Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
మాంసంపై నిమ్మకాయ పిండుకొని తింటే ఏమవుతుందో తెలుసా? పండగకు ముందే తెలుసుకోండి
మన దేశంలో నాన్‌వెజ్ ప్రియులు చాలా ఎక్కువ. శాఖాహారం తినేవారి కంటే మాంసాహారం తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నాన్‌వెజ్ తినాలంటే సుమారు 99 శాతం మంది కచ్చితంగా నిమ్మకాయ పిండుకొని తింటుంటారు. నిమ్మకాయ పిండుకోకపోతే కొందరికి ముద్ద కూడా దిగదు. అయితే నిమ్మకాయ పిండుకొని తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నిమ్మకాయ పిండుకొని తినడం మంచిదేనా? నిమ్మకాయతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నాన్‌వెజ్‌పై నిమ్మకాయ పిండుకొని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రుచి డబల్ అవుతుంది
నిమ్మకాయలు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. నిమ్మకాయలు తింటే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్లత్వం మాంసంపై పిండినప్పుడు ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఆ రుచి డబల్ అవుతుంది. అందుకే చాలా మంది మాంసంపై నిమ్మకాయ పిండుకొని తింటారు. రుచికోసం నిమ్మకాయ రసాన్ని వినియోగిస్తారు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది
ప్రపంచంలో ఎవరిని అడిగిన చెప్పేది ఒకటే.. నిమ్మకాయలో విటమిన్ సీ ఉంటుంది అని. ఆ విటమిన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మాంసం జీర్ణం కావాలంటే సాధారణంగానే చాలా సమయం పడుతుంది. దానిపై ఒక్క నిమ్మబద్ద పిండుకొని తింటే రుచితో పాటు ఆ మాంసం కడుపులో తొందరగా జీర్ణమవుతుంది.
కడుపులోని బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది
నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి. ఆ గుణాలు మాంసంలోని బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. మాంసంలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలను నాశనం చేయాలంటే నిమ్మకాయ పిండుకొని తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు బ్యాక్టీరియాలు కూడా నాశనమవుతాయి.
రోగ నిరోధక శక్తి
నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సీ కారణంగా రోగ నిరోధక శక్తి భారీగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే మాంసంలో విటమిన్ సీ పిండుకొని తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. దీంతో ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడుకుంటా ఉంటాము.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం:
మాంసంపై నిమ్మకాయ పిండుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలి. అందులో ముఖ్యమైనది ఎక్కువగా నిమ్మకాయను పిండకూడదు. దీనివల్ల ఆహరం పుల్లగా మారుతుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే తాజాగా లేని మాంసంపై నిమ్మకాయ ఎట్టి పరిస్థితుల్లోనూ పిండకూడదు. తాజాగా లేని మాంసంపై నిమ్మకాయ పిండడం అనేది మన శరీరానికే చాలా హానికరం. అందుకే తాజాదనం లేని మాంసంపై నిమ్మకాయ పిండకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
