Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఒక్కసారిగా మందు మానేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? ఊహించరు కూడా!
మద్యపానం ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ విషయం మనందరికీ తెలిసినా.. అది తాగితే ప్రాణాలు పోతాయని తెలిసినా చాలా మంది దానిని తాగుతుంటారు. ఒక్కసారి మద్యం అలవాటు అయితే దానిని వదిలించుకోవడం మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి తాగిన వ్యక్తి దానిని మానెయ్యడానికి ఓ చిన్న యుద్ధమే చేస్తాడు. అందుకోసం ఎక్కడెక్కడో ఏదేదో మందులు, ఇతర మార్గాలను ఎంచుకుంటారు.
ఎవరైతే రెండు మూడు నెలలకు ఓసారి మద్యం తాగుతాడో అతను తన శరీరంలోని అవయవాల తీరులో మార్పులను గమనించే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే క్రమం తప్పకుండా ప్రతిరోజూ మద్యం సేవిస్తారో.. వారు ఒకేసారి మద్యం మానేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అకాస్మాత్తుగా మద్యం మానేయడం వలన కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయని, అలాగే దీర్ఘకాలిక రోగాలు వస్తాయని చెబుతున్నారు. ఇంతకీ మద్యపానం ఒక్కసారిగా మానేయడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఎలాంటి టిప్స్ పాటిస్తే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మానసిక సమస్యలు
మద్యం అకస్మాత్తుగా మానేయడం వల్ల కొంతమందిలో మానసిక ఆందోళనలు, ఉద్రిక్తతలు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మద్యం మానేయడం వల్ల మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. చాలామంది మద్యపానం మానేసిన తర్వాత చెవుల్లో శబ్దాలు వినిపించడం, ఇతరులు పిలుస్తున్నట్లు అనిపించడం వంటి అనుభవాలు పంచుకుంటున్నారు. ఈ మద్యం వ్యసనం నుంచి బయటపడినప్పుడు ఎదురయ్యే ఒక రకమైన సిండ్రోమ్ అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందుకే మద్యపానం ఒక్కసారిగా ఆకస్మాత్తుగా మానేయకుండా క్రమక్రమంగా మానాలని సూచిస్తున్నారు. రెండుమూడు నెలలకు ఓసారి, నెలకు ఓ రెండుసార్లు మందు తాగే వారు సడన్‌గా మందు మానేసినా ఎలాంటి ప్రమాదం ఉండకపోయినా.. ప్రతిరోజూ తాగేవారి పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది.
కోమాలోకి వెళ్లే అవకాశం
ఎక్కువ కాలం పాటు మద్యం సేవించిన వ్యక్తి అకస్మాత్తుగా మద్యం మానేసినప్పుడు, మూడు రోజుల్లోనే మానసిక సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు, ముందే ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి, కోపం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాస్త ఎక్కువ కాలంగా మద్యం సేవించిన వారు అకస్మాత్తుగా మానేస్తే, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని వైద్యులు అంటున్నారు. అలాంటి వారు తరచుగా శరీరానికి సరైన ఆహారం తీసుకోకుండానే మద్యం తాగుతుంటారు. ఇలాంటి వారు మద్యం మానేసినప్పుడు నాడీ సంబంధిత సమస్యలు ఎక్కువగా సంభవిస్తాయి. అందుకే మద్యం సేవించే సమయంలో ఆహరం అనేది చాలా ముఖ్యం. ఆహరం తీసుకోవడం వలన కిడ్నీలు దేబ్బతిండంతో పాటు అనేక సమస్యలు వస్తాయి.
సూచనలు
మద్యం మానేయాలనుకునే వారు దానిని క్రమంగా తగ్గించడం ప్రారంభించాలి. రోజువారీ మద్యపానాన్ని తగ్గించి, వారానికి లేదా నెలకి ఒకసారి తాగడం మంచి పరిష్కారం కావచ్చు. ఈ విధంగా మద్యం మానడం మానసిక, శారీరక సమస్యలు కలిగించకుండా, ఆరోగ్యంగా జీవించడం సాధ్యం అవుతుంది. వైద్య నిపుణులు, మద్యపానాన్ని పూర్తిగా మానేయాలనుకుంటే, దాన్ని క్రమంగా తగ్గించుకోవడం మంచి పద్ధతిగా సూచిస్తున్నారు. మీరు కూడా మద్యపానం ఆపేయాలని అనుకుంటే.. ఒక్కసారి ఈ చిట్కాలను ఫాలో అవుతూ మద్యం మానేయడానికి ట్రై చేయండి. కచ్చితంగా మీరు మద్యం మానేయడంతో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందే సూమోచనలు ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications