For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓమిక్రాన్ వేగంగా వ్యాపించేందుకు గల కారణాలేంటి.. దాన్ని ఎలా ఎదుర్కోవాలంటే...

|

గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి మనల్ని ఎంతగా కలవరపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కరోనాకు విరుగుడు కనిపెట్టామని సంతోషించేలోపే.. ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో వచ్చి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది కోవిద్ మహమ్మారి.

అంతేకాదు ఇది డెల్టా వేరియంట్ల కంటే మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 21 లక్షల మందికి పైగా ఓమిక్రాన్ కరోనా బారిన పడ్డారు. దీన్ని బట్టే ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఏ దేశంలో అయితే ఓమిక్రాన్ కేసులు ప్రారంభమవుతున్నాయో.. అక్కడ కేవలం వారం, పది రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ విస్తరించడంపై ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఇది మన రోగ నిరోధక వ్యవస్థపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఎపిడెమియాలజిస్ట్, కోవిద్-19 టెక్నికల్ హెడ్ మరియా వాన్ కెర్ఖోవ్, ఓమిక్రాన్ వేరియంట్ కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. ఈ ఓమిక్రాన్ మహమ్మారి వేగంగా విస్తరించేందుకు గల ప్రధానమైన మూడు కారణాలను వివరించారు. ఆ వివరాలేంటి.. దీన్ని ఎలా ఎదుర్కోవాలనే వివరాలను కూడా చెప్పారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మూడు కారణాలు..

మూడు కారణాలు..

ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందేందుకు ప్రధానంగా మూడు కారణాలు. అందులో మొదటిది.. కనిపించే ఉత్పరివర్తనాలు మానవ కణాలకు మరింత సులభంగా కట్టుబడి ఉండటానికి అవి అనుమతిస్తాయని చెప్పారు. రెండోది.. మనలో రోగ నిరోధక ఎస్కేప్ అని వివరించారు. దీని అర్థం ఏంటంటే.. గతంలో మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నట్లయితే లేదా వ్యాక్సిన్లు వేసుకుంటే మళ్లీ ఈ మహమ్మారి రావొచ్చు అని ఆమె వెల్లడించారు. ముచ్చటగా మూడో రీజన్ ఏంటంటే.. మనుషుల ఊపిరితిత్తుల్లోని ఎగువ శ్వాసకోశంలో ఈ వేరియంట్ ప్రతి రూపాలు చెందుతుందని చెప్పారు. కరోనా ఫస్ట్ స్ట్రెయిన్ తో పాటు డెల్టా, ఇతర రూపాంతరాలకు ఇది చాలా విభిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల్లోని దిగువ శ్వాసకోసంలో ప్రతిరూపాలు చెందుతాయని వివరించారు.

ఇవి పాటించకపోతే..

ఇవి పాటించకపోతే..

పైన చెప్పిన మూడు కారణాలతో పాటు ఎవరైతే మాస్కులు ధరించకుండా ఉంటారో.. సామాజిక దూరం పాటించకుండా ఉంటారో.. శానిటైజేషన్ రాసుకోకుండా ఉంటారో.. అలాంటి వారికి ఓమిక్రాన్ వైరస్ అత్యంత వేగంగా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఆసుపత్రులపై ఒత్తిడి..

ఆసుపత్రులపై ఒత్తిడి..

కరోనా కేసుల పెరుగుదలతో ప్రపంచంలోని ప్రతి ఒక్క ఆసుపత్రిపై ఒత్తిడి పెరిగిపోతుంది. ముఖ్యంగా గత సంవత్సరం డిసెంబర్ చివరి నుండి ఇప్పటివరకు కరోనా రోగుల సంఖ్య ఆసుపత్రులలో విపరీతంగా పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఓమిక్రాన్ వంటి మహమ్మారి వల్ల కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని, దీంతో వైద్యశాలలపై ఒత్తిడి పెరిగి.. ఆరోగ్య నిపుణులకు ఆందోళన కలిగిస్తుందని వివరించారు. అయితే వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయడం వల్ల కేసుల సంఖ్య తగ్గించేందుకు తాము ప్రయత్నం చేస్తామని చెప్పారు. దీని వల్ల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థతో పాటు ఇతర రంగాలపై భారం పడకుండా ఉంటుందని' కెర్ఖోవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అడ్డుకోవడం సులభమే..

అడ్డుకోవడం సులభమే..

ఓమిక్రాన్ ఎంత వేగంగా విస్తరించినా.. అది మన దరికి చేరకుండా చేయడం అనేది చాలా సులభమని తీపి కబురు కూడా చెప్పారు. వ్యాక్సిన్లు వేసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం.. గుంపు గుంపులుగా ఉండేచోటకు వెళ్లకుండా ఉండటం.. పెద్ద పెద్ద మీటింగులకు హాజరు కాకుండా ఉండటం.. శానిటైజేషన్ ప్రతిరోజూ చేసుకుంటే.. మీతో పాటు ఇతరులు కూడా ఓమిక్రాన్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని తెలిపారు. దీని వల్ల ఆరోగ్య వ్యవస్థలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా నివారించొచ్చని కెర్ఖోవ్ స్పష్టం చేశారు.

ఓమిక్రాన్ వేగంగా వ్యాపించేందుకు గల 3 ప్రధాన కారణాలేంటి?

ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందేందుకు ప్రధానంగా మూడు కారణాలు. అందులో మొదటిది.. కనిపించే ఉత్పరివర్తనాలు మానవ కణాలకు మరింత సులభంగా కట్టుబడి ఉండటానికి అవి అనుమతిస్తాయని చెప్పారు. రెండోది.. మనలో రోగ నిరోధక ఎస్కేప్ అని వివరించారు. దీని అర్థం ఏంటంటే.. గతంలో మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నట్లయితే లేదా వ్యాక్సిన్లు వేసుకుంటే మళ్లీ ఈ మహమ్మారి రావొచ్చు అని ఆమె వెల్లడించారు. ముచ్చటగా మూడో రీజన్ ఏంటంటే.. మనుషుల ఊపిరితిత్తుల్లోని ఎగువ శ్వాసకోశంలో ఈ వేరియంట్ ప్రతి రూపాలు చెందుతుందని చెప్పారు. కరోనా ఫస్ట్ స్ట్రెయిన్ తో పాటు డెల్టా, ఇతర రూపాంతరాలకు ఇది చాలా విభిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల్లోని దిగువ శ్వాసకోసంలో ప్రతిరూపాలు చెందుతాయని వివరించారు.

English summary

WHO Scientist Lists Reasons Why Omicron Is Spreading So Fast, Tells How to Combat It in Telugu

Here we are discussing about the WHO scientist list reasons why omicron is spreading so fast, tells how to combat it in Telugu. Have a look