Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
తామరపువ్వును పూజలో వాడుతాము. కానీ తామర పువ్వును ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద పండితులతో పాటు వైద్యులు కూడా సూచిస్తుస్నారు. భారతదేశంలో 7వేల సంవత్సరాల నుంచి ఈ తామరపువ్వును వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఇక చైనా ప్రభుత్వం, తామరపువ్వుకు ఆహారంగా, ఓషదంగా గుర్తింపునిచ్చి మార్కెట్లలో అమ్మడానికి అనుమతిస్తోంది. హిందూ దేవీ లక్ష్మీదేవి నివసించేది తామర పువ్వులోనే. బురదనీటిలో తామరపువ్వు పెరిగినా ఎన్నో ఓషధ గుణాలు వాటి విత్తనాల్లో ఉన్నాయ్.
రాత్రి పడుకునే సమయంలో పాలల్లో తామరపువ్వు విత్తనాలు వేసి కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల అనేక లాభాలున్నాయ్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు సమస్య
శరీరంలో కొవ్వు పెరగడాన్ని నిరోధిస్తుంది. 2011లో జరిగిన పరిశోధనల ప్రకారం ఇది రుజువైనట్లు ఆధారాలు చూపించారు. తామర విత్తనాల్లో ఉండే పాలిఫెనాల్స్‌కు ఈ గుణం ఉన్నట్లు కొనుగ్గొన్నారు.
డిప్రెషన్
ఇప్పుడున్న ఆరోగ్యసమస్యల్లో డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉన్నాయ్. తామర విత్తనాల్లో డిప్రెషన్‌ను తగ్గించే సాపొనిన్స్, ఫ్లావనాయిడ్లు ఉన్నాయంటున్నారు. ఇందులో నిద్రను సరిగ్గా బ్యాలెన్స్ చేసే ఆల్కలాయిడ్లు కూడా ఉన్నట్లు తేలింది.
పెయిన్ కిల్లర్
తామర విత్తనాల్లో ఉండే ఫ్లావనాయిడ్లు పెయిన్ కిల్లర్‌గా కూడా పనిచేస్తాయటి. ఈ విషయాన్ని 2009లో జరిపిన పరిశోధనలో కనుగ్గొన్నారు.

గుండె వ్యాధులు
యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉండడంతో శరీరంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాతో సమర్ధవంతంగా పోరాడుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం బారినపడకుండా చేసే శక్తి తామర విత్తనాలకు ఉందని చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పాలల్లో ఉండే క్యాల్షియం, ప్రొటీన్లు, తామర విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కలిస్తే ఇక రోగనిరోధకశక్తి బలంగా ఉంటదనడంలో అనుమానం లేదు.
ఫైబర్
తామర విత్తనాల్లో జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ ఉంటుంది. పాలల్లో కలిపి తీసుకుంటే మలబద్దకం, యాసిడిటీ లాంటి సమస్యలు దూరమౌతాయ్.
పాలల్లో క్యాల్షియం ఉంటుందన్న విషయం తెలిసిందే. తామర విత్తనాలలో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇక రెండూ కలిపి తీసుకుంటే యముకలకు సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తదని అంటున్నారు.
కార్బోహైడ్రేట్లు
తామర విత్తనాల్లో కార్బొహైడ్రేట్లు మెండుగా ఉంటాయ్. విలువైన పోషకాలతో పాటు ఇవి కూడా ఉండడంతో పాలల్లో కలిపి తీసుకుంటే అప్పటికప్పుడే శరీరం అలసట నుంచి దూరమై యాక్టివ్ అవుతుంది.
ముందు జాత్రత్తలు
తామరపువ్వు విత్తనాలను పాలల్లో కలిపి తీసుకునే ముందు వైద్యులను ఒకసారి సంప్రదించాల్సిన అవసరం ఉంది. విత్తనాలకు వేడి ఎక్కువగా పుట్టించే లక్షణం ఉండడం వల్ల గుండె సంబంధిత రోగులు, గర్భిణులు, పిల్లలు వైద్యుల సలహా తీసుకున్న తరువాత వీటిని తినాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications