Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
దంపతులు మరింత దగ్గరవ్వాలంటే..ఈ ఆహారాలు తినాల్సిందే..!
వివాహం తరువాత భార్యా భర్తలు ఇద్దరూ సరైన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటే వారి శరీరరం ఆరోగ్యంగా వుండడమే కాదు, వారి వైవాహిక జీవితం, శృంగార జీవితం కూడా చాలా ఆరోగ్యకరంగా వుంటుంది. కొన్ని రకాలైన ఆహారాలను ఇద్దరూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇవి మార్కెట్లో చాలా సులభంగా అందుబాటులో వుంటాయ్. కోరికలను రేకెత్తించి దంపతులిద్దరూ సుఖంగా గడిపేలా కొన్ని ఆహార పదార్ధాల వివరాలను మీకు అందిస్తున్నాము. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇద్దరి మద్య ప్రేమ మరింత పెరుగుతుంది. వారి దాంపత్య జీవితం మరింత సుఖమయంగా గడుస్తుంది.
డార్క్ చాక్లెట్
చాక్లెట్లు ప్రతీ రోజూ తిన్నా ఎలాంటి నష్టం లేదు. రోజూ ఒక చిన్న చాక్లెట్, లేదంటే ఎక్‌లర్స్ లాంటి చాక్లెట్‌ను తినవచ్చు. డార్క్ చాక్లెట్‌లో ఫెనిలేథైలమైన్ వుంటుంది. ఇది తింటే అప్పటికప్పుడే హ్యాపీ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉద్రేకం పెరుగుతుంది.

అల్లం
అల్లంను దగ్గుకు లేదంటే వంటకు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వల్ల ఇతర చాలా ప్రయోజనాలు వున్నాయ్. భార్యా భర్తల మధ్య సంబంధాన్ని అల్లం మరింత మెరుగుపరుస్తుంది. రక్త సరైన విధంగా సరఫరా అయ్యేలా చూస్తుంది. ఇది సెక్స్ లైఫ్‌కు మాత్రమే కాదు, అల్లం గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వారానికి రెండు నుంచి మూడు స్పూన్ల అల్లం రసాన్ని తాగడం వల్ల గుండెపోటు రాకుండా వుంటుంది.
గుడ్లు
పురుషుల్లో అంగం గట్టిపడ్డానికి గుడ్లు బాగా దోహదపడతాయ్. గుడ్లల్లో యామినో యాసిడ్లు పుష్కలంగా వుంటాయ్. ఇది రక్తప్రసరణని మరింత మెరుగుపరుస్తుంది. ప్రతీ రోజు ఒక గుడ్డు తినడం వల్ల మంచి ఫలితాలు వుంటాయ్.
మాంసం
మాంసం కూడా దంపతుల సెక్స్ లైఫ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఇందులో వుండే కార్నిటైన్, ఆర్జినైన్ అనే యామినో యాసిడ్లు రక్త ప్రసరణని మరింత బాగు చేస్తుంది. సెక్స్ లైఫ్ బాగుండాలంటే ముందుగా శరీరంలో రక్తప్రసరణ బాగా జరగాలి.
అవకాడో
అవోకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వు పదార్ధాలు, విటమిన్ బీ6 వుంటాయ్. ఇవి వైవాహిక జీవితానికి కావాల్సిన శక్తిని ఇస్తాయ్. ఇందులో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా సెక్స్ లైఫ్‌కు బాగా ఉపయోగపడుతుంది.
స్ట్రా బెర్రీలు
స్ట్రా బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, వైటమిన్ సి పుష్కలంగా వుంటాయ్. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో చురుకుదనాన్ని పెంచుతుంది.
అంజీర్
అంజీర్ పళ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా వుంటాయ్. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కోరికలను కూడా పెంచుతుంది.
బాదాంపప్పులు
బాదాంపప్పుల్లో జింక్, సెలీనియం వుంటాయ్. ఈ రెండు కూడా పురుషుల్లో పురుషతత్వాన్ని మరింత ప్రేరేపించి మెరుగుపరుస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications