Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నాలుకపై మచ్చలు ఉంటే ఏమవుతుందో తెలుసా?
చాలా మందికి నాలుకపై మచ్చ ఉంటుంది. నాలుకపై మచ్చ ఉంటే అనుకున్నదంతా జరిగిపోతుంది అని చెబుతుంటారు. అందుకే నాలుకపై మచ్చ ఉండే వ్యక్తులతో చాలా మంది భయపడుతుంటారు. అయితే నాలుకపై మచ్చలు ఉండడం అనేది అనారోగ్య సమస్యలకు కారణం అని చెబుతున్నారు. నాలుకపై మచ్చలు ఉండడం వల్ల శరీరంలో ఎదో ఒక సమస్య ఉందనడానికి నిదర్శనమని, ఆ సమస్యల పరిష్కారం కోసం వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు అని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ నాలుకపై ఎలాంటి మచ్చలు ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రోగాలు..
నాలుకపై రంగులు, వాటి మార్పులు శరీరంలోని రోగాలను గుర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జ్వరం, దగ్గు, క్యాన్సర్ వంటి సమస్యలు ఉంటే నాలుగు రంగు మారుతుందని, అలాగే తన ఆకారం కూడా మారుతుందని చెబుతున్నారు. నాలుక రంగు మారినా, ఇబ్బందికరంగా అనిపించినా కచ్చితంగా ఎదో ఒక సమస్య ఉందని అర్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే నాలుకపై మచ్చలు కూడా రోగాలకు సూచకాలను పేర్కొంటున్నారు..

తెల్లటి మచ్చలు..
ఒకవేళ మీ నాలుకపై తెల్లటి మచ్చలు కనిపిస్తే.. మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తెల్లటి మచ్చలు క్యాన్సర్ కారకాలుగా పరిగణించొచ్చని అభిప్రాయపడుతున్నారు. మీకు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స, సలహాలు తీసుకోవాలని చెబుతున్నారు.
నల్ల మచ్చలుంటే..
నాలుకపై నలుపు, గోధుమ, కొన్ని కొన్ని చోట్ల తెలుపు మచ్చలుంటే శరీరంలో ప్రోటీన్ శాతం సరిగ్గా లేదని అర్ధం. ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ కారణంగా నాలుకపై ఇలాంటి మచ్చలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. నాలుకపై నల్ల మచ్చలు ఉన్నాయని చెప్పే వారిలో కూడా ప్రోటీన్ శాతం తక్కువగా ఉంటుందని, అందుకే వారి నాలుకపై నల్ల మచ్చలుంటాయని చెబుతున్నారు.
పింక్, ఎరుపు
నాలుక అప్పుడప్పుడు పింక్, రెడ్ కలర్‌లో కనిపిస్తుంటుంది. అయితే నాలుక పింక్, రెడ్ రంగుల్లో మారినట్లు అనిపిస్తే మనలో విటమిన్ లోపం ఉందని అర్ధం చేసుకోవాలి. విటమిన్ లోపం ఉండడం వలనే నాలుక పింక్, రెడ్ కలర్‌లోకి మారుతుందని ఆ రంగులోకి మారితే తగిన చికిత్స, విటమిన్స్ ఉన్న ఆహరం తీసుకోవాలంటున్నారు.
నాలుక పగిలితే..
నాలుకపై పగుళ్లు, నాలుక మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే నరాల రుగ్మత ఉన్నట్లు అర్ధం చేసుకోవాలని చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో నాలుక ఎక్కువగా పగిలిపోతుంటుందని పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే దీనికి సంబంధించిన చికిత్స చేయించుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ నాలుక కొరుక్కున్నపుడు అయిన గాయం తగ్గకపోతే అది క్యాన్సర్‌కు సంకేతమని భావించాలట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications