For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Cancer Day 2021 : ఈ అలవాట్లుంటే క్యాన్సర్ కాటుకు బలవ్వాల్సిందే...! తస్మాత్ జాగ్రత్త..!

|

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం(World Cancer Day) జరుపుకుంటారు.దీన్ని యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్(UICC) సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.

ఈ ఏడాది వరల్డ్ క్యాన్సర్ డే 2021 యొక్క థీమ్ 'Iam and I will'. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ను కంట్రోల్ చేసేందుకు 2000వ సంవత్సరంలో క్యాన్సర్ కు వ్యతిరేకంగా ప్రపంచ క్యాన్సర్ సదస్సు నిర్వహించబడింది. 2016లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 'మేము చేయగలం' అనే ట్యాగ్ లైనుతో మూడేళ్ల క్రితం ప్రచారాన్ని ప్రారంభించింది.

క్యాన్సర్ ప్రభావానికి తగ్గించడానికి 'నేను ఇది చేయగలను' అనే నినాదాలతో ముందుకెళ్లింది. ఇప్పటివరకు సుమారు 60 ప్రభుత్వాలు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నాయి. 2014లో క్యాన్సర్ నిర్ధారణ కేసులు ప్రపంచ వ్యాప్తంగా 14.5 మిలియన్లకు చేరుకోగా.. 2024 నాటికి ఈ సంఖ్య 19 మిలియన్లకు చేరుతుందని అంచనా.

ఈ క్యాన్సర్ కూడా అంటు వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంది. కాబట్టి రాబోయే రెండు దశాబ్దాలలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 22 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు మనం మన అలవాట్లను మార్చుకోవాలి. లేదంటే మీరు కూడా క్యాన్సర్ బారిన పడొచ్చు. ముఖ్యంగా ఎలాంటి అలవాట్లు ఉంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాన్సర్ గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్య విషయాలు

ఆల్కహాల్ ఎక్కువగా తాగితే..

ఆల్కహాల్ ఎక్కువగా తాగితే..

ఆల్కహాల్ మోతాదుకు మించి తాగితే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఓ అధ్యయనం తేల్చింది. రోజుకు రెండుసార్లు కంటే ఎక్కువగా మద్యం సేవించడం వల్ల అన్నవాహిక క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, పురుషనాళ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని అనేక అధ్యయనాలు తెలిపాయి. ఆల్కహాల్ కడుపు ఆమ్లాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రేగ యొక్క పొరకు హాని కలిగిస్తుంది.

ఎయిర్ ఫ్రెషర్లు..

ఎయిర్ ఫ్రెషర్లు..

మీరు మీ ఇంట్లో సువాసన కోసం వాడే ఎయిర్ ఫ్రెషర్లు కూడా క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ ఎయిర్ ఫ్రెషనర్లు గాలి నాణ్యతను ఏ విధంగానూ మెరుగుపరచవు. అవి దుర్వాసనను తొలగించి భావన కలిగిస్తాయి. కానీ వాటిలో హానికరమైన క్యాన్సర్ కలిగించే పదార్థాలు ఉన్నాయి. అవి మీ చుట్టూ పిచికారి చేసినప్పుడు నాసికా రంధ్రాల గుండా ప్రవేశిస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

పొల్యూషన్..

పొల్యూషన్..

క్రమం తప్పకుండా డిజీల్ ఇంధనాల నుండి వెలువడే కాలుష్యం(డ్రైవర్లు, మెకానిక్స్) బారిన పడేవారు ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. డిజీల్ మరియు పెట్రోల్(గ్యాసోలిన్) బెంజీన్ తో సహా విష కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రో కార్బన్లను విడుదల చేస్తాయి.

క్యాన్సర్ : సాధారణంగా వచ్చే వివిధ రకాల క్యాన్సర్లు...

కాల్చిన ఆహారం..

కాల్చిన ఆహారం..

మీరు చేపలు, చికెన్ మరియు మాంసం వంటి ఆహార ప్రదార్థాలను గ్రిల్ చేసినప్పుడు, అవి కొద్దిగా కాలుతాయి. చాలా వరకు నల్లగా మారుతుంది. ఇది బాగా రుచికరంగా ఉన్నప్పటికీ, హెటెరోసైక్లిక్ ఆమైన్స్ మరియు పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్(పిహెచ్) అని పిలువబడే సమ్మేళనాలు కడుపు, పెద్దప్రేగు మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి.

ఈ ఫుడ్ తినడం వల్ల..

ఈ ఫుడ్ తినడం వల్ల..

