Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
మహిళల్లో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి ప్రధాన కారణాలివే..?
ఆడవారికి జుట్టు ఎక్కువగా ఉంటేనే అందం. మగవారికి జుట్టు తక్కువగా ఉండడం, ఆడవారికి ఎక్కువగా ఉండడం సహజమైన విషయం. ఈమధ్య కొంతమంది ఆడవాళ్లు మగవారిలా జుట్టును కత్తిరించుకుంటున్నారు. అది ఫ్యాషన్ అయినప్పటికీ జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉంటేనే ఆడవాళ్లు అందంగా కనబడతారు. మీ మధ్య చాలామంది ఆడవారిలో జుట్టు సన్నబడటం ఊడిపోవడం జరుగుతుంది. దీనికి చాలా కారణాలు వున్నాయ్.
ఆడవారిలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు
ఆడవారిలో జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసుకోవాలంటే కచ్చితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి. రిపోర్టులో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని కనుక తెలితే. అది కూడా జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణంగా అర్థం చేసుకోవాలి. రక్తహీనత ఉంటే జుట్టు కూడా బలహీనంగా ఉండి రాలిపోతుంది. కాబట్టి హేమోగ్లోబిన్ స్థాయిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.

పీరియడ్స్ రెగ్యులర్ గా వున్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గనుక ఉంటే పీసీఓడి సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉంటే కూడా జుట్టు రాలే అవకాశం ఉంటుంది.
మారుతున్న జీవన విధానం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయ్. డ్రైవింగ్ చేసే సమయంలో తలకు హెల్మెట్ పెట్టుకుంటారు. దీనివల్ల చెమట వచ్చి చుండ్రు వల్ల తలలో వెంట్రుకలు రాలిపోతుంటాయ్. హెల్మెట్ ఖాచితంగా పెట్టుకోవాలి కాబట్టి హెల్మెట్ పెట్టుకునే ముందు తల పై కర్చీఫ్ ను ధరించాలి. మధ్య మధ్యలో తలపై చెమటను తూడుచుకుంటూ ఉండాలి అప్పుడు వెంట్రుకలు రాలకుండా ఉంటాయ్.
హార్మోన్లో మార్పులు వచ్చినా జుట్టు రాలే సమస్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో పురుష హార్మోన్లు ఎక్కువైతే జుట్టు రాలే అవకాశం ఉందంటున్నారు. మానసిక వత్తిడి ఎక్కువైతే కూడా జుట్టు రాలుతుందని చెబుతున్నారు.

కొన్ని రకాల మందులను వాడడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుందని అంటున్నారు. బీపీ కి సంబంధించిన మందులు ఎక్కువగా వేసుకుంటే జుట్టు రాలిపోతుందని వైద్యులు అంటున్నారు. జిమ్ ఎక్కువగా చేసి శరీరం పై ఎక్కువ వత్తిడి తేవడం వళ్ళ కూడా జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు.
డెలివరీ అయిన వాళల్లో, సర్జరీ అయినా జుట్టు రాలుతుంది. అబార్షన్ చేయించుకుంటే కూడా జుట్టు రాలుతుందని వైద్యులు చెబుతున్నారు. డెలివరీ అయిన మూడు నెలల తరువాత శరీరంలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తక్కువగా అవుతాయ్. దీని వల్ల వెంట్రుకలు ఒక్కసారిగి రాలిపోతాయ్. మళ్లీ 9 నెలల తరువాత ఈస్ట్రోజెన్ లెవెల్స్ అవసరమైన లెవెల్స్ లోకి రాకవడం వల్ల మళ్లీ వెంట్రుకలు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతాయ్.
తినే ఆహారంలో జుట్టు బలపడ్డానికి అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుందని అంటున్నారు. డయాబెటిస్ కారణంగా కూడా వెంట్రుకలు ఊడిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
కొంతమంది బ్యూటీ పార్లర్లో తరచుగా హేయిర్ ట్రీట్మెంట్‌ను చేయించుకుంటారు. తలకు మసాజ్‌ను క్రమం తప్పకుండా చేయించుకుంటారు. ఇలా చేయడం వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతాయని అంటున్నారు.
వయసు పెరుగుతున్నా కొద్దీ వెంట్రుకలు రాలిపోతూ వుంటాయ్. వయసు పెరిగినా వెంట్రుకలు రాలిపోకుండా వుండాలంటే డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. కొందరిలో వయసు పెరిగినా జుట్టు ఒత్తుగా వుంటుంది. దీనికి జెనెటిక్ కారణాలు కూడా వుంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications