Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
బిగ్ అలర్ట్ : సాక్స్ లేకుండా షూ వేసుకుంటే..పెద్ద ప్రమాదమే!
ప్రస్తుతం మన లైఫ్ స్టైయిల్ లో చాలా మార్పులు వచ్చేశాయి. ఒకప్పుడు షూస్ అంటే తప్పనిసరిగా సాక్స్ లు ధరించేవాళ్లు. అయితే ఫ్యాషన్ ట్రెండ్స్‌లో వచ్చిన మార్పుల కారణంగా..చాలామంది ఈ రోజుల్లో సాక్స్ లేకుండా షూ వేసుకోవడం మొదలుపెట్టారు. అయితే సాక్స్ లేకుండా షూస్ ధరిస్తే చాలా పెద్ద సమస్యలే వస్తాయని ఓ పరిశోధనలో తేలింది. దీని వల్ల పాదాలే కాదు ఆరోగ్యానికి సంబంధించిన ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు తెలిపారు. సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటే వచ్చే సమస్యలు ఏంటో ఇక్కడ చూడండి.
రక్త ప్రసరణ
సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం ధరించడం వల్ల పాదాలకు హాని జరగడమే కాకుండా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి షూ వేసుకునే ముందు అది సరైనదో కాదో తెలుసుకోవాలి. బిగుతుగా లేదా వదులుగా ఉండే బూట్లు వేసుకోకూడదు. బిగుతుగా ఉన్న షూ ధరించనప్పుడు సాక్స్ వేసుకోవడం తప్పనిసరి. వాటి ప్రభావం నేరుగా పాదాల చర్మం మీద పడకుండా సాక్సులు కాపాడి సౌకర్యం ఇస్తాయి. మంచి నాణ్యమైన సాక్స్ లను ధరించాలి. ప్రతిరోజు వాటిని మార్చాలి.

మంట,దరుద సమస్యలు
పాదాలకు, బూట్లకు మధ్య సాక్స్ రక్షణ కవచంగా పనిచేస్తాయి. సాక్సులు లేకుండా బూట్లు వేసుకుని ఎక్కువసేపు నడవటం, పరిగెత్తడం వల్ల పాదాల్లో బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో మంట, దురద సమస్యలు వస్తాయి.
ఇన్ఫెక్షన్లు
ఎక్కువ సేపు బూట్లు ధరించినప్పుడు పాదాలలో చెమట పట్టడం సాధారణం. ఈ చెమటను పీల్చుకుని పాదాలను పొడిగా ఉంచడానికి సాక్స్ లు పనిచేస్తాయి. ఓ అంచనా ప్రకారం ఒక వ్యక్తి పాదాలు రోజుకు 300 మి.లీ చెమటను రిలీజ్ చేస్తాయి. సాక్స్ లేకుండా ఈ చెమట ఆరిపోదు. దీని కారణంగా పాదాలలో తేమ పెరుగుతుంది. దీంతో అలర్జీ, అనేక రకాల బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
అలర్జీ
కొందరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ క్రమంలో తోలు లేదా మరేదైనా సింథటిక్ పదార్థంతో సంబంధం కలిగి ఉండటం అలెర్జీకి కారణమవుతుంది. అందువల్ల బూట్లు తో సాక్స్‌లు ధరించడం బెటర్.
దుర్వాసన
పాదాలలో తేమ కారణంగా బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దీంతో పాదాల నుండి తరచుగా దుర్వాసన రావడం మొదలవుతుంది. మెయిన్ గా సాక్స్ లేకుండా లెదర్ షూస్ వేసుకుంటే ఈ సమస్య రెట్టింపు అవుతుంది.
తీవ్రమైన సమస్యలు కూడా
ఎక్కువసేపు సాక్స్ లేకుండా షూ వేసుకోవడం వల్ల పాదాలలో తేమ పెరుగుతుంది. అలాగే రాపిడి కారణంగా చర్మ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ అలాగే నిర్లక్ష్యం చేస్తే సెల్యులైటిస్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఈ సమస్యను ప్రారంభ దశలో గుర్తించి జాగ్రత్త తీసుకోకపోతే ఇది తీవ్ర వైద్య పరిస్థితికి కారణమవుతుంది. పాదాలలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉంటే వెంటనే డాక్టర్ ను కలవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