రెడీమెడ్ గా ఉండే ఆహారాలను తినడం అనారోగ్యకరమైనవి మరియు ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఆహారాలు ప్లాస్టిక్ ఉత్పత్తులతో కప్పబడిన లోహపు పాత్రలలో హానికరమైన రసాయనాలతో నిండి ఉంటాయి. ఇలా రెడీమెడ్ ఫుడ్ హార్మోన్లకు ఆటంకాలను ఏర్పరుస్తాయి. దీని వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరిగి DNA మార్పులకు దారి తీస్తుంది.

డైట్ సోడా తాగడం..

డైట్ సోడా తాగడం..

ఇటీవల చేసిన కొన్ని అధ్యయనాలలో చాలా సాధారణ సోడా బ్రాండ్లలో 4-మిథైలిమిడాజోల్(4-MI) అధికంగా ఉన్నాయని, ఇది జంతువుల క్యాన్సర్. డైట్ సోడాలో ఉండే తీపి పదార్థాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మరియు ఇతర రకాల క్యాన్సర్లను పెంచుతాయి. డైట్ సోడా మూత్రాశాయ క్యాన్సర్ మరియు మెదడు కణితులకు దారితీస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి.

సన్ స్క్రీన్ వాడటం..

సన్ స్క్రీన్ వాడటం..

చర్మ క్యాన్సర్ మరియు ఇతర చర్మ నష్టాలను నివారించడానికి చాలా మంది సన్ స్క్రీన్ ను ఉపయోగిస్తారు. సన్ స్క్రీన్సులో జింక్ ఆక్సైడ్ అనే పదార్థం ఉందని తెలిస్తే మీరు షాకవుతారు. ఇది ఫ్రీ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల డిఎన్ఎ దెబ్బతిని క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

సువాసన గల కొవ్వొత్తులు..

సువాసన గల కొవ్వొత్తులు..

పారాఫిన్ మైనపు నుండి విడుదలయ్యే పొగలలో క్యాన్సర్ కారకాలు మరియు ఇతర శిలాజ ఇంధన భాగాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పారాఫిన్ మైనపు కొవ్వొత్తులు మీరు క్రమం తప్పకుండా క్యాండిల్ లైట్ డిన్నర్ కు వెళ్తే మీరు ఆనందానికి బదులు అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవచ్చు. ఇది మీ బాడీ హాని కలిగించదు కానీ ఇది మీ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ప్రేరేపిస్తుంది.

రొమాన్స్ అలా చేస్తే..

రొమాన్స్ అలా చేస్తే..

జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం, ఓరోఫారింజియల్ క్యాన్సర్ పెరుగుదల రేటు నోటి నుండి జననేంద్రియ సంబంధానికి పొందిన HPV సంక్రమణ వల్ల సంభవిస్తుందని నివేదించబడింది. ఆరు లేదా అంతకంటే ఎక్కువ ఓరల్ సెక్స్ భాగస్వాములను కలిగి ఉండటం ప్రమాదాన్ని పెంచుతుందని ఓ అధ్యయనం వివరించింది.

రాత్రి వేళలో పని..

రాత్రి వేళలో పని..

మీరు విన్నది నిజమే. రాత్రి వేళలో ఎక్కువగా పని చేసే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. బ్రిటీష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, స్మశాన వాటికలో పని చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే మెలటోనిన్ అణచివేత వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

చివరగా..

చివరగా..

ఒక గ్లాసు కోక్ మీద సిప్ చేయడం లేదా కాల్చిన ఆహారాన్ని చిన్న ముక్కను తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెద్దగా ఉండదు. అయితే ఈ అలవాట్ల యొక్క క్రమమై మరియు స్థిరమైన అభ్యాసం మీ మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

సందేహాలు-సమాధానాలు..

సందేహాలు-సమాధానాలు..

ఎలాంటి ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి?

ఎర్రగా ఉండే మాంసం(పంది మాంసం, గొడ్డు మాంసం, దూడ మాంసం) వంటి మాంస ఉత్పత్తులు తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయొచ్చా?

ప్రస్తుతం క్యాన్సర్ కు చికిత్స లేదు. అయినప్పటికీ, విజయవంతమైన చికిత్స వల్ల క్యాన్సర్ ఉపశమనం పొందొచ్చు మరియు లక్షణాలకు చికిత్స చేయొచ్చు.

English summary

World Cancer Day 2021: Dangerous Habits That May Cause Cancer

Cancer is the second leading cause of death globally and was responsible for 8.8 million deaths in recent years.
Story first published: Thursday, February 4, 2021, 14:18 [IST]