Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Water melon benefits : పుచ్చకాయతో ఆస్తమాకు చెక్..! ఇంకా ఎన్నో ప్రయోజనాలు..
మండిపోయే ఎండలే పుచ్చకాయను తింటే అప్పుడు కలిగే అనుభూతి ఎన్ని కూల్‌డ్రింకులు తాగినా రాదు. శివరాత్రి పండగ రోజు ఈ పండు ప్రాముఖ్యత గురించి చెప్పనవసరం లేదు. ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయ్. రోజూ కొన్ని పుచ్చకాయ ముక్కలు తింటే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. వేల యేళ్ల నుంచి పుచ్చకాయను ప్రాముఖ్యం ఉంది. ఆగస్టు 3ని పుచ్చకాయ రోజుగా జరుపుకుంటున్నాం. పుచ్చకాయలో ఉండే పోషకాలు, పుచ్చకాయను తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
పుచ్చకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
శరీరం హైడ్రేట్ అవుతుంది..
పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. ఎండాకాలంలో దీనిని తినడం వల్ల శరీరానికి అవసరమైనంత నీరు లభిస్తుంది. రోజూ తింటే డీహైడ్రేట్‌కు గురికాకుండా ఉంటాం. కొంతమందికి గొంతు త్వరగా ఎండిపోతుంది. పుచ్చకాయ తినడం వల్ల అలాంటి సమస్యలు ఎదురుకావు.

బురువు నియంత్రణ
పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఎంత తిన్నప్పటికీ బరువు పెరగకుండా ఉంటారు. పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల అటు పోషకాలు మెండుగా అవడంతో పాటు ఇటు నీరు ఎక్కువగా ఉండడం వల్ల బరువుపెరిగే అవకాశం ఉండదు. పైగా శరీరం హైడ్రేట్ అవుతుంది.
హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది
పుచ్చకాయలో ఉండే లైకోపీన్ పుచ్చకాయను ఎర్రగా మారుస్తుంది. టమాట ఎర్రగా ఉండడానికి కూడా ఈ లైపోనీనే కారణం. ఈ లైపోనిన్‌కు కొలెస్ట్రాల్‌ను తగ్గించే సామర్ద్యం ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను పుచ్చకాయ అదుపులో వుంచడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయ్.
ఉబ్బసం, ఆస్తమా
పుచ్చకాయలో 40 శాతం వరకు వైటమిన్ సి ఉంటుంది. ఉబ్బసాన్ని, ఆస్థమాను తగ్గించే శక్తి ఈ వైటమిన్ సిలో ఉంటుంది. ప్రతీరోజు పుచ్చకాయ తింటే ఆస్తమా, ఉబ్బసం తీవ్రత తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
నరాల బలహీనతు పొటాషియం
శరీరంలో పొటాషియం తక్కువగా ఉంటే తిమ్మర్లు ఎక్కువగా వస్తాయ్. నరాలు కూడా బలహీనంగా మారిపోతాయ్. పుచ్చకాయలో ఈ పొటాషియం పోషకాలు మెండుగా ఉంటాయ్. రోజూ ఒక గ్లాసు పుచ్చకాయ జ్యూస్ తాగితే మీ శరీరంలో తిమ్మిర్లు రాకుండా చేస్తుంది.
వడదెబ్బ నుంచి రక్షణ
పుచ్చకాయలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే హీట్‌స్ట్రోక్‌కు గురౌతాము. కాబట్టి ప్రతీ రోజు కొంత పుచ్చకాయను ఖచ్ఛితంగా తినాలి మిమ్మల్ని మీరు వడ దెబ్బ్ నుంచి కాపాడుతోంది.
టాక్సిన్సతో పోరాటం
పుచ్చకాయలో క్యాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయ్. ఇవి శరీరంలోని టాక్సిన్స్ తో పోరాడి శరీరం బయటకు పంపించివేయబడుతంది. ఒక వేల టాక్సిన్స్ పరిగితే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో కిడ్నీలు కూడా దెబ్బతింటాయ్. కాబట్టి ప్రతీ రోజూ పుచ్చకాయ జ్యున్ ఎలాగైనా తాగంది.
జీర్ణక్రియకు సహాయం
పుచ్చకాయలో అటు నీరు ఇటు ఫైబర్ రెండూ ఉంటాయ్. కడుపులో జీర్ణ్రియ సరిగ్గా జరగాలంటే నీరు, ఫైబర్ చాలా అవసరం. రోజూ పుచ్చకాయను తింటే మలబద్దకం సమస్య ఉండదని వైద్యులే చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications