. వారిని చూస్తే అచ్చంగా జాంబీలను చూసినట్లుగానే అనిపిస్తోందని అమెరికా అధికారులు చెబుతున్నారు. జాంబీ డ్రగ్, జైలజీన్, ట్రాంక్ అంటూ వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ప్రస్తుతం అగ్రరాజ్యంలోని మెజారిటీ నగరాల్లో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఈ జాంబీ డ్రగ్.
వైద్యులు ఏం చెబుతున్నారంటే..:
జైలజీన్ అనే డ్రగన్ జంతువులకు ఇచ్చే మందు. ఈ డ్రగ్ ను ఓ మోస్తరుగా తీసుకుంటే ఒంటి నొప్పులు తగ్గుతాయి. అయితే దీనిని డోసుకు మించి ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడని నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనకు బేఖాతరు చేసి ఈ డ్రగ్ ను ఎక్కువ డోసుగా తీసుకోవడం వల్ల మత్తుగా అనిపిస్తుందని ఒకరమైన హెరాయిన్ గా దీనిని వాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
జంతువులకు వాడేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్నినిస్ట్రేషన్ ఆమోదించిన ఈ జైలజీన్ మనుషులకు ఏమాత్రం సురక్షితం కాదని వైద్యులు చెబుతున్నారు. దీని ఓవర్ డోస్ తీసుకున్న వ్యక్తులకు రివర్స్ ట్రీట్ మెంట్ లో వాడే నాలోక్సోన్ కు కూడా స్పందించదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఫిలడెల్ఫియా, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజెల్స్ ఇంకా చాలా..:
ఈ జాంబీ డ్రగ్ కేసులు మొదటగా ఫిలడెల్ఫియా నగరంలో కనిపించాయి. ఈ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్ లో ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. తర్వాత మరికొన్ని నగరాల్లోనూ ఈ డ్రగ్ కనిపిస్తూ ఆందోళన రేకెత్తిస్తోంది.
పల్లీబఠాణీల్లాగే దొరుకుతున్న ప్రమాదకర డ్రగ్:
అత్యంత ప్రమాదకరమైన ఈ వెటర్నరీ డ్రగ్ ఇప్పుడు అమెరికా నగర వీధుల్లో ఎక్కడ పడితే అక్కడే దొరుకుతోంది. చాలా తక్కువ ధరకే ఇది అందుబాటులో ఉంటోంది. వీధుల్లో పల్లీ బఠాణీల్లాగే అమ్మేస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ డ్రగ్ దేశమంతటా వ్యాప్తి చెందితే.. అది దేశ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
జాంబీ డ్రగ్ లక్షణాలు:
జాంబీ డ్రగ్ ను డోసుకు మించి తీసుకుంటే మత్తుగా ఉంటుంది. హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు ఆవహిస్తుంది. అందుకే ఎక్కువ మంది ఈ డ్రగ్ ను తీసుకుంటారు.
ఈ డ్రగ్ ను వాడటం పెరుగుతున్న కొద్దీ మత్తుతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొంత కాలం పాటు ఈ డ్రగ్ వాడితే నిద్రలేమి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని చెబుతున్నారు.
తర్వాత చర్మంపై గాయాలు అవుతాయి. చర్మం పూర్తిగా పొడిబారి, క్రమంగా కుళ్లిపోతుంది. రక్తస్రావం అవుతుంది. శరీరంపై అక్కడక్కడ కుళ్లిపోయి అది శరీరమంతా అవుతుంది. చూడటానికి చాలా వికృతంగా ఉంటుంది. కాలి వేళ్లకు, పాదాలకు రంధ్రాలు ఏర్పడతాయి. అందుకే దీనికి జాంబీ డ్రగ్ అనే పేరు వచ్చింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications