For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zika Virus : టీకా లేని జికా వైరస్.. కేరళలో తొలి కేసు నమోదు... దీని లక్షణాలేంటి.. ఎలా సోకుతుందంటే..

కేరళలో జికా వైరస్ తొలి కేసు గుర్తించబడింది.. ఈ సందర్భంగా దాని లక్షణాలు, పాటించాల్సిన నివారణలేంటో చూద్దాం రండి.

|

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇంకా కంట్రోల్ కాలేదు. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందంటూ నివేదికలు, అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

Zika Virus Case Detected in Kerala; Check symptoms, prevention in telugu

డాక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచిస్తున్నారు. కానీ ఇంతలోనే జికా వైరస్ రూపంలో మరో కొత్త సమస్య మొదలైంది. కేరళలో ఈ జికా వైరస్ తొలిసారిగా గుర్తించబడింది. తాజాగా ఈ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోందట.

Zika Virus Case Detected in Kerala; Check symptoms, prevention in telugu

ఇంతకీ జికా వైరస్ అంటే ఏమిటి? ఇది దేని నుండి వ్యాపిస్తుంది. ఇది ప్రాణాంతకమా? ఈ వైరస్ లక్షణాలేమిటి..ఈ మహమ్మారి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Study: డెల్టా ప్లస్.. డేంజర్ బెల్స్ ను కరోనా వ్యాక్సిన్లు అడ్డుకుంటాయా?Study: డెల్టా ప్లస్.. డేంజర్ బెల్స్ ను కరోనా వ్యాక్సిన్లు అడ్డుకుంటాయా?

కేరళలో కలవరం..

కేరళలో కలవరం..

కరోనా విరుగుడుకు టీకా వచ్చిందని మెల్లగా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. తాజాగా కేరళలో జికా వైరస్ కేసు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ముందుగా 24 ఏళ్ల గర్భిణికి జికా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది.

13 మందిపై సందేహం..

13 మందిపై సందేహం..

మరోవైపు పుణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు మొత్తం 19 శాంపిల్స్ పంపగా 13 మందికి ఈ మహమ్మారి సోకినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. ఇవన్నీ తిరువనంతపురం నుండి పంపినవే. తాము పంపిన శాంపిల్స్ లో కనీసం 13 పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ ఓ ఛానెల్ ప్రతినిధికి తెలిపారు.

తొలి కేసు గర్భిణికి..

తొలి కేసు గర్భిణికి..

తిరువనంతపురం జిల్లా పరస్సలైన్ ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి జూన్ 28వ తేదీన మహిళ జ్వరం, తలనొప్పి, దద్దుర్లతో ఆస్పత్రిలో చేరింది. ఆమె శాంపిల్స్ ను పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపగా.. తనకు జికా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఆమె జులై ఏడో తేదీన ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. తన బిడ్డకు ఆ లక్షణాలేమీ కనిపించలేదని, కేవలం తల్లికి మాత్రమే ఆ లక్షణాలు కనిపించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

CoronaVirus Vaccination: కరోనా టీకా తీసుకున్న తర్వాత భుజం నొప్పి వస్తే మంచిదా?CoronaVirus Vaccination: కరోనా టీకా తీసుకున్న తర్వాత భుజం నొప్పి వస్తే మంచిదా?

జికా వైరస్ లక్షణాలు..

జికా వైరస్ లక్షణాలు..

జికా వైరస్ (Zika Virus) లక్షణాలు దాదాపు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. CDC ఈ వైరస్ ఎప్పటి నుండో మన మధ్యే ఉందని, కానీ దీన్ని ఎవరూ గుర్తించలేదని చెబుతోంది. దీన్ని మనం డెంగ్యూలా కూడా భావించొచ్చు. ఎందుకంటే వీటికి దాదాపు డెంగ్యూ జ్వరానికి ఉన్న లక్షణాలున్నాయని CDC వివరిస్తోంది. మొత్తానికి ఈ వైరస్ పై కూడా ప్రస్తుత పరిశోధనలు చేసేందుకు నిపుణులు సిద్ధమవుతున్నారు.

జికా వైరస్ ఎలా సోకుతుంది..

జికా వైరస్ ఎలా సోకుతుంది..

జికా వైరస్ ఏడెన్ అనే దోమ నుండి మనషులకు సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటివరకూ ఈ వైరస్ కు వ్యాక్సిన్ గానీ.. యాంటీవైరల్ చికిత్స గానీ అందుబాటులో లేదన్నారు. పగటి పూట దోమ కాటు బారిన పడకుండా చూసుకుంటే.. జికా వైరస్ బారి నుండి తప్పించుకోవచ్చని వివరించారు.

25కు పైగా దేశాల్లో..

25కు పైగా దేశాల్లో..

ఈ జికా వైరస్ ఎల్లో ఫీవర్, చికున్ గున్యా, డెంగ్యూ జ్వరం వంటి వైరస్ ల కుటుంబానికి చెందిందే. తొలుత ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరప్ దేశాల్లో ప్రబలిన జికా వైరస్ కు ఎలాంటి మందులు లేవు. దాదాపు 25 దేశాల్లో ఈ జికా వైరస్ కలకలం రేపింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ మహమ్మారి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు కరోనా, జికా గురించి మరువక ముందే ఇప్పుడు కొత్తగా ఛపారే వైరస్ అంటూ మరో మహమ్మారి మానవాళిని భయాందోళన గురి చేస్తోంది.

ఈ ఒక్క టీ మీ స్పెర్మ్ కౌంట్ పెంచడానికి మరియు అంగస్తంభనను నివారించడంలో సహాయపడుతుంది!ఈ ఒక్క టీ మీ స్పెర్మ్ కౌంట్ పెంచడానికి మరియు అంగస్తంభనను నివారించడంలో సహాయపడుతుంది!

1947లో..

1947లో..

ఈ జికా వైరస్ లక్షణాలు తొలుత 1947 ఉగాండ అడవుల్లో ఉండే కోతుల్లో ఈ వైరస్ కనిపించిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. 1952 సంవత్సరంలో మనుషుల్లోనూ ఈ వైరస్ ను గుర్తించారట. అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఈ జికా వైరస్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

నరాలపై దాడి..

నరాలపై దాడి..

జికా వైరస్ పుట్టుకతో వచ్చే లోపాలు, గుల్లెయిన్-బారే సిండ్రోమ్ డెవలప్ మెంట్ కు కారణమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ, నరాలపై నేరుగా దాడి చేస్తుంది. అయితే ఈ వైరస్ సోకిన వారిలో కొందరికి దీని లక్షణాలు బయటపడకపోవచ్చు. అయితే గర్భిణులకు మాత్రం తీవ్ర హాని కలిగిస్తుంది. ఇది సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, కళ్లు చర్మం ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుండి ఏడు రోజుల వరకు ఇలాంటివి కొనసాగితే.. నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్న్ సంప్రదించాలి.

English summary

Zika Virus Case Detected in Kerala; Check symptoms, prevention in telugu

Here we are talking about the zika virus case detected in kerala: Check symptoms, prevention in Telugu. Have a look
Desktop Bottom Promotion