Latest Updates
-
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
యాలాకుల గోరు వెచ్చని నీళ్లు తాగితే.. పురుషుల్లో ఆ సమస్యకు చెక్ పెట్టినట్లే..!
యాలాకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయని చాలా పరిశోధనలు నిరూపించాయ్. అందుకే ఆహారంలో కూడా వీటిని జోడించడం ఉపయోగకరమే. ఇది మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఛాతిలో మంట, పేగు సమస్యలు, మలబద్దకం, లివర్ సమస్యలను నివారించడంలో దోహదపడుతుంది.
మన దేశంలో కొన్ని కూరలు చేసుకునేటప్పుడు యాలాకులు వేసుకోవడం ఎన్నో యేళ్ల నుంచి ఆచారంగా వస్తూ వుంది. ఇది కూడా మన భారతీయుల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు.

ప్రతీ రోజూ చేసుకునే వంటకాల్లో యాలాకులను తప్పకుండా ఉపయోగించాలి. యాలాకుల్లో మినరల్స్, పొటాషియం, క్యాల్షియం, మ్యాంగనీస్‌లు అధికంగా వున్నాయ్. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా వున్నాయ్. యాలాకులు నాడీ వ్యవస్థ యోక్క పనితీరును మెరుగుపరుస్తుంది. యాలాకులను నీళ్లల్లో మరిగించి తాగితే చాలా ఉపయోగాలు వున్నాయ్.
యాలాకులను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. రోజూ దీన్ని తాగడం వల్ల గ్యాస్, మలబద్దకం, వికారం, వాంతులు, ఆకలి లాంటి సమస్యలు తలెత్తకుండా వుంటుంది. కిడ్నీలోని వ్యర్ధాలను కూడా ఇది తొలగిస్తుంది. గోరువెచ్చని కార్డమం నీళ్లను తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. యూరినరీ ట్రాక్ట్‌ను క్లీన్ చేస్తుంది.
రోజూ యాలాకులు మరిగించిన నీటిని తాగడం వల్ల డిప్రెషన్‌కు వ్యతిరేకంగా కూడా పోరాడుతుంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంగా కూడా పనిచేస్తుంది. మౌత్ అల్సర్, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది.

క్యాన్సర్ సెల్స్ పెరగకుండా కూడా యాలాకులు దోహదం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. యాలాకుల్లో ఫైబర్, బ్యురాటిక్ గుణాలు వుండడం వల్ల బ్లడ్ ప్రెజర్‌ను కూడా అదుపులో పెట్టడంలో బాగా సహాయపడుతుంది. శరీరంలో వివిధ వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను కూడా యాలాకులు నాశనం చేస్తాయ్.
యాలాకుల్లో వుండే విలువైన ఆయిల్ గుణాల వల్ల వైరస్, బ్యాక్టీరియా శరీరాన్ని తాకకుండా చేస్తాయ్.
రాత్రి పడుకునే మందు ఒకటి లేదా రెండు యాలాకు తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి బరువు తగ్గేలా చేస్తుంది. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. పడుకునే ముందు ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని అంటున్నారు.
చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యంగా వుంచుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, ఎత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. నిద్రలో గురక కొట్టేవారు వుంటే ఆది కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
యాలాకుల నీళ్లు పరిగడపున తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్యను దూరం చేస్తుందన్న విషయం కూడా తెలిసిందే. నోటి దుర్వాసనను కూడా యాలాకులు అరికడతాయ్.
ఆడవాళ్లల్లో పీరియడ సమయంలో వచ్చే నొప్పిని కూడా యాలాకులు తగ్గిస్తాయ్. హార్మోన్లో సమతుల్యతను ఏర్పరుస్తుంది. హైపర్ టెన్షన్‌ను తగ్గిస్తుంది. ఆస్తమా లాంటి సమస్యల నుంచి కూడా యాలాకులు మనల్ని కాపాడతాయ్. గొంతులో ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే యాలాకుల నీళ్లను పుక్కిలించడం, గార్గిలింగ్ చేయడం వల్ల సమస్య తగ్గే అవకాశం వుంది.
రక్తంలో చెక్కర స్థాయిని కూడా కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ వున్నవారికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్న రోజులు తాగడం వల్ల ఫలితాలను, శరీరంలో వచ్చే మార్పులను స్పష్టంగా తెలుసుకోవచ్చు.
పురుషుల్లో అంగం గట్టిపడ్డానికి కూడా యాలాకుల గోరువెచ్చని నీళ్లు చాలా దోహదపడతాయ్. శృంగారంలో మరింత ఉత్సాహంగా పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











