Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
పాలు తేనె కలుపుకొని తాగవచ్చా..నిపుణులు హెచ్చరికలు తెలుసుకుందాం..?
తీపి, వెచ్చని మరియు మంచి అనుభూతిని కలిగించే పానీయాల విషయానికి వస్తే పాలు మరియు తేనె చాలా ఇష్టమైనవి. ఈ పానీయం చాలా ఓదార్పునిస్తుంది, కానీ పడుకునే ముందు ఒక గ్లాసు పాలు మరియు తేనె కూడా అపారమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి మంచి నిద్ర వరకు, తేనెతో కూడిన పాలు ఆరోగ్యకరమైన పానీయం, దీనిని తప్పనిసరిగా ప్రయత్నించాలి. తేనె మరియు పాలు యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ, కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి, వీటిని గుర్తుంచుకోవాలి. కాబట్టి పాలలో తేనెను ఎలా కలపాలి, పాలలో ఎంత తేనె కలపాలి, నేను వేడి పాలలో తేనె కలపవచ్చా అనే ప్రశ్నలు మీకు ఉంటే, మీ కోసం వీటికి సమాధానం ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాము! తేనెతో పాలు కలపడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.
పాలు తేనెను ఇష్టపడని వారు ఉండరు. తేనె తియ్యగా కమ్మగా రుచితగా వుంటుంది. పాలు తేనె కలుపుకొని తాగితే రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా లాభాలున్నాయ్. పాలల్లో క్యాల్షియంతో పాటు ప్రొటీన్లు కూడా వుంటాయ్, ఇక తేనె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజు నద్రపోయే ముందు ఒక గ్లాసు పాలల్లో రెండు టీ స్పూన్ల తేనె కలుపుకొని తాగితే నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. పాలు, తేనె కలుపుకొని తాగడం వల్ల లాభాలే కాదు ఆరోగ్యానికి నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు. పాలు, తేనె కలుపుకొని తాగితే ఎలాంటి ప్రమాదం వుంటుంది. ఎంత మోతాదులో ఈ రెండూ కలుపుకొని తాగాలి వంటి ప్రశ్నలకు మేము మీకు ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తున్నాము.
పాలు తేనె కలుపుకొని తాగితే కలిగే ఆరోగ్యప్రయోజనాలు :
పాలల్లో ముఖ్యంగా వైటమిన్ డి, వైటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయ్. వీటితో పాటు కొన్ని ఇతర పోషకాలు కూడా. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు సంమృద్ధిగా వుంటాయ్. రెండింటిలో పోషకాలు, వైటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా వుండడంతో ఈ రెండూ కలుపుకొని తాగితే శరీరానికి సంజీవని పానియం లాంటిదని అనుకోవచ్చు.

అటు పాలు, ఇటు తేనె రెండింటిలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలున్నాయ్. పాలలో ఉండే ఇమ్యునోగ్లోబిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయ్. తేనలో ఉండే యాంటీ బ్యాక్టీరియన్, యాంటీ వైరల్ లక్షణాలుండే పోషకాలుంటాయ్. ఈ రెండూ కలుపుకొని తాగడం వల్ల కరోనా లాంటి భయంకరమైన రోగాల నుంచి కూడా కొంత వరకు బయటపడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.
తేనెలో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే లక్షణాలున్నాయ్. ఇక పాలు సులభంగా జీర్ణమవుతాయ్. ఈ రెండూ తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించి ఎలాంటి సమస్యలను ఎదుర్కోము. తేనెకు ప్రీబయోటిక్ లక్షణాలు కూడా ఉండడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు తలెత్తవని పరిశోధకులు చెబుతున్నారు.
పాలలో ఉండే ట్రిఫ్టోఫాన్ అమైనో ఆమ్లం నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్రలోంచి బయటకు రావడానికి ఉపకరించే మెలటోనిన్‌ను తేనె అదుపు చేస్తుంది. ఈ రెండూ కలిపి తాగడం వల్ల నిద్రకు ఎలాంటి ఆటంకం వుండదని కుండబద్దలు కొట్టి చెప్పవచ్చు. తేనె పాలు రెండింటినీ కలుపుకొని రోజుకు రెండు సార్లు ప్రతీ రోజు తాగడం వల్ల నిద్రలేమి సమస్యను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పాలలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియంలో ఉండే ఫాస్ఫరస్ యముకలను బలంగా వుంచుతాయ్. రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల యుమకలకు సంబంధించిన ఏ వ్యాధీ వచ్చే అవకాశం లేదు.
రెండింటినీ కలుపుకొని తాగడం వల్ల కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయ్..
పాలు, తేనె రెండింటిలో చెక్కెర, క్యాలరీల స్థాయి అధికంగా వుంటుంది. అపరిమితంగా వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలున్నాయ్.
కొంతమందికి పాలు జీర్ణం కావు. పాలల్లో ఉండే లాక్టోస్‌ను జీర్ణం చేసే ప్రక్రియ వారి జీర్ణవ్యవస్థలో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు.
తేనెలో సహజంగా తియ్యని పదార్ధం ఉండడం వల్ల డయాబెటిస్ రోగులకు ప్రమాదకరం కావచ్చు. పాలు, తేనె కలుపుకొని తాగడం వల్ల షుగర్ లెవెల్ష్ పెరిగే పరిస్థితి వుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications