Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
కొబ్బరి పువ్వు తింటే ఇన్ని ఆరోగ్యప్రయోజనాలా..!! బరువు కూడా తగ్గిస్తుంది ఇంకా ఎన్నో..!!
కొబ్బరి పువ్వు, ఆహారపరంగా సూపర్ ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. మనం గుడిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి మనకు ఈ కొబ్బరి పువ్వు కనిపిస్తుంది. కానీ కొబ్బరి పువ్వును ఉన్న కొబ్బరికాయలను మార్కెట్లో ప్రత్యేకంగా అమ్ముతారు. ఈ కొబ్బరి పువ్వును కూడా ప్రత్యేకంగా అమ్మడం జరుగుతుంది. అయితే భారత దేశంలో కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మనకు కొబ్బరి పువ్వు ఎక్కువగా కనిపిస్తుంది. కేరళలో కొబ్బరి పువ్వు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి పంటలు ఎక్కువగా ఎక్కడ ఉన్నా అక్కడ కొబ్బరి పువ్వు మనకు కనిపిస్తుంది.

మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొబ్బరి పువ్వును పండిస్తారు. తూర్పు గోదావారి, విశాఖ పట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ కొబ్బరి పంటలను మనం ఎక్కువగా చూడవచ్చు. అయితే ఈ కొబ్బరి పువ్వులో ఎన్నో పోషకాలుంటాయ్, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందిస్తుంది. దీనిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
కొబ్బరి పువ్వులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు కలిగి ఉంటాయ్. ముఖ్యంగా విటమిన్ C, విటమిన్ B1, విటమిన్ B5, విటమిన్ B6, విటమిన్ E లను సమృద్ధిగా కలిగి ఉంటుంది. అలాగే పొటాషియం, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయ్.
కొబ్బరి పువ్వులో ఉన్న మధ్యమ గొలుసు ట్రైగ్లిసెరైడ్లు (MCTs) ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణించబడతాయి. ఇవి శరీరంలో చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, మెటబాలిజాన్ని వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది. కొబ్బరి పువ్వులో ఉండే లౌరిక్ ఆమ్లం శరీరానికి యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను అందిస్తుంది. ఇది ఇమ్మ్యూనిటీని పెంపొందించడంలో, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి పువ్వులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, మలబద్ధకం సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన సులభంగా జీర్ణమవుతుంది.
హృదయ ఆరోగ్యం:
కొబ్బరి పువ్వులో ఉన్న MCTలు గుండెకు మేలు చేస్తాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. ఇవి ఇన్‌స్టాంట్ ఎనర్జీని అందించి, ఆకలి నియంత్రణలో సహాయపడతాయి.
కొబ్బరి పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది చర్మంలో తేమను నిలుపుకోవడానికి, వృద్ధాప్య ఛాయలను, ముడతలను తగ్గించడానికి, ఇతర చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి పువ్వులో ఉండే కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో, ఘ్నాపక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. న్యూరో డిజెనరేటివ్ వ్యాధుల బారిన పడకుండా చేస్తాయ్. కొబ్బరి పువ్వును వర్కౌట్ చేసే ముందు తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. దీని వల్ల వర్కౌట్ మరింత బాగా చేయడానికి వీలు కలుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications