Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
వేసవిలో వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది? నిపుణులు ఏమంటున్నారంటే?
శీతాకాలంలో చాలా మంది ఆ చలి నుంచి రక్షణ పొందడానికి, ఆ చలిని తట్టుకోవడానికి ఎక్కువగా వేడినీటితో స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వలన చలి నుంచి ఉపశమనం పొందడంతో పాటు కొంత ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే మన మనస్సుకు కూడా చాలా తాజాదనాన్ని అందజేస్తుంది. అయితే ఇప్పుడు వేసవి వచ్చేసింది. బయట ఎండలు ఘోరంగా దంచి కొడుతున్నాయి. బయటికి వెళ్లాలంటే చాలు ఆ ఎండ దెబ్బకు ఎక్కడ చతికిల పెడతామో అని భయం వేస్తుంది. అయితే అంత వేడిలో కూడా కొంత వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. వేసవిలో కూడా వేడి నీటితో స్నానం చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చు. ఆ సమస్యలు ఏంటి? వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం వలన ఏం జరుగుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అధిక రక్తపోటు..
వేసవి కాలంలో వేడి నీటితో స్నానం చేయడం అధిక రక్తపోటు, హృదయ సమస్యలు, మరియు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తీసుకురావచ్చు. వేడి నీరు శరీరంలో రక్త ప్రసరణపై ప్రభావం చూపించి, రక్తపోటు స్థాయిలను పెంచుతుంది. ఇది రక్తపోటు సంబంధిత సమస్యలకు మరింత ప్రమాదం కలిగిస్తుంది.

అలాగే, వేసవిలో శరీరం ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలకు లోనవుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మరింత తీవ్రంగా ప్రభావితం అవుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని కెరాటిన్ కణాలు దెబ్బతింటాయి. తద్వారా చర్మం యొక్క సహజ నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారుతుంది. దాని మృదుత్వం తగ్గుతుంది, మరియు దురద వంటి సమస్యలు పెరుగుతాయి.
పొడిగా మారుతుంది..
అంతేకాక, వేడి నీటి స్నానాలు చర్మం మీద ప్రదర్శించే ప్రభావాల కంటే మరింత గందరగోళం కూడా సృష్టించవచ్చు. నీటిలో ఉండే క్లోరిన్ అనేది చర్మం యొక్క సహజ నూనె ఉత్పత్తికి అవరోధాన్ని కలిగిస్తుంది, దీంతో చర్మం మరింత పొడిగా, హాని చెందుతుంది. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కూడా వేడి నీటితో స్నానం చేయడం వల్ల ప్రమాదానికి గురవవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని హృదయనాళాల మీద తీవ్ర ప్రభావం పడుతుంది, ఇది హృదయ వ్యాధులకు ముప్పు కలిగిస్తుంది.
మరొక ముఖ్యమైన విషయం జుట్టు సంరక్షణ. వేసవి కాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ తేమ తగ్గిపోతుంది, దీనివల్ల జుట్టు నెరసిపోతుంది. అలాగే చాలా పొడిగా మారుతుంది. ఇది జుట్టుకు నష్టం కలిగించే ఆవకాశాన్ని పెంచుతుంది. వేసవిలో వేడి నీటితో తరచూ స్నానం చేయడం వల్ల చర్మ అలెర్జీలు, దురద, మొటిమలు, మరియు ఇతర చర్మ సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే వేసవిలో వేడి నీటితో స్నానం చేయకూడదని వైద్యులు, ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. వేసవిలో చల్లగా ఉన్న నీటితో స్నానం చేయడం చర్మానికి, జుట్టుకు మరియు మొత్తం ఆరోగ్యానికి మంచిదని, వేడి నీటితో స్నానం చేస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications