Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ పనులు చేయడం వల్లే పురుషుల్లో సంతానలేమి సమస్యలు..!
ప్రస్తుతం చాలా మంది పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతోంది. దీని వల్ల వివాహం తరువాత వాళ్లు సంతానం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పురుషుల్లో వీర్య కణాలు 60 మిలియన్ కౌంట్ కంటే కూడా ఎక్కువగా వుండాలి. చాలా మంది మగవారిలో 15 మిలియన్ల వీర్య కణాలు మాత్రమే వుంటున్నాయ్. ఇలా తగ్గిపోవడానికి చాలా కారణాలు వున్నాయ్.
నియమాలను, హద్దులను దాటిని పురుషుల అలవాట్లూ, జీవిన విధానం వుండడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. యువత ముందు నుంచే వీర్య కణాలు దేవివల్ల తగ్గుతాయనే విషయాన్ని తెలుసుకొని దానిపైన శ్రద్ధ పెట్టడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొనగలుగుతారు.

సిగరెట్ తాగడం, వీర్య కణాల లోపాలనికి చాలా దగ్గరి సంబంధం వుంది. పొగ తాగడం వల్ల వీర్య కణాల డీఎన్‌ఏ డ్యామేజ్ అవుతుంది. మానసిక ఒత్తిడి కూడా పురుషుల్లో సంతానలేమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. స్ట్రెస్ హార్మోన్ల వల్ల వీర్యాన్ని విడుదల చేసే కణాలు డ్యామేజ్ అవుతాయ్.
కొంతమంది మగవారిలో మేల్ టెస్టోస్టీరోన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీని వల్ల వీర్య కణాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. వీర్యకణాలకు సంబంధించిన ట్యూబులు కూడా డ్యామేజ్ అవడం వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. మగవారిలో ఈస్ట్రోజెన్, ఆడవారిలో టెస్టోస్టిరోన్ పెరిగిపోవడం వల్ల కూడా మగవారిలో వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
శరీరంలో కొవ్వు పెరగడం వల్ల హార్మోన్ స్థాయి తగ్గడం, వీర్య కణాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. డయాబెటీస్ వల్ల వీర్యకణాల డీఎన్‌ఏ డ్యామేజ్ అవుతుంది. రేడియేషన్ వల్ల కూడా వీర్య కణాల డ్యామేజ్ అవుతాయ్.

కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రావడం వల్ల కూడా వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. మద్యం ఎక్కువగా తాగడం వల్ల కూడా పురుషుల్లో సంతానలేమికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. దీని వల్ల స్పర్మ్ సెల్ వాల్ డ్యామేజ్ అయి వీర్య కణాల మొబిలిటీ తగ్గుతంది.
ల్యాప్‌టాప్‌లను వళ్లో పెట్టుకొని పనిచేయడం, ల్యాప్‌టాప్‌కు సంబంధించిన వేడి గాలి టెస్టికల్స్‌కు తాకడం వల్ల కూడా వీర్య కణాలు డ్యామేజ్ అవుతాయ్. టైట్ జీన్స్, టైట్ అండర్‌వేర్‌లు వేసుకోవడం వల్ల కూడా వీర్య కణాల ఉత్తత్తి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పైన చెప్పిన వాటిపై శ్రద్ధ పెడితే మూడు నెలల సమయంలోనే వీర్య కణాలను తిరిగి ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రొటీన్లు ఎక్కువగా వున్న ఆహారం తీసుకోవడం వల్ల వీర్య కణాల ఉత్పత్తి బాగా జరుగుతుంది. సాయంత్రం సమయంలో డ్రైఫ్రూట్స్, మొలకలు తినడం వల్ల కూడా మంచి ఫలితం వుంటుంది.
మంచి ఆహార పదార్ధాలను, మంచి లైఫ్‌స్టైల్‌ను ఫాలో అవడం వల్ల వీర్యకణాల సంఖ్యను మళ్లీ 60 మిలియన్లకు చేరుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications