Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
గుండెతో పాటు కాలేయ వ్యాధులు కూడా ఈ మధ్య క్రమంగా పెరిగిపోతున్నాయ్. కాలేయం వ్యాధికి సంబంధించిన లక్షణాలు మొదట్లో బయటపడవు. సమస్య తీవ్రమవుతేనే కాలేయం దెబ్బతిన్నదని మనకు తెలుస్తుంది. లివర్‌పై కొవ్వు పేరుకుపోయయినా రోగికి తెలియకుండానే తీవ్రమవుతుంది. కాని కొన్ని లక్షణాలు ద్వారా లివర్ వ్యాధిని పసిగట్టువచ్చు. లివర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
లివర్ వ్యాధి లక్షణాలు
తీవ్రమైన అలసట
లివర్‌కు సంబంధించిన ఏదైనా వ్యాధి సోకినప్పుడు ముందుగా తీవ్రమైన అలసటకు లోనవుతారు. విశ్రాంతి తీసుకున్నా సరే మీరు నిరంతరాయంగా అలసటకు గురౌతారు.
ఆకలి లేకపోవడం
వ్యాధిసోకే ముందు వరకు మీకు తినడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా లేక మీరు ఆహారప్రియులైనప్పటికీ మీకు ఒక్కసారిగా ఆకలివేయడం అనిపించదు. మీకు ఏదీ తినాలని అనిపించదు, ఆకలి పూర్తిగా చచ్చిపోతుంది. దీనివల్ల మీరు క్రమంగా బరువు తగ్గి లివర్ వ్యాధులు తీవ్రమౌతాయ్.

వికారం, వాంతులు ఎక్కువౌతాయ్. భోజనం చేసిన వెంటనే మీకు వాంతులు అయ్యేట్టు అనిపించి తరువాత వాంతులు అవుతాయ్. ఇలా వాంతులు పెరిగిపోతాయ్.
కడుపు కుడివైపు నొప్పి
మద్యం ఎక్కువ సేవించిన వారిలో లివర్ వ్యాధులు వస్తాయంటారు. కానీ మద్యం సేవించిన వారిలో కూడా లివర్‌పై కొవ్వు పెరిగి అనారోగ్యానికి గురౌతారు. లివర్ పై కొవ్వు పెరిగితే కడుపు కుడివైపులో మంట, నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయ్.
కడుపు, కాళ్లు ఉబ్బిపోవడం
లివర్ దెబ్బతిన్నప్పుడు అది సరిగ్గా పనిచేయక నీటిని నిల్వ చేసుకుంటుంది. అప్పుడు కడుపు, కాళ్లు వాచి ఉబ్బిపోతాయ్. ఈ లక్షణం కూడా లివర్ వ్యాధికి గురౌనట్లు తెలుసుకోవచ్చు.
జాండిస్
కళ్లు, చర్మం పచ్చపడిపోవడం కూడా లివర్ వ్యాధికి లక్షణాలుగా చెప్పుకోవచచు. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మూత్రం రంగులో మార్పు
మూత్రం రంగు సాధారణంగా నీళ్లలా కాకుండా ఎక్కువ పచ్చగా లేదా వేరే రంగులో గనక వస్తే లివర్‌కు సంబంధించిన వ్యాధిలా పరిగణించవచ్చు.
చర్మంపై దద్దుర్లు
చర్మంపై దద్దురు రావడానికి చాలా కారణాలుంటాయ్. నీళ్లు పడకపోయినా, లేక డస్ట్ ఎలర్జీ వల్ల కూడా చర్మంపై దద్దువస్తాయ్. అయితే ఈ లక్షణం కూడా లివర్ వ్యాధిని సూచిస్తుంది. ఈ ఒక్కలక్షణమే కాకుండా పై ఉన్న లక్షణాలతో పాటు చర్మంపై దద్దుర్లు వస్తే కూడా లివర్ వ్యాధిగా పరిగణించవచ్చు.
హార్మోనల్ ఇంబాలెన్స్
లివర్ దెబ్బతింటే హార్మోనల్ స్థాయిల్లో కూడా మార్పులు వస్తాయ్. అప్పుడు జుట్టు రాలడం, మొటిమలు రావడం జరుగుతుంది. శరీరంలో హార్మోన్లు పెరగడం వల్ల ఇలా జరుగుతుంది.
తలనొప్పి
తలనొప్పి రావడం సహజం కానీ లివర్ వ్యాధి సోకిన వారిలో క్రోనిక్ తలనొప్పి వస్తుంది. సాధారణ తలనొప్పి ఒకటి, రెండు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఈ కేసులో తరచుగా తలనొప్పి వస్తుందంటే అది లివర్‌కు సంబంధించిన సమస్యగా చూడవచ్చు.
మలబద్దకం
లివర్ దెబ్బతిన్నప్పుడు అది సరిగ్గా పనిచేయని సందర్భంలో జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. తిన్న ఆహారం కూడా కడుపులో సరిగ్గా జీర్ణం కాక మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ చిట్కాలు పాటించినా కూడా మలబద్దకం తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications