Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Drinking Hot Water : చిటికెలో మానసిక ఒత్తిడి దూరం.. గోరు వెచ్చని నీటితో ఎన్నో ప్రయోజనాలు..!
శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఎక్కువ నీరు తాగాలి. అయితే చల్ల నీరు తాగినా, గోరువెచ్చని నీరు తాగినా ఒకే ఫలితం ఉండదు. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కొన్ని ఎక్కువ లాభాలు ఉన్నాయ్. ఫ్రిజ్‌లోని చల్లటి నీరు ఎక్కువగా తాగితే లేని అనారోగ్య సమస్యలు వస్తాయ్. చల్లటి నీరు గొంతుమంట, గుండెసమస్యలు, జీర్ణసమస్యలకు దారితీస్తుంది. దీనికి బదులుగా గోరువెచ్చని నీటిని తాగమని వైద్యులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
జీర్ణక్రియ
గోరువెచ్చని నీరుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జర్ణప్రక్రియ జరుగుతుండగా గోరువెచ్చని నీరు కడుపులోకి వెళ్లి ఉష్ణోగ్రతను అలాగే వుంచడం లేదా కొంచం పెంచడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడుుతుంది. అరగడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆహారాన్ని కూడా ఈ గోరువెచ్చని నీరు సులభంగా అరగేలా చేస్తాంది.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
మెదుడు బాగా పనిచేయాలంటే నీరు తప్పనిసరిగా తాగాలని పరిశోధనల్లో చాలా సార్లు వ్యక్తమైంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి నీరు దోహదపడుతుంది. 2019లో జరిపిన ఓ పరిశోధనల్లో నీరు ఎక్కువ తాగిన వారిని, నీరు తక్కువగా తాగిన వారిని విభజించి వారిపై పరిశోధనలు చేస్తే నీరు తాగిన వారే ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్నట్లు కనుగ్గొన్నారు.
మలబద్దకం
నీరు ఎక్కువగా తాగడం వల్ల మలబద్దకం సమస్య కూడా దూరమౌతుంది. మలబద్దకానికి ముఖ్య సమస్య డీహైడ్రేషన్. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండడం గోరువెచ్చని నీరు జీర్ణక్రియకు మరింత సహాపడ్డం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయటపడవచ్చు.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
గోరువెచ్చని నీటితో స్నానం చేసినా, గోరువెచ్చని నీరును తాగినా శరీరంలోని రక్తనాళాలు విచ్చుకొని మరింత యాక్టివ్‌గా రక్తప్రరణ ప్రక్రియను చేపడతాయ్. అందువల్ల గోరువెచ్చని నీటినితో స్నానం చేసినా, గోరువెచ్చని నీటిని తాగినా ఎప్పుడూ యాక్టివ్‌గా ఫీల్ అవుతాం. ఈ విషయాన్ని పరిశోధనల ద్వారా కూడా బయటపెట్టారు.
వత్తిడిని తగ్గిస్తుంది
2014లో జరిపిన పరిశోధనల ప్రకారం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని కనుగ్గొన్నారు. వత్తిడికి గురైన వారికి గోరువెచ్చని నీటిని తాగడానికి ఇచ్చిన సమయంలో వారి బ్లడ్ ప్రెజర్, మూడ్, ఎమోషన్స్‌లో మార్పు వచ్చినట్లు పరిశోధనల్లో తేలింది.
ఎక్కువ వేడి నీరు తాగడం హానికరం
గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. వేడి ఎక్కువగా ఉన్న నీటిని తాగితే నాలుక దెబ్బతినడమే కాకుండా కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అవయవాలన్నీ కూడా దెబ్బతింటాయ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడినీటిని త్రాగవద్దు. ఏదైనా మితంగా ఉంటేనే ఆరోగ్యం, నీరు ఎక్కువ వేడి ఉన్నా, ఎక్కువ చల్లగా ఉన్నా హానికరమే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications