For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Immunization Week 2021: ఇమ్యూనిటీ గురించి ఈ వాస్తవాలు తెలుసా...

వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ 2021 సందర్భంగా ఇమ్యూనిటీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్(24-30 చివరి వారంలో వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ వారోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రోగ నిరోధకత గురించి ప్రజలలో అవగాహన కల్పించడం.. అందరిలోనూ అవగాహన పెంచడం దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. వ్యాక్సిన్లు అనేవి ప్రజల ప్రాణాలను కాపాడతాయి. వ్యాధుల నుండి రక్షణ ఇస్తాయి.

World Immunization Week 2021: Facts About Importance Of Immunization

ఎవరైనా సరైన సమయంలో వ్యాక్సిన్లు వేసుకోకపోతే చాలా ప్రమాదాలకు గురవుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు టీకాలు తీసుకోకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఇమ్యూనిజైషన్ వల్ల 99 శాతం మేరకు పోలియో కేసులు తగ్గాయి. ఈ సందర్భంగా వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ వారోత్సవాలు జరుపుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, వాస్తవాల గురించి తెలుసుకుందాం...

World Immunization Week 2021: Facts About Importance Of Immunization

కరోనా వైరస్ ఘోరమైన థర్డ్-డిగ్రీ వైరస్ లా మారుతోంది ... దాని లక్షణాలేంటో మిటో మీకు తెలుసా?కరోనా వైరస్ ఘోరమైన థర్డ్-డిగ్రీ వైరస్ లా మారుతోంది ... దాని లక్షణాలేంటో మిటో మీకు తెలుసా?

అక్షయ్ హీరోయిన్..

అక్షయ్ హీరోయిన్..

బాలీవుడ్ అక్షయ్ కుమార్ సరసన నటించిన మనుషి చిల్లార్, యునిసెఫ్ ఆధ్వర్యంలో భారతదేశంలో పిల్లలకు రోగ నిరోధక శక్తి గురించి అవగాహన కల్పించేందుకు ప్రచారకర్తగా ఎంపికయ్యింది. ఈమె కంటే ముందు మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్(ఏప్రిల్ 24-30) వారోత్సవాల సందర్భంగా ఈమె నాయకత్వం వహించనున్నారు. ఈ ముఖ్యమైన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రారంభించారు. పిల్లలు టీకాలు వేయించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఎదిగేందుకు మరియు పోలియో బారిన పడకుండా, సురక్షితంగా పెరగడానికి సహాయపడతాయని చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి, పిల్లలకు టీకాలే వేసే ప్రయత్నాలను మనం రెట్టింపు చేయాలని పిలుపునిచ్చారు. కోవిద్-19 నుండి పిల్లల ప్రాణాలను రక్షించేది కూడా వ్యాక్సిన్లే అని గుర్తు చేశారు.

వ్యాక్సిన్లు ఎందుకు తీసుకోవాలి..

వ్యాక్సిన్లు ఎందుకు తీసుకోవాలి..

2015 సంవత్సరంలో ప్రపంచంలోని అన్ని దేశాల నుండి దాదాపు 116 మిలియన్ల పిల్లలకు డిఫ్తీరియా-టెటనస్ పెర్టుప్సిస్ వ్యాక్సిన్ ఇవ్వబడింది. దీని వల్ల పిల్లల్లో అనారోగ్యం మరియు వైకల్యాన్ని నివారించబడింది. 2010-2015 సంవత్సరాల మధ్య టీకా(వ్యాక్సిన్)ల ద్వారా రోగ నిరోధకత కారణంగా దాదాపు 10 మిలియన్ల మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. వ్యాక్సిన్లు మన బాడీని తీవ్రమైన ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అంచనా ప్రకారం, ప్రతి సంవత్సరం రెండు నుండి మూడు మిలియన్ల మంది టీకాల నుండి ప్రాణాలను కాపాడుకుంటున్నారు.

వ్యాధుల నుండి నివారణ..

వ్యాధుల నుండి నివారణ..

కొన్ని ఆరోగ్య ప్రమాదాలను నివారించేటప్పుడు వ్యాక్సిన్లు అత్యంత సులభమైన పరిష్కారం. పోలియో, నిరంతర దగ్గు, విరేచనాలు, న్యుమోనియా వంటి వ్యాధుల వల్ల కలిగే మరణాన్ని కూడా నివారించవచ్చు.

కరోనా నుండి రక్షించడానికి డబుల్ మాస్కింగ్ ఎలా సహాయపడుతుందో మీకు తెలుసా?కరోనా నుండి రక్షించడానికి డబుల్ మాస్కింగ్ ఎలా సహాయపడుతుందో మీకు తెలుసా?

ప్రతి సంవత్సరం..

ప్రతి సంవత్సరం..

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రోగ నిరోధకతకు సంబంధించిన వ్యాక్సిన్ల వల్ల దాదాపు 2 నుండి 3 మిలియన్ల మరణాల నుండి కాపాడుతున్నాం. అంతకుముందు సుమారు 19.4 మిలియన్ల మంది పిల్లలు వ్యాక్సిన్లు పొందలేకపోయారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇమ్యూనైజేషన్ పట్ల అవగాహన కలిగి ఉండాలి.

టీకా ఎలా పని చేస్తుంది..

టీకా ఎలా పని చేస్తుంది..

ప్రస్తుతం అనేక రకాల వ్యాధులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు కోవిద్-19కు వ్యాక్సిన్ లేదనుకునే వాళ్లం. కానీ ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కూడా చాలా దేశాల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఇతర వ్యాధులకు కూడా వ్యాక్సిన్లు విజయవంతంగా ప్రజలకు అందజేయబడుతున్నాయి. టీకాలు రోగ నిరోధక వ్యవస్థను వ్యాధి యొక్క లక్షణాలకు గురికాకుండా చూస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ బ్యాక్టిరీయా లేదా వైరస్ వంటి ఆక్రమణ జెర్మ్ లకు గురైనప్పుడు, ఇది సహజంగా వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఇవి మీ బాడీ యొక్క రోగనిరోధక శక్తితో పని చేయడం ద్వారా వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

వ్యాక్సిన్లతో ఏ వ్యాధుల నివారణ..

వ్యాక్సిన్లతో ఏ వ్యాధుల నివారణ..

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, వ్యాక్సిన్లు గర్భాశయ క్యాన్సర్, హెపటైటిస్ బి, కలరా, డిఫ్తీరియా, మీజిల్స్, మెనింజైటిస్, గవదబిళ్లలు, న్యుమోనియా, జపనీస్ ఎన్సెఫాలిటిస్, పోలియో, రాబిస్, రోటవైరస్, రుబెల్లా టెటానస్, టైఫాయిడ్, వరిసెల్లా వంటి వివిధ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా కరోనా కట్టడికి కూడా వ్యాక్సిన్ బాగా ఉపయోగపడుతుంది.

English summary

World Immunization Week 2021: Facts About Importance Of Immunization

The main objective of celebrating immunization week is to promote the importance of immunization and raise awareness about it among people.
Desktop Bottom Promotion