Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
బ్రెయిన్ స్ట్రోక్‌ను ముందుగానే ఇలా ఫాస్ట్‌గా గుర్తించండి..!
ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరికి స్ట్రోక్ వస్తుందో ఖచ్ఛితంగా తెలుసుకోలేము. గుండెపోట్లు ఇప్పుడు యువకుల్లో కూడా సాధారణమైపోయింది. జ్వరంలా గుండెపోటు దాదాపు చాలా మందికి వచ్చి వెళ్తుంది. అయితే ఈ హార్ట్ స్ట్రోకుల, బ్రెయన్ స్ట్రోకులను రాకుండా ముందే వీటి లక్షణాలను తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీ సంవత్సరం కొన్ని లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. మెదడుకు రక్తప్రసరణ జరగనప్పుడు లేదా నిలిచిపోయినప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని ఎన్నో రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. వీటిని ముందుగానే గుర్తించడం ఎంతో అవసరం
శరీరం మొత్తం బలహీనంగా
బ్రెయిన్ స్ట్రోక్ గానీ లేదా హార్ట్ స్ట్రోక్.. ఈ స్ట్రోకులు వచ్చే ముందు శరీరం మొత్తం ఒక్కసారిగా బలహీనంగా మారుతుంది. కొంతమందికి శరీరం మొత్తం తమ్మిరి వచ్చినట్లు అనిపిస్తుంది.
అయోమయం
మాట్లాడటంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మాటలు గతంలోలాగా సాధారణంగా మాట్లాడలేరు. పదాలను కూడా సరిగ్గా ఉచ్ఛరించలేరు. ఎదుటివారు మాట్లాడిన విషయాలను కూడా సరిగ్గా అర్ధం చేసుకునే స్థితిలో ఉండరు.
మెదడుకు రక్తప్రసరణ కొంత ఆగిపోవడం వల్ల చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా సరిగ్గా అర్ధం చేసుకోలేరు. సంభాషించే సమయంలో మాట్లాడటానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. కన్ఫ్యూజన్‌కు ఎక్కువగా గురౌతారు.

చూపు మందగించడం
చూపు మందగించే అవకాశం ఉంది. ఒక కన్ను లేదా రెండు కళ్లు దెబ్బతినే పరిస్తితి రావచ్చు. దగ్గరున్న వస్తువులను కూడా సరిగ్గా చూసే అవకాశం లేదు.
మీరు గతంలో జీవితంలో ఎప్పుడూ అనుభవించలేని తలనొప్పికి గురికావచ్చు. ఈ పరిస్థితిలో స్పృహ కూడా కోల్పోయే అవకాశముంది.
కాళ్లు
స్ట్రోక్‌కి గురైనప్పుడు సరిగ్గా నిలబడి తమను తాము బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. నడవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. తమ శరీరంపైనే అదుపును కోల్పోతారు.
ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. తీవ్రమైన అలసటకు గురౌతారు. ఎంత విశ్రాంతి తీసుకున్నా, శరీరాన్ని యాక్టివ్ చేసే గ్లూకోజ్ ఉన్న ఎన్ని పానియాలు తాగినా అలసట అలాగే ఉంటుంది.
ముఖం
బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చేతులు, కాళ్లు, తలనొప్పితో పాటు ముఖంపైనా తీవ్ర ప్రభావం చూపెడుతుంది. స్ట్రోక్‌కి గురైనప్పుడు ఓ వైపు ముఖం సరిగ్గా పనిచేయని విధంగా అయిపోతుంది. నోరు కింద పడిపోయినట్లు కనిపిస్తుంది. పూర్తిగా నవ్వడానికి, హావభావాలు వ్యక్తపరచడానికి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మెదడు దెబ్బ తిని పనిచేయడం ఆగిపోయే పరిస్థితి కాబట్టి సృహను కోల్పోతారు. స్ట్రోక్ తీవ్రంగా ఉన్నప్పుడే సృహను కోల్పోయే అవకాశం ఉంది.
అవగాహన
హార్ట్ స్ట్రోక్ గురించి అవగాహన ఉంది కానీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ పై చాలా మందికి అవగాహన తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎవ్వరిలెోనైనా పై లక్షణాలు కనిపిస్తే వెంటనే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు అంచనాకు వచ్చి ముందు జాగ్రత్తలు వెంటనే పాటించాలి.
బ్రెయన్ స్ట్రోక్‌ను గుర్తించడాని Fast పద్ధతి
బ్రెయిన్ స్ట్రోక్‌ను త్వరగా గుర్తించడానికి వైద్య నిపుణులు పరిశోధకులు కొత్తగా ఓ సులువైన ఫార్ములాను అందరి ముందుంచారు. బ్రెయిన్ స్ట్రోక్ అని తెలుసుకోవడానికి FAST పద్దతిని ముందుచారు. ఆంగ్లంలో ఈ Fast పదంలోని అక్షరాలను గుర్తుపెట్టుకొని వ్యవహరించమని సూచించారు. Fastలో F అంటే face dropping (ముఖం పడిపోవడం) A అంటే Arm weakness (ముఖం పడిపోవడం) S Speech Difficulty (మాట్లాడటంలో సమస్య) T Time to call emergency (ఎమర్జెన్సీకి సమాచారం అందించే సమయం). ఈ టర్మినాలజీని గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తే బ్రెయన్ స్ట్రోక్ వచ్చిన వారిని వెంటనే కాపాడే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications