Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
Benefits of Milk : రోజుకు రెండు గ్లాసుల పాలు.. పోషకాలన్నీ అందుతాయ్..
పాలు చిన్నపిల్లలే కాదు పెద్దలు కూడా ప్రతీ రోజూ తాగాలి. ఎన్నో పోషకాలు మనకు పాలల్లో ఉంటాయ్. రోజుకు కనీసం ఓ కప్పు పాలు తాగితే శరీరానికి కావాల్సిన క్యాల్షియం, ఇతర పోషకాలు అందుతాయ్. గర్భిణులు కూడా రోజు పాలు తాగడం వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదలకు దోహదం చేస్తుంది. పాలల్లో ఎన్ని పోషకాలు ఉన్నాయ్, ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలతో కలిగే ప్రయోజనాలు
పాలల్లో కేవలం క్యాల్షియం మాత్రమే కాదు, క్యాలరీలు, కొవ్వు, ప్రొటీన్లు, లైసిన, అమైనో ఆమ్లాలు కూడా ఉండడం విశషం.కేవలం 150 మిల్లీలీటర్ల పాల్లో 5 గ్రాముల ప్రొటీన్ ఉంటుందంటే పాలల్లో ఉన్న శక్తి అర్థం చేసుకోవచ్చు.
పాలల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫ్లేవనైడ్లు రక్తపోటును తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పాలల్లో కొవ్వు కూా ఉండడం వల్ల ఈ విషయంలో వారు వైద్యులను సంప్రదించాల్సిన అవసరముంది.

పళ్లపై ఎనామిల్ అనబడే గట్టి పొర ఉంటుంది. పాలు ఈ ఎనిమిల్‌ను గట్టిపరుస్తుంది. దీంతో పళ్లు పాడుుకాకుండా బలంగా ఉంటుంది.
పాలల్లో ఉండే ఇమ్యూనో గ్లోబులిన్లు రోగనిరోధకశక్తిని పొంచుతాయ్. జున్ను పాలల్లో ఈ గ్లోబులిన్లు అధికంగా ఉంటాయ్.
మీ చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా పాలతో మెరుగుపరుచుకోవచ్చు. పాలలో ఉండే ప్రొటీన్లు, వైటమిన్ ఏ, జింక్ పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది.
ఎండాకాలంలో మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా వుంచుతుంది. ఉదయం ఒక గ్లాసు పాలు తాగితే అందులో ఉండే పొటాషియం, సోడియం, మెగ్నీషియం మీకు ఇన్స్'టాంట్ ఎనర్జీని అందిస్తుంది.
గర్భిణుల కడుపులోని బిడ్డ బాగా ఎదగాలంటే వైటమిన్లతో పాటు ఐయోడిన్ చాలా అవసరం. పాలల్లో ఈ ఐయోడిన్ పుష్కలంగా ఉండడం వల్ల గర్భిణులు రోజూ పాలను తప్పనిసరిగా తాగాలి.
పాలల్లో మొత్తం 13 పోషకాలుంటాయ్. మీరు రోజూ పాలు తాగుతున్నారంటే మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలనూ ఇస్తున్నట్లు అనుకోవచ్చు. అన్ని పోషకాల్లో క్యాల్షియం మెండుగా ఉంటుంది. పుట్టుకతోనే యముకలు బలహీనంగా ఉన్న పిల్లలకు రోజూ రెండు గ్లాసుల పాలు వారి యుముకలను బలంగా తయారు చేస్తుంది.
మానసిక ఆరోగ్యానికి కూడా పాలు చాలా మంచివని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ బి జీర్ణసమస్యను పరిష్కరించడమే కాకుండా మెదడును చురుగ్గా వుంచుతుంది.
పడుకునే ముందు ఓ ఫుల్ గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ శరీరంలోని మెలటొనిన్, సెరటొనిన్ హార్మోన్లను రేకెత్తించి నిద్రపుచ్చేలా చేస్తుంది.
రోజుకు మూడు సార్లు పాలు తాగితే ఎటువంటి అనారోగ్యం మీ దరిచేరదు. చిన్న వయసు నుంచే పిల్లలకు పాలతాగడాన్ని అలవాటు చేయాలి. లేదంటే కొందరికి తరువాత పాలంటే అలెర్జీలా అనిపిస్తుంది. పాలల్లో ఇన్ని పోషకాలు ఉన్నా కూడా ఇప్పటికీ చాలా మంది పాలంటే అసహ్యించుకునేవారున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications